రిలయన్స్‌ లాభాల రికార్డ్‌! | Reliance Q1 Results 2026 Record Profit Rs 23196 Crore | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ లాభాల రికార్డ్‌!

Jul 18 2026 7:41 AM | Updated on Jul 18 2026 8:45 AM

Reliance Q1 Results 2026 Record Profit Rs 23196 Crore

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌ (2026–27, క్యూ1)లో రూ. 23,196 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని  ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.30,783 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం తగ్గింది. అయితే, ఆ క్వార్టర్లో ఏషియన్‌ పెయింట్స్‌లోని రూ. 8,924 కోట్ల వాటా విక్రయం ద్వారా లభించిన అసాధారణ రాబడి కలిసి ఉండటం వల్ల వార్షికంగా లాభంలో తగ్గుదల నమోదైంది.

ఈ వన్‌టైమ్‌ రాబడిని గనుక పక్కనబెడితే ఈ ఏడాది క్యూ1లో నికర లాభం దాదాపు 6.1 శాతం ఎగబాకి కొత్త రికార్డు నమోదు చేసినట్లు లెక్క. మొత్తం ఆదాయం రూ. 3.12 లక్షల కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో నమోదైన రూ. 2.48 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధి చెందింది. ఆయిల్‌–టు–కెమికల్స్‌ (ఓ2సీ), రిటైల్, డిజిటల్‌ సరీ్వసుల వ్యాపారాల స్థిరమైన పనితీరు ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, క్యూ1లో ఎబిటా 10.1 శాతం జంప్‌ చేసి రికార్డు స్థాయిలో రూ. 54,067 కోట్లను తాకింది.

ఇతర ముఖ్యాంశాలివీ...

  •     క్యూ1లో ఓ2సీ బిజినెస్‌ ఎబిటా రూ.17,010 కోట్లకు చేరింది. 17.2 శాతం వృద్ధి చెందింది.

  •     రిలయన్స్‌ రిటైల్‌ నికర లాభం 14.2 శాతం తగ్గి రూ. 2,806 కోట్లకు చేరింది. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.79,745 కోట్లుగా నమోదైంది. ఎబిటా 1.1 శాతం తగ్గుదలతో రూ.6,309 కోట్లుగా ఉంది. కొత్తగా 252 స్టోర్లు జతయ్యాయి. దీంతో మొత్తం షోరూమ్‌ల సంఖ్య 20,169కి చేరింది.

  •     రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఆదాయం 11.6 శాతం పెరిగింది. క్యాంపా కోలా అమ్మకాలు రూ. 2,900 కోట్లుగా నమోదయ్యాయి.

  •     రిలయన్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపార ఎబిటా దాదాపు అదే స్థాయిలో రూ. 4,973 కోట్లుగా నమోదైంది.

  •     జూన్‌ క్వార్టర్లో కంపెనీ రూ.38,682 కోట్ల పెట్టుబడులు వెచ్చించింది. ఓ2సీ విస్తరణ, న్యూ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు కన్జూమర్‌ బిజినెస్‌ ఇన్‌ఫ్రాపై దీన్ని ఇన్వెస్ట్‌ చేసింది.

  •     జూన్‌ నాటికి నికర రుణ భారం రూ.1,22,914 కోట్లుగా ఉంది.

  •   ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్‌ షేరు ధర 2.6 శాతం లాభంతో రూ.1,327 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement