ఏఐతో మరింత కీలకంగా ఐటీ: ఆనంద్‌ మహీంద్రా  | Anand Mahindra dismisses fears over AI replacing IT services | Sakshi
Sakshi News home page

ఏఐతో మరింత కీలకంగా ఐటీ: ఆనంద్‌ మహీంద్రా 

Jul 18 2026 6:24 AM | Updated on Jul 18 2026 11:29 AM

Anand Mahindra dismisses fears over AI replacing IT services

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వల్ల ఐటీ రంగం పాత్ర తగ్గిపోవడం మాట అటుంచి, పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుందని టెక్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పష్టం చేశారు. మరెక్కడో తయారైన ఏఐని వాడుకోవడానికి పరిమితం కాకుండా భారత్‌ స్వయంగా ఇంటెలిజెన్స్‌ సృష్టికర్తగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కంపెనీ వర్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మహీంద్రా ఈ విషయాలు తెలిపారు. 

సాంకేతికత లభ్యతకు సంబంధించి సవాళ్ళు ఎప్పుడు ఎదురైనా భారత్‌లో దేశీయంగా కొత్త ఆవిష్కరణలను చేసే సత్తా భారత్‌కి ఉందని నిరూపితమైందని, దీనికి పరమ్‌ సూపర్‌కంప్యూటర్‌ నిదర్శనమని వివరించారు. విశ్వసనీయ భాగస్వామ్యాలు, స్వావలంబనతో సార్వభౌమ ఏఐ విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చూపించాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ మిషన్‌ కింద టెక్‌ మహీంద్రా ఎంపికవడం ఒక పెద్ద బాధ్యతని చెప్పారు. పాత మోడల్స్‌కి ఏఐ సవాలు విసురుతుందని.. అదే సమయంలో పరిశ్రమ ఎన్నడూ చూడని భారీ అవకాశాలను కూడా కలి్పంచగలదని మహీంద్రా పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement