సరికొత్త టయోటా హైలక్స్: ధర ఎంతంటే? | 2026 Toyota Hilux Launched at Rs 31 99 Lakh | Sakshi
Sakshi News home page

సరికొత్త టయోటా హైలక్స్: ధర ఎంతంటే?

Jul 30 2026 4:52 PM | Updated on Jul 30 2026 4:54 PM

2026 Toyota Hilux Launched at Rs 31 99 Lakh

టయోటా భారతదేశంలో తొమ్మిదవ తరం హైలక్స్‌ను లాంచ్ చేసింది. ఈ పికప్ ట్రక్ జీఎక్స్ 4x2 ఏటీ, జీఎక్స్ 4x4 ఏటీ, వీఎక్స్ 4x4 ఏటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

టయోటా హైలక్స్ సరికొత్త మోడల్ IMV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. దీని మునుపటి మోడల్‌కు ఆధారమైన అదే బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఇది. భారతదేశంలో డబుల్ క్యాబ్ బాడీ స్టైల్‌లో లభిస్తుంది. ఈ పికప్ ట్రక్ ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, బ్లాక్ ట్రిమ్‌తో సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కార్గో బెడ్ 500 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

హైలక్స్ పికప్ ట్రక్ కొత్త డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటివి మాత్రమే కాకుండా.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, టెర్రైన్ మోడ్‌లు, ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 201 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.8-లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. కాగా ఇది సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.

ఇదీ చదవండి: సీఎన్‌జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement