కొత్త ఐ20.. ఇప్పుడు బ్రెజిల్ మార్కెట్లో! | New Hyundai i20 Launched in Brazil Know The Price and More | Sakshi
Sakshi News home page

కొత్త ఐ20.. ఇప్పుడు బ్రెజిల్ మార్కెట్లో!

Jun 14 2026 12:38 AM | Updated on Jun 14 2026 12:38 AM

New Hyundai i20 Launched in Brazil Know The Price and More

హ్యుందాయ్ కంపెనీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'i20'ను కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ పరిమాణం కొంత పెరగడంతో.. దీని పొడవు 4.1 మీటర్లకు చేరింది. దీంతో ఇది మునుపటి కంటే మరింత స్పేస్, ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.

ధరలు బ్రెజిల్ మార్కెట్లో 99,990 నుంచి 1,39,990 బ్రెజిలియన్ రియల్ వరకు ఉండగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18.8 లక్షల నుంచి రూ.26.3 లక్షల వరకు ఉంటుంది. ఇది కియా కే3 ప్లాట్‌ఫామ్‌కు ఆధారంగా నిర్మితమైంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కియా సెల్టోస్ కూడా నిర్మించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ క్రాష్ టెస్టుల్లో మంచి సేఫ్టీ రేటింగ్ సాధించినందున కొత్త i20 కూడా మరింత దృఢంగా తయారైనట్లు భావించవచ్చు.

డిజైన్ పరంగా కొత్త i20 పూర్తిగా లేటెస్ట్ లుక్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ అండ్ రియర్‌లో కనెక్టెడ్ లైట్ బార్‌లు, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ స్టాన్స్ దీనికి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఇంటీరియర్‌లో 12.3 ఇంచెస్ కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు, లోగో లెస్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఇందులో ఉంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. బూట్ స్పేస్ సుమారు 346 లీటర్లు ఉంది.

ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త i20లో రెండు 1.0 లీటర్ ఇంజిన్లు ఉన్నాయి. ఒకటి MPi ఫ్లెక్స్ ఫ్యూయల్ (నేచురల్ ఆస్పిరేటెడ్), మరొకటి TGDi టర్బో ఇంజిన్. ఇవి వరుసగా సుమారు 79bhp/100Nm - 113bhp/171Nm పవర్ డెలివరీ చేస్తాయి. ఈ ఇంజిన్లు పెట్రోల్, ఎథనాల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లకు అనుగుణంగా పనిచేస్తాయి.

బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కొత్త i20 అదే డిజైన్, ఫీచర్స్ వంటివాటితో భారతదేశానికి రావడం కష్టం. కానీ ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా మార్చబడే అవకాశం ఉంది. ఏడీఏఎస్ ఫీచర్లు ఉండకపోవచ్చు. ఇంజిన్ లైనప్‌లో 1.2-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో ఉండవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement