నేటికీ ఇంటికే పరిమితం? | Women Earn Less And Work More At Home Survey Finds | Sakshi
Sakshi News home page

నేటికీ ఇంటికే పరిమితం?

Jul 30 2026 10:11 AM | Updated on Jul 30 2026 10:34 AM

Women Earn Less And Work More At Home Survey Finds

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

ఎన్‌ఎస్‌ఓ సర్వే నివేదికల ప్రకారం..

మహిళలు సాధికారత సాధించారని, అభివృద్ధిపథంలో ముందున్నారని  మాటలు చెప్పేస్తుంటారు. కానీ నివేదికలు మాత్రం ఇవన్నీ ఉత్తిమాటలేనని తేటతెల్లం చేస్తున్నాయి.

దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇంటి, సంరక్షణ బాధ్యతల భారం కేవలం మహిళలపైనే పడుతోందని జాతీయ గణాంక కార్యాలయం చేపట్టిన సర్వేలో తేలింది. భారత్‌లోని 46 అతిపెద్ద నగరాల్లో (మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో) సుమారు 69 శాతం మంది మహిళలు కేవలం పిల్లల పెంపకం, ఇంటి పనుల కారణంగానే ఉద్యోగాలకి దూరంగా ఉంటున్నారని ఈ సర్వే తెలిపింది.

1%
దేశవ్యాప్తంగా సామాజిక కారణాల వల్ల తాము ఉద్యోగానికి దూరంగా ఉంటున్నామని చెప్పిన మహిళలు ఒక్క  శాతం కాగా, అలాగే పిల్లల సంరక్షణ ఇంటి బాధ్యతల కారణంగా తాము కూడా ఉద్యోగాలు చేయలేకపోతున్నామని చెప్పిన మగవారు కూడా ఒక్కశాతమే ఉండటం గమనార్హం.

30.7%
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలోని మహిళల ఉద్యోగ భాగస్వామ్యం అత్యల్పంగా 2025 నాటికి 30.7 శాతంగా నమోదైంది. అయితే ఈ మధ్యకాలంలో గణాంకాల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.

23%
పెద్ద నగరాల్లో పురుషుల కంటే మహిళలు 23% తక్కువ సం΄ాదిస్తున్నారు.  దేశంలో, ఈ ధోరణి నగరాల మధ్య మారుతూ ఉంది. ఉదాహరణకు హౌరాలోని 83% మంది మహిళలు తాము ఉ΄ాధి రంగానికి దూరంగా ఉండటానికి పిల్లల సంరక్షణ, ఇంటి పనులే కారణమని తెలపగా, ఆ తర్వాత సూరత్‌ (81%), పింప్రి చించ్వాడ్‌ , భో΄ాల్‌ (78%), ధ¯Œ బాద్‌ (77%) ఉన్నాయి. అదేవిధంగా ఆగ్రా (41%), కోటా (57%), హైదరాబాద్‌ (58%), అలాగే విశాఖపట్నం, శ్రీనగర్‌లలో (60%) ఈ శాతంగా నమోదు అయింది. అయితే కొయంబత్తూర్‌లో ఈ శాతం చాలా తక్కువగా (38%) ఉంది.

10%
16 శాతం మంది మహిళలు ఉన్నత చదువుల కోసం, 10 శాతం మంది ఆరోగ్యం, వయోపరిమితి వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, ఉద్యోగాల్లో లేని పురుషుల్లో సగానికి పైగా (53%) మంది ఉన్నత చదువుల కోసమేనని చెప్పగా, 39 శాతం మంది ఆరోగ్యం, వయస్సుకు సంబంధించిన కారణాలను చూ΄ారు.

51%
ఇతర పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, నగరాల్లో మహిళలకు లభించే ఉద్యోగాల శాతం మెరుగ్గా ఉంది. పెద్ద నగరాల్లో 65 శాతం మంది మహిళలు వేతనంతో కూడిన రెగ్యులర్‌ ఉద్యోగాలు చేస్తుండగా, పట్టణాల్లో 51 శాతం మాత్రమే ఉంది. అలాగే నగరాల్లో 3 శాతం మంది మాత్రమే రోజువారీ వేతన కార్మికులుగా ఉండగా, పట్టణాల్లో 9%గా ఉన్నారు.

రూ. 23,700/
వేతనాల్లోనూ స్త్రీ, పురుషుల మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో పురుషులు నెలకు సగటున రూ. 30,700 సం΄ాదిస్తుండగా, మహిళలు మాత్రం నెలకు రూ. 23,700 మాత్రమే సం΄ాదిస్తున్నారు. అంటే 23 శాతం తక్కువ. కళ్యాణ్‌–డోంబివిలి, నవీ ముంబై, నాగ్‌పూర్‌ వంటి నగరాల్లో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. అక్కడ మహిళలు పురుషుల సం΄ాదనలో దాదాపు సగం మాత్రమే ΄÷ందుతున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)  మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఉంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల సం΄ాదన ఎక్కువగా నమోదైంది.

రూ. 16,160/
స్వయం ఉ΄ాధిలో పురుషుల నెలవారీ ఆదాయం (రూ. 33,880), మహిళల ఆదాయం (రూ. 16,160) కంటే రెట్టింపుగా ఉంది.

49.5 గంటలు
పట్టణ ప్రాంతాల్లోని కార్మికులు వారానికి సగటున 47.1 గంటలు పనిచేస్తుంటే, పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని కార్మికులు వారానికి 49.5 గంటలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పెద్ద నగరాల్లోని పురుష, స్త్రీ ఉద్యోగులిద్దరూ ఎక్కువ సగటు గంటలు పనిచేస్తున్నట్లు నమోదైంది.

51.5 గంటలు
ఉద్యోగాలు చేసే మహిళలలో.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ (51.5 గంటలు),  తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌  (50 గంటలు) నగరాలకు చెందిన మహిళలు ఆఫీస్‌లలో అత్యధిక సమయం పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement