జియో లాభాల జోష్‌.. 3 నెలలకు రూ.7,764 కోట్లు | Jio Q1 Results 2026 Profit rises Rs 7764 crore ARPU subscribers IPO | Sakshi
Sakshi News home page

జియో లాభాల జోష్‌.. 3 నెలలకు రూ.7,764 కోట్లు

Jul 18 2026 9:03 AM | Updated on Jul 18 2026 9:11 AM

Jio Q1 Results 2026 Profit rises Rs 7764 crore ARPU subscribers IPO

దాదాపు 4 బిలియన్‌ డాలర్ల రికార్డు ఐపీఓ బాటలో ఉన్న జియో ప్లాట్‌ఫామ్స్‌ క్యూ1లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.7,110 కోట్లుగా నమోదైంది. కాగా, ఆదాయం 11.8 శాతం ఎగసి రూ.39,173 కోట్లకు చేరింది. ఎబిటా 15.1 శాతం ఎగసి రికార్డు స్థాయిలో రూ.20,865 కోట్లను తాకింది.

ఒక్కో యూజర్‌ నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 3.3 శాతం వృద్ధి చెంది రూ.215.6కు చేరింది. క్యూ1లో ఒక్కో యూజర్‌ నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి ఎగసింది. 26.9 శాతం వృద్ధి సాధించింది. జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఈ ఏడాది జూన్‌ నాటికి 7.1 శాతం పెరిగి, 53.3 కోట్లకు చేరారు. గతేడాది జూన్‌ క్వార్టర్‌లో యూజర్ల సంఖ్య 49.8 కోట్లుగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement