‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్‌.. రియల్టీ షేర్లు పతనం | Stock Market Today Updates On Sep 11th, Sensex Falls 654 Points And Nifty Drops 230 Points In Early Trade | Sakshi
Sakshi News home page

‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్‌.. రియల్టీ షేర్లు పతనం

Sep 11 2026 9:51 AM | Updated on Sep 11 2026 10:29 AM

Stock Market latest updates Sensex slumps 600 pts Nifty Realty tumbles

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 230 పాయింట్లు తగ్గి 23,247 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ (Sensex) 654 పాయింట్లు నష్టపోయి 74,248 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 50 ఇండెక్స్ లో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.42 శాతం, 1.40 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ రియాల్టీ భారీగా పతనం కాగా, నిఫ్టీ ఐటీ మాత్రమే లాభాలను నమోదు చేసింది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.06

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 107.63 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.91 శాతానికి చేరాయి.
  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.58 శాతం నష్టపోయింది.
  • నాస్‌డాక్‌ 0.65 శాతం పడిపోయింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement