దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్ల లాభాల దన్నుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు లేదా 1.16 శాతం పెరిగి 77,654.60 వద్ద, నిఫ్టీ 265 పాయింట్లు లేదా 1.1 శాతం పెరిగి 24,250.20 వద్ద స్థిరపడ్డాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.82 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.48 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ మెరుగైన పనితీరు కనబరిచాయి.



