ఒక కారు.. 15 లక్షల సేల్స్! | Hyundai i20 Sales Cross 1 5 Million Units in India | Sakshi
Sakshi News home page

ఒక కారు.. 15 లక్షల సేల్స్!

Jul 24 2026 4:21 PM | Updated on Jul 24 2026 5:04 PM

Hyundai i20 Sales Cross 1 5 Million Units in India

భారతదేశంలో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు కొత్త మైలురాయిని అధిగమించాయి. 2008లో ప్రారంభమైన ఈ కారు ఇప్పటి వరకు 15 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. దీన్నిబట్టి చూస్తే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో మూడవ తరం ఐ20 అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్‌తో పాటు, బ్లాక్-థీమ్ స్టైలింగ్‌తో నైట్ ఎడిషన్, స్పోర్టీ ఎన్ లైన్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

ఐ20 లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్‌లతో సహా అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఐ20 కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాగా ఐ20 ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. కాబట్టి ఇవి మంచి పనితీరును అందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement