భారతదేశంలో ప్రారంభమైన తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో హైడ్రోజన్ ఇంజిన్ రైలును.. డీజిల్ ఇంజిన్ లాగుతున్నట్లు కనిపిస్తుంది. దీనిపై రైల్వే స్పందించి క్లారిటీ ఇచ్చింది.
రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలై 17న ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతోనే నడుస్తుంది.
అయితే.. ఈ రైలుకు అవసరమైన మెయింటెనెన్స్ మొత్తం షకుర్‌బస్తీ వర్క్‌షాప్‌లో జరుగుతుంది. అందువల్ల జింద్ నుంచి షకుర్‌బస్తీ వరకు రైలును నడపకుండా, ఒక లోకోమోటివ్ సహాయంతో లాగి తీసుకెళ్తారు. ఇది చాలా కాలంగా అమలులో ఉన్న సాధారణ రైల్వే విధానం. కొందరు దీనిని చూసి హైడ్రోజన్ ఇంజిన్ చెడిపోయిందని తప్పుగా ప్రచారం చేశారు.
ఇదీ చదవండి: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
రైల్వే బోర్డు కూడా ముందుగానే విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో మాత్రమే స్వయంగా నడుస్తుందని, నిర్వహణ కోసం ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు లోకోమోటివ్‌తో లాగాలని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రైల్వే వెల్లడించింది.
हाइड्रोजन ट्रेन का संचालन जींद - सोनीपत के बीच ही किया जा रहा हैं। स्टैंडर्ड प्रोसीजर के अनुसार, हाइड्रोजन ट्रेन को मेंटिनेंस के लिए आने जाने के लिए, लोकोमोटिव का उपयोग किया जाएगा।
उक्त पोस्ट भ्रामक एवं तथ्यहीन हैं। pic.twitter.com/mBrgZP3wKG— DLI Division NR (@drm_dli) July 19, 2026


