ఆగని భూ పందేరం | Land allotment at Anandapuram to Ecobox Industrial Asset Company | Sakshi
Sakshi News home page

ఆగని భూ పందేరం

Jul 12 2026 5:21 AM | Updated on Jul 12 2026 5:21 AM

Land allotment at Anandapuram to Ecobox Industrial Asset Company

బెర్రీ అల్లాయ్‌స్‌కు 93.43 ఎకరాలు కేటాయిస్తూ జారీ అయిన జీఓ–171 , అక్షత్‌ గ్రీన్‌టెక్‌ సంస్థకు భూకేటాయింపుల జీఓ–170

ఎకోబాక్స్‌ ఇండస్ట్రియల్‌ అసెట్‌ సంస్థకు ఆనందపురం వద్ద 91.38 ఎకరాలు 

అనకాపల్లి వద్ద బెర్రీ అల్లాయిస్‌కు 93.43 ఎకరాలు 

అక్షత్‌ గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌కు పరవాడ వద్ద 34.02 ఎకరాలు 

బెర్రీ అల్లాయిస్‌కు విజయనగరం బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో 93.43 ఎకరాలు

గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీ జీయో మైసూర్‌కు కర్నూలు జిల్లాలో 998.10 ఎకరాలు 

ఆయా సంస్థలకు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి : ఉమ్మడి విశాఖ జిల్లాలోని విలువైన భూములను చంద్రబాబు సర్కారు కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోంది. గడిచిన రెండేళ్లలో వందల ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్, బినామీ సంస్థలకు కట్టబెట్టిన సర్కారు.. తాజాగా పలు సంస్థలకు తక్కువ ధరకే భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకోబాక్స్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ అనే సంస్థ ఆనందపురం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్‌ పార్క్‌ కోసం 91.38 ఎకరాలను ఎకరా రూ.55 లక్షలు చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వీటికి వీఎంఆర్‌డీఏ, ఏపీఐఐసీ మౌలిక వసతులను కల్పించనున్నాయి. అక్షత్‌ గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ అనకాపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న 3.5 గిగావాట్ల సోలార్‌ సెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు పరవాడలో ఎకరం రూ.65 లక్షల చొప్పున చౌక ధరకు 34.02 ఎకరాలు కేటాయించింది. బెర్రీ అల్లాయిస్‌ ఏర్పాటు చేయనున్న మాంగనీస్‌ సింటర్‌ ప్లాంట్‌కు విజయనగరం బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో ఎకరం రూ.77.25 లక్షలు చొప్పున 93.43 ఎకరాలను కేటాయించింది.

కర్నూలులో దేవదాయ భూముల సేకరణ
కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీ జీయో మైసూర్‌ కంపెనీకి 998.10 ఎకరాలను సేకరించి ఇవ్వడానికి ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఇందులో 40.12 ఎకరాలుగా ఉన్న దేవదాయ భూములను లీజు విధానంలో సేకరించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement