కార్పొరేట్లకు ముకేశ్‌ అంబానీ పిలుపు | Mukesh Ambani Urges Corporates Support System Working Women | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు ముకేశ్‌ అంబానీ పిలుపు

Sep 11 2026 8:47 AM | Updated on Sep 11 2026 9:23 AM

Mukesh Ambani Urges Corporates Support System Working Women

ముంబై: ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఇందుకోసం కంపెనీలు సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు. ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్, సేల్స్‌ఫోర్స్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో అరుంధతి భట్టాచార్య రాసిన ‘ఇన్‌డామిటబుల్‌: ఎ వర్కింగ్‌ ఉమన్స్‌ నోట్స్‌ ఆన్‌ వర్క్, లైఫ్‌ అండ్‌ లీడర్‌షిప్‌’ హిందీ ఎడిషన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. 

దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని  ముకేశ్‌ అంబానీ  ఉద్ఘాటించారు. అరుంధతి భట్టాచార్య జీవితం ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement