రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్‌షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? | Indian Railways AC Coach Secret Explained, Reason Behind Why You Get 2 Bedsheets In Every Bedroll Kit | Sakshi
Sakshi News home page

రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్‌షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా?

Jul 30 2026 5:58 PM | Updated on Jul 30 2026 7:10 PM

Indian Railways AC Coach Why You Get 2 Bedsheets in Every Bedroll Kit

రైలు ప్రయాణం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అయితే మీరెప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించి ఉంటే.. బెడ్‌రోల్ కిట్‌లో రెండు తెల్లని బెడ్‌షీట్లు, ఒక దిండు కవర్, ఒక చేతి తువాలు, ఒక దుప్పటి ఇచ్చి ఉంటారు. ఒక ప్రయాణికుడికి రెండు దుప్పట్లు ఎందుకు అని అనుమానం బహుశా చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

నిజానికి రెండు బెడ్‌షీట్లను చాలా మంది ప్రయాణికులు తమకు నచ్చినట్లు ఉపయోగిస్తుంటారు. కొందరు ఒకటి పరచుకుని, మరొకటి కప్పుకుంటే.. ఇంకొందరు ఒక బెడ్‌షీట్‌ను అసలు ఉపయోగించరు. కానీ.. ఈ రెండు బెడ్‌షీట్లను ఎందుకు ఇస్తారు? వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు.

ఏసీ కోచ్‌లో ఇచ్చే రెండు బెడ్‌షీట్‌లలో ఒకటి బెర్త్‌పై పరచుకోవాలి. రెండో బెడ్‌షీట్‌ను దుప్పటి కింద కప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం పరిశుభ్రత. బెడ్‌షీట్లు ప్రతి ప్రయాణం తర్వాత ఉతికి మళ్లీ ప్రయాణికులకు అందిస్తారు. అయితే.. ఉన్నితో తయారైన దుప్పట్లను ప్రతి ట్రిప్ తర్వాత ఉతకడం సాధ్యం కాదు. అందుకే దుప్పటి, ప్రయాణికుడి శరీరం మధ్య రక్షణ పొరలా రెండో బెడ్‌షీట్‌ను ఉపయోగించాలని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.

ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ ఎకానమీ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఈ బెడ్‌రోల్ కిట్.. టికెట్ ధరలో భాగంగానే అందిస్తారు. కాబట్టి దీనికోసం మళ్లీ అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ప్రయాణికులకు మరింత శుభ్రమైన బెడ్‌రోల్ అందించేందుకు రైల్వే శాఖ ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. కొన్ని యాంత్రిక లాండ్రీల్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్టెయిన్ డిటెక్షన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా బెడ్‌షీట్లపై ఉన్న మరకలను సులభంగా గుర్తించి, మెరుగైన నాణ్యతతో ఉతికే ప్రయత్నం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement