breaking news
Hydrogen Train
-
తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే..
పర్యావరణహిత రవాణా వ్యవస్థే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా ప్రవేశపెట్టిన దేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు ఇటీవలే విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్-సోనెపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైలు ఇప్పటికే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ ఆధారంగా త్వరలోనే ఢిల్లీ రూట్‌తో పాటు చారిత్రాత్మక కాల్కా-శిమ్లా, ఇతర పర్వత ప్రాంతాల (హెరిటేజ్ రూట్లు) వైపు ఈ సేవలను విస్తరించేందుకు భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.జింద్ - సోనెపట్ సక్సెస్తొలి విడతగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేసింది.3,200+ లీటర్ల డీజిల్ పొదుపు: కేవలం 1,200 కి.మీల ప్రయాణంలోనే దాదాపు 3,200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వాడకాన్ని తగ్గించింది.జీరో కార్బన్ ఉద్గారాలు: ఈ రైలు నుంచి విషపూరిత పొగ లేదా కార్బన్ డై ఆక్సైడ్ వెలువడదు. రసాయన ప్రక్రియ ద్వారా కేవలం నీటి ఆవిరి, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉపఉత్పత్తిగా బయటకు వస్తాయి.శబ్ద రహిత ప్రయాణం: సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం దాదాపు శూన్యం.ఢిల్లీ, కాల్కా-శిమ్లా హెరిటేజ్ రూట్లకు విస్తరణజింద్-సోనెపట్ రూట్లో విజయం సాధించడంతో రైల్వే శాఖ తదుపరి దశ పరీక్షలకు సిద్ధమైంది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాల్కా-శిమ్లా నారోగేజ్ ట్రాక్‌పై ఈ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ రైళ్ల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ రైళ్లను తీసుకురానున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
హైడ్రోజన్ రైలుకు స్పందన కరువు!?
భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది.అత్యాధునిక సౌకర్యాలు, కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్యే టికెట్ ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రారంభ రోజుల్లో ప్రయాణికుల స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తొలి రోజు జింద్ నుంచి బయలుదేరిన రైలులో సాధారణ ప్రయాణికులు సుమారు 20 మంది మాత్రమే ప్రయాణించగా, రెండో రోజూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.ఎందుకు తక్కువ మంది ప్రయాణిస్తున్నారు?రైల్వే వర్గాల అంచనా ప్రకారం, జింద్–సోనిపట్ మార్గంలో ఇప్పటికే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాల కొరత లేదు. కొత్త హైడ్రోజన్ రైలు గురించి ఇంకా చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ప్రచారం పెరిగి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌కు బదులుగా ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్లను నడుపుతుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.ప్రత్యేకతలు ఇవే..🔹 10 కోచ్‌లతో సుమారు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం.🔹 మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు.🔹 డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు.🔹 పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ.🔹 హైడ్రోజన్ లీకేజ్, మంటలు, ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలు.🔹 జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ మౌలిక సదుపాయాలు.🔹 గరిష్ఠ డిజైన్ వేగం గంటకు 110 కి.మీ.( ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కి.మీ. వేగంతో నడుస్తోంది)హైడ్రోజన్ ఆధారిత రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భవిష్యత్తులో పూర్తిగా విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి రైళ్ల వినియోగాన్ని విస్తరించే దిశగా భారతీయ రైల్వేలు ఈ ప్రాజెక్టును పైలట్‌గా ఉపయోగించనున్నాయి. -
హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే!
భారతదేశంలో ప్రారంభమైన తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో హైడ్రోజన్ ఇంజిన్ రైలును.. డీజిల్ ఇంజిన్ లాగుతున్నట్లు కనిపిస్తుంది. దీనిపై రైల్వే స్పందించి క్లారిటీ ఇచ్చింది.రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలై 17న ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతోనే నడుస్తుంది.అయితే.. ఈ రైలుకు అవసరమైన మెయింటెనెన్స్ మొత్తం షకుర్బస్తీ వర్క్‌షాప్‌లో జరుగుతుంది. అందువల్ల జింద్ నుంచి షకుర్బస్తీ వరకు రైలును నడపకుండా, ఒక లోకోమోటివ్ సహాయంతో లాగి తీసుకెళ్తారు. ఇది చాలా కాలంగా అమలులో ఉన్న సాధారణ రైల్వే విధానం. కొందరు దీనిని చూసి హైడ్రోజన్ ఇంజిన్ చెడిపోయిందని తప్పుగా ప్రచారం చేశారు.ఇదీ చదవండి: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?రైల్వే బోర్డు కూడా ముందుగానే విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో మాత్రమే స్వయంగా నడుస్తుందని, నిర్వహణ కోసం ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు లోకోమోటివ్‌తో లాగాలని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రైల్వే వెల్లడించింది.हाइड्रोजन ट्रेन का संचालन जींद - सोनीपत के बीच ही किया जा रहा हैं। स्टैंडर्ड प्रोसीजर के अनुसार, हाइड्रोजन ट्रेन को मेंटिनेंस के लिए आने जाने के लिए, लोकोमोटिव का उपयोग किया जाएगा।उक्त पोस्ट भ्रामक एवं तथ्यहीन हैं। pic.twitter.com/mBrgZP3wKG— DLI Division NR (@drm_dli) July 19, 2026 -
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
భారతదేశం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని.. వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఈ కథనంలో ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. మధ్యలో అనేక చిన్న స్టేషన్లలో ఆగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే.. ఈ రైలులో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు (టికెట్ ధర) కూడా చాలా తక్కువే కావడం గమనార్హం. రూ.5 నుంచి రూ.25 వరకు మాత్రమే టికెట్ చార్జీ ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరూ ఈ రైలులో ప్రయాణించవచ్చు. దీన్నిబట్టి చూస్తే.. ఈ ట్రైన్ టికెట్ ప్రారంభ ధర.. సాధారణ ట్రైన్ ప్లాట్‌ఫామ్ టికెట్ రేటు (రూ.10) కంటే తక్కువ అని తెలుస్తోంది.ఈ రైలు సాధారణ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ రైళ్ల మాదిరిగా కాకుండా.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. అంటే ఈ ట్రైన్ ముందుకు వెళ్ళడానికి డీజిల్, ఎలక్ట్రిక్ (కరెంట్) అవసరం లేదు. హైడ్రోజన్ ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ట్రైన్ ముందుకు వెళ్తుందన్నమాట. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. తద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 50% సబ్సిడీ!ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం హైడ్రోజన్ లీకేజీ, పొగ, మంటలు, అధిక ఉష్ణోగ్రతలను గుర్తించే ఆధునిక భద్రతా వ్యవస్థలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.హైడ్రోజన్ రైలు ప్రారంభం కావడంతో.. భారత్ జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన నిలిచింది. ఇది భారతదేశానికి గర్వకారణమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణహిత రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. -
హరిత రవాణా దిశగా ముందడుగు
జింద్/జలంధర్: దేశంలో హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఒక విజయవంతమైన ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ఆయన శుక్రవారం హరియాణాలోని జింద్ స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రపంచంలో హైడ్రోజన్ ఇంధన రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మోదీ హరియాణాలో రూ.14,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక రవాణా వ్యవస్థ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన పరిస్థితులు ఒకవేళ 2014కు ముందే ఏర్పడి ఉంటే భారతీయ రైల్వేల కార్యకలాపాలు స్తంభించిపోయేవని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు ప్రధానంగా డీజిల్‌తో నడిచేవని గుర్తుచేశారు. అప్పట్లో డీజిల్ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటే డీజిల్ ఆధారిత రైళ్లు ఆగిపోయేవని పేర్కొన్నారు. దేశం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. కానీ, ఇది 2014 నాటి పరిస్థితి కాదన్నారు. ‘‘సమస్యలకు పరిష్కారాలను ముందుగానే ఆలోచించి, వాటిని క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే వ్యక్తి మోదీ. పశి్చమాసియా నేడు రణరంగంగా మారింది. హార్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం, చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత రైల్వేలు, దేశ అభివృద్ధి పరుగు మాత్రం ఆగిపోలేదు’’అని వ్యాఖ్యానించారు. అత్యంత పొడవైన రైలు ‘‘హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడిపే సామర్థ్యం కేవలం మూడు లేదా నాలుగు దేశాలకు మాత్రమే ఉంది. 21వ శతాబ్దపు ఈ సాంకేతికత విషయంలో భారతీయ రైల్వే ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ రైలు 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత పొడవైనది(10 కోచ్‌లు) కూడా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలుకు కేవలం మూడు లేదా నాలుగు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, మన దేశంలో ఈ రైలుకు 10 కోచ్‌లు ఉన్నాయి. ఈ భారీ హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. భవిష్యత్తులో హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం జింద్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయం. స్వచ్ఛతను ప్రజలు తమ జీవన విధానంలో, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాలి. జింద్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ కీర్తితోనూ, పాండవులకు సంబంధించిన విశ్వాసంతోనూ ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని గర్వంగా భావి తరాలకు అందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఇదే స్ఫూర్తితో కురుక్షేత్రలో ఈ రోజు ఒక సిక్కు మ్యూజియంకు శంకుస్థాపన చేశాం. ఈ కొత్త మ్యూజియం హరియాణా సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది’’అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వేర్వేరు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కేరళలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో 13 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ‘వికసిత్ భారత్’దిశగా సాగే ప్రయాణంలో భవిష్యత్తుకు సంబంధించిన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాలకు కూడా మేలు చేకూర్చే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. మోదీ శుక్రవారం పంజాబ్‌లో పర్యటించారు. రూ.5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వానికి స్వచ్ఛమైన ఉద్దేశాలు గానీ, నిజాయితీ గానీ లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, కనీసం పోలీస్ స్టేషన్లు కూడా సురక్షితంగా లేవని ఆరోపించారు. ఇది ‘ఖట్టర్ బీమాన్ సర్కార్’అని విమర్శించారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎప్పుడు, ఎక్కడ ముఠా పోరు చెలరేగుతుందో, ఏ దిశ నుంచి తూటాలు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేరని ఆందోళన వ్యక్తంచేశారు. జలంధర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బహిరంగంగానే బలవంతపు వసూళ్లు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదన్నారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిజమైన మార్పును తీసుకురావడంతోపాటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన పంజాబ్‌ను నిర్మించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ తేల్చిచెప్పారు. -
భారత రైల్వే చరిత్రలో గ్రీన్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్’వైపు అడుగులు వేసింది. బ్రాడ్‌గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్! హరియాణాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్ ప్రెజర్ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’కింద భారత్‌లోనే రూపొందించారు. రైలు ప్రత్యేకతలు.. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్‌లతో మాత్రమే నడుస్తుండగా, భారత్‌లో ఏకంగా 10 కోచ్‌ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డ్నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్‌పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీలను జతచేశారు.నిప్పులు చిమ్మని హరిత రథంమారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్‌తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా పనిచేస్తుంది? సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్మెంట్లో భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువును నిల్వచేసే ట్యాంకర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్సెల్ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్‌లోని హైడ్రోజన్‌ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్‌సెల్‌లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్ సెల్‌లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్ సెల్‌లోకి వెళ్లవు. ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్‌సెల్‌లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్‌తో ఎల్రక్టానిక్ రసాయన చర్య జరిపి విద్యుత్‌ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్ మాత్రం అక్కడే ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ హర్‌ప్రీత్ సింగ్ అరోరా చెప్పారు. ఓవర్‌హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి వచ్చే విద్యుత్‌తో విద్యుత్ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ ఈ ప్రోటాన్ ఎక్సే్ఛంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ విధానంలో ఆక్సీజన్‌తో చర్య జరిపి అటు విద్యుత్‌ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ మేథోసంస్థలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మౌష్మీ మొహంతీ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వేలో కొత్త శకం.. భారత్ తొలి హైడ్రోజన్ రైలు.. ఫుల్ డీటెయిల్స్..
హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారత్ చేరుతోంది.. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు సేవలను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. 10 బోగీలతో రూపొందించిన ఈ రైలుకు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చేసిన అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఇది ఒకటి. సాధారణ విద్యుత్ రైళ్ల మాదిరిగా పైభాగంలో ఉండే విద్యుత్ తీగలు, డీజిల్ ఇంజిన్‌పై ఇది ఆధారపడదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ల సాయంతో రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నేరుగా వెలువడే ఉద్గారాలుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయని పత్రికా సమాచార శాఖ తెలిపింది. బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసి డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తోంది. భారతీయ రైల్వే చేపట్టిన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయి.మార్గం వివరాలుహైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. ఈ రైలు జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఈసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది. ప్రతిపాదిత హాల్ట్లలో కూడా సేవలు అందిస్తుంది.సాధారణ పరిస్థితుల్లో హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైలు సేవలు ఎంత సమర్థంగా, ఎంత భద్రంగా, ఎంత విశ్వసనీయంగా పనిచేస్తాయో నిరూపించేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లతో పరుగులుఈ రైలు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ (పీఈఎం) ఫ్యూయల్ సెల్ వ్యవస్థతో పనిచేస్తుంది. అధిక పీడన సిలిండర్లలో నిల్వ చేసిన హైడ్రోజన్, వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లను నడుపుతుంది.ఈ రైలులో రెండు చివరల వద్ద రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, మధ్యలో 8 ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. ప్రతి పవర్ కారు 1,200 కిలోవాట్ల శక్తి, అంటే దాదాపు 1,600 హార్స్పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. అయితే పైలట్ దశలో ఉత్తర రైల్వే పరిధిలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సేవల నిర్వహణకు అవసరంగా హరియాణాలోని జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని భారతీయ రైల్వే నిర్మించింది.ఈ కేంద్రంలో విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. దానిని 500 బార్ పీడనానికి కుదించి, 350 బార్ పీడనంతో రైలుకు నింపుతారు. దీనివల్ల రెండు పవర్ కార్లలో ఒకేసారి హైడ్రోజన్ నింపే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది సాధారణ రైలు సేవలు కొనసాగించేందుకు సరిపోతుంది.అధికారుల సమాచారం ప్రకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, కుదింపు, నింపడం, రైలు నిర్వహణ వంటి అన్ని దశలను కలిపిన దేశంలోని తొలి సమగ్ర రైల్వే హైడ్రోజన్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుతో ఏర్పడింది.విదేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే పెద్దదిహైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువ రైళ్లలో 2 నుంచి 4 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా ప్రాంతీయ మార్గాల్లోనే అవి నడుస్తున్నాయి.10 బోగీలతో రూపొందించిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. అధిక సామర్థ్యం ఉన్న ప్రయాణికుల రైలు సేవలకు హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించవచ్చని ఇది నిరూపిస్తోందని తెలిపింది.భారత్‌లోనే తయారీభారతీయ రైల్వే ఆధ్వర్యంలో స్వదేశీ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశారు. పరిశోధన, నమూనాల రూపకల్పన, ప్రమాణాల సంస్థ (ఆర్డీఎస్ఓ) సాంకేతిక రూపకల్పన, ఆమోద ప్రక్రియకు నాయకత్వం వహించింది. మేధా సర్వో డ్రైవ్స్ రైలు వ్యవస్థను సమీకరించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బాహ్య రూపాన్ని రూపొందించింది.జింద్-సోనిపట్ రైలు సేవలు తొలుత పైలట్ ప్రాజెక్టుగా నడుస్తాయి. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా, దీర్ఘకాలిక నెట్ జీరో లక్ష్యాల దిశగా కల్కా-షిమ్లా రైల్వే వంటి వారసత్వ మార్గాల్లో కూడా హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.Are you excited for Bharat's first Hydrogen Train?#HydrogenTrain#भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन pic.twitter.com/6uhyLaGC4n— Ministry of Railways (@RailMinIndia) July 16, 2026 -
జర్మనీ తర్వాత భారత్.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు..
భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్‌లో అడుగుపెట్టబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు పెట్టే ఈ రైలు భారత రైల్వే రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలకనుంది.భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును సిద్ధం చేస్తున్నాయి. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిదశలో పరీక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రైలు పనిచేసే విధానం కూడా ఆసక్తికరమే. సాధారణ రైళ్లలా డీజిల్ దహనం కాదు.. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ఫ్యూయల్ సెల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో రైలు కదులుతుంది. ఈ ప్రక్రియలో వెలువడేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. అంటే పొగ లేదు.. కాలుష్యం తక్కువ.భారత్ రూపొందిస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సాధారణ రైలు కాదు. ఇది 10 కోచ్‌లతో, రెండు డ్రైవింగ్ పవర్ కార్లతో రూపొందుతోంది. సుమారు 2,400 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో భారత బ్రాడ్‌గేజ్ మార్గాల్లో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ రైలు వెనుక భారత రైల్వే పరిశోధన సంస్థ RDSO కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం హర్యానాలోని జింద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ఈ రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతికత భారత్‌కు కొత్త కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. హైడ్రోజన్ రైలును వాణిజ్య ప్రయాణికుల సేవల్లో తొలిసారిగా ఉపయోగించిన దేశం జర్మనీ.🚨 HUGE! India’s first indigenous Hydrogen Train has been OFFICIALLY approved.— The pilot run will take place on the Jind–Sonipat section in Haryana.— The train features a 10-coach hydrogen-powered configuration. pic.twitter.com/MblnoqrTRw— Megh Updates 🚨™ (@MeghUpdates) June 5, 2026 2022లో జర్మనీ Alstom Coradia iLint పేరుతో ప్రపంచంలోని తొలి వాణిజ్య హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైలును ఉపయోగించారు. పొగకు బదులుగా నీటి ఆవిరితో ప్రయాణం సాగించడం దీని ప్రత్యేకత. జపాన్, చైనా, అమెరికా కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్‌లో East Japan Railway Company హైడ్రోజన్ ఆధారిత రైళ్లను పరీక్షించింది. చైనా పట్టణ రవాణా, తక్కువ దూర మార్గాల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో కూడా డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రవాణాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.హైడ్రోజన్ రైళ్ల వల్ల ముఖ్యంగా విద్యుదీకరణ చేయడం కష్టమైన మార్గాల్లో భారీ ప్రయోజనం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, తక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో డీజిల్ స్థానాన్ని ఇవి భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రైళ్ల ప్రయాణం అంత సులభం కాదు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు, నిల్వ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక స్టేషన్ల నిర్మాణం వంటి సవాళ్లు ఉన్నాయి. కానీ ఒకసారి ఈ వ్యవస్థ విస్తృతంగా అందుబాటులోకి వస్తే రైల్వే రంగంలో కాలుష్యాన్ని తగ్గించే అతిపెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత రైల్వే పట్టాలపై కనిపించబోయేది కేవలం మరో రైలు కాదు.. పర్యావరణాన్ని కాపాడుతూ పరుగులు పెట్టే కొత్త భారతానికి ప్రతీకగా నిలిచే హైడ్రోజన్ రైలు.🚨 BIG BREAKING Indiaʼs first HYDROGEN-POWERED train SUCCESSFULLY completed its trial run between Delhi and Jind 🔥 — Reached speeds of up to 120 kmph.— Emergency braking and oscillation performance were SUCCESSFULLY tested. pic.twitter.com/KOh5uesN9J— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026అసలు లక్ష్యం ఏంటి?భారత రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇప్పటివరకు డీజిల్ లోకోమోటివ్‌లు నడిచే మార్గాల్లో ఇంధన ఖర్చు, కాలుష్యం రెండూ పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు “Hydrogen for Heritage” వంటి ప్రాజెక్టుల కింద హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.హైడ్రోజన్ రైళ్లు ముఖ్యంగా..విద్యుదీకరణ లేని రైల్వే మార్గాలపర్వత ప్రాంతాలుపర్యాటక ప్రాధాన్యత ఉన్న మార్గాలుతక్కువ రద్దీ ఉన్న రూట్లు.. వంటి ప్రాంతాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.హెరిటేజ్ రూట్లకు ప్రాధాన్యం ఎందుకు?భారత రైల్వేలు కొన్ని చారిత్రక రూట్లలో డీజిల్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ మార్గాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించే ఆలోచన ఉంది. ఉదాహరణకు కొండ ప్రాంత రైల్వే మార్గాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,500 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 27 హైడ్రోజన్ సిలిండర్లు, హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. -
హైడ్రోజన్ రైలుకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర రైల్వే జోన్ పరిధిలోని జింద్–సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించనుంది. డీజిల్, విద్యుత్ ద్వారా కాకుండా హైడ్రోజన్ బ్యాటరీల నుంచి అందే శక్తితో ఇది నడుస్తుంది.భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి మూడు నెలల పాటు నిపుణులైన సిబ్బంది రైలులోనే అందుబాటులో ఉంటారని రైల్వే శాఖ తెలిపింది. అయితే, రైల్వే శాఖ అనుమతితో ఈ రైలు వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. పలు నిబంధనల అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ దశలను దాటాల్సి ఉందని వివరించారు.హైడ్రోజన్ రైలు నడిచేదిలా..సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.చదవండి: కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరందేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్‌ను గతేడాది జూలైలో చెన్నైలోని ఐసీఎఫ్ వద్ద రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. భారత్ 1,200 HP పేరుతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు పనితీరును కూడా పరీక్షించేందుకు తాజాగా సిద్ధమైంది రైల్వే శాఖ. హైడ్రోజన్ రైలు అందుబాటులో వస్తే కాలుష్యం తగ్గడంతో పాటు భారతీయ రైల్వే టెక్నాలజీ పరంగా మరో మైలురాయిని అందుకుంటుంది.


