గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 180.83 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 77,835.43 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 24,296.50 వద్ద నిలిచింది.
బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


