breaking news
urban india
-
నేటికీ ఇంటికే పరిమితం?
మహిళలు సాధికారత సాధించారని, అభివృద్ధిపథంలో ముందున్నారని మాటలు చెప్పేస్తుంటారు. కానీ నివేదికలు మాత్రం ఇవన్నీ ఉత్తిమాటలేనని తేటతెల్లం చేస్తున్నాయి.దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇంటి, సంరక్షణ బాధ్యతల భారం కేవలం మహిళలపైనే పడుతోందని జాతీయ గణాంక కార్యాలయం చేపట్టిన సర్వేలో తేలింది. భారత్‌లోని 46 అతిపెద్ద నగరాల్లో (మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో) సుమారు 69 శాతం మంది మహిళలు కేవలం పిల్లల పెంపకం, ఇంటి పనుల కారణంగానే ఉద్యోగాలకి దూరంగా ఉంటున్నారని ఈ సర్వే తెలిపింది.1%దేశవ్యాప్తంగా సామాజిక కారణాల వల్ల తాము ఉద్యోగానికి దూరంగా ఉంటున్నామని చెప్పిన మహిళలు ఒక్క శాతం కాగా, అలాగే పిల్లల సంరక్షణ ఇంటి బాధ్యతల కారణంగా తాము కూడా ఉద్యోగాలు చేయలేకపోతున్నామని చెప్పిన మగవారు కూడా ఒక్కశాతమే ఉండటం గమనార్హం.30.7%ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలోని మహిళల ఉద్యోగ భాగస్వామ్యం అత్యల్పంగా 2025 నాటికి 30.7 శాతంగా నమోదైంది. అయితే ఈ మధ్యకాలంలో గణాంకాల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.23%పెద్ద నగరాల్లో పురుషుల కంటే మహిళలు 23% తక్కువ సం΄ాదిస్తున్నారు. దేశంలో, ఈ ధోరణి నగరాల మధ్య మారుతూ ఉంది. ఉదాహరణకు హౌరాలోని 83% మంది మహిళలు తాము ఉ΄ాధి రంగానికి దూరంగా ఉండటానికి పిల్లల సంరక్షణ, ఇంటి పనులే కారణమని తెలపగా, ఆ తర్వాత సూరత్ (81%), పింప్రి చించ్వాడ్ , భో΄ాల్ (78%), ధ¯Œ బాద్ (77%) ఉన్నాయి. అదేవిధంగా ఆగ్రా (41%), కోటా (57%), హైదరాబాద్ (58%), అలాగే విశాఖపట్నం, శ్రీనగర్‌లలో (60%) ఈ శాతంగా నమోదు అయింది. అయితే కొయంబత్తూర్‌లో ఈ శాతం చాలా తక్కువగా (38%) ఉంది.10%16 శాతం మంది మహిళలు ఉన్నత చదువుల కోసం, 10 శాతం మంది ఆరోగ్యం, వయోపరిమితి వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, ఉద్యోగాల్లో లేని పురుషుల్లో సగానికి పైగా (53%) మంది ఉన్నత చదువుల కోసమేనని చెప్పగా, 39 శాతం మంది ఆరోగ్యం, వయస్సుకు సంబంధించిన కారణాలను చూ΄ారు.51%ఇతర పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, నగరాల్లో మహిళలకు లభించే ఉద్యోగాల శాతం మెరుగ్గా ఉంది. పెద్ద నగరాల్లో 65 శాతం మంది మహిళలు వేతనంతో కూడిన రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తుండగా, పట్టణాల్లో 51 శాతం మాత్రమే ఉంది. అలాగే నగరాల్లో 3 శాతం మంది మాత్రమే రోజువారీ వేతన కార్మికులుగా ఉండగా, పట్టణాల్లో 9%గా ఉన్నారు.రూ. 23,700/వేతనాల్లోనూ స్త్రీ, పురుషుల మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో పురుషులు నెలకు సగటున రూ. 30,700 సం΄ాదిస్తుండగా, మహిళలు మాత్రం నెలకు రూ. 23,700 మాత్రమే సం΄ాదిస్తున్నారు. అంటే 23 శాతం తక్కువ. కళ్యాణ్–డోంబివిలి, నవీ ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. అక్కడ మహిళలు పురుషుల సం΄ాదనలో దాదాపు సగం మాత్రమే ΄÷ందుతున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఉంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల సం΄ాదన ఎక్కువగా నమోదైంది.రూ. 16,160/స్వయం ఉ΄ాధిలో పురుషుల నెలవారీ ఆదాయం (రూ. 33,880), మహిళల ఆదాయం (రూ. 16,160) కంటే రెట్టింపుగా ఉంది.49.5 గంటలుపట్టణ ప్రాంతాల్లోని కార్మికులు వారానికి సగటున 47.1 గంటలు పనిచేస్తుంటే, పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని కార్మికులు వారానికి 49.5 గంటలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పెద్ద నగరాల్లోని పురుష, స్త్రీ ఉద్యోగులిద్దరూ ఎక్కువ సగటు గంటలు పనిచేస్తున్నట్లు నమోదైంది.51.5 గంటలుఉద్యోగాలు చేసే మహిళలలో.. గుజరాత్‌లోని రాజ్‌కోట్ (51.5 గంటలు), తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ (50 గంటలు) నగరాలకు చెందిన మహిళలు ఆఫీస్‌లలో అత్యధిక సమయం పనిచేస్తున్నారు. -
ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..
న్యూఢిల్లీ: నగరాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. మెట్రోలు, టైర్ 1 నగరాల్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరగనున్నదని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ నివేదిక తెలిపింది. పదిలక్షలకు మించిన జనాభా ఉన్న 35 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన ఈ నివేదికన ప్రకారం.. 2013లో 1.6 కోట్లుగా ఉన్న మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30% వృద్ధితో ఈ ఏడాది 2.07 కోట్లకు పెరగొచ్చని అంచనా. పట్టణాల్లో పురుషుల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌కల్లా భారత్‌లో 24.3 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నారని అంచనా. ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో అధిక వృద్ధి కళాశాల విద్యార్ధుల విభాగంలో ఉంది. గత ఏడాది 45.1 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ఈ ఏడాది 62% వృద్ధితో 72.9 లక్షలకు చేరింది. పట్టణాల్లో నెట్‌ను వాడుతున్న పాఠశాల బాలి కల సంఖ్య గతేడాది 21.5 లక్షలు కాగా.. ఈ ఏడాది 34% వృద్ధితో 28.8 లక్షలకు చేరింది. ఉద్యోగినులు కాని మహిళల సంఖ్య 49.3 లక్షల నుంచి 18% వృద్ధితో 58.3 శాతానికి పెరిగింది. ఇక ఉద్యోగినుల సంఖ్య 44.1 లక్షల నుంచి 8 శాతం వృద్ధితో 47.7 లక్షలకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రోజూ ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్న వారిలో ఉద్యోగినుల్లో 60% మంది, ఉద్యోగినులు కాని వారు 40% మంది ఉన్నారు. -
హైదరాబాద్ చూసేందుకు అందరికీ ఆసక్తి
దేశంలో పట్టణీకరణ ఇంకా బాగా పెరగాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పట్టణాల్లో కాలుష్య సమస్య మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 46 శాతం ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం లాంటి అవసరాల కోసం పల్లె ప్రజలు కూడా పట్టణాల బాట పడుతున్నారని చెప్పారు. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ వేదికగా నిలిచిందని వెంకయ్య అన్నారు. అభివది్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌ను చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు.


