ఇన్ఫోసిస్‌ కొత్త సీఈఓగా ఆశిష్‌ కుమార్‌ దాస్‌ | Infosys Appointed Ashish Kumar Dash As New CEO, Leadership Change From April 1st 2027, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ కొత్త సీఈఓగా ఆశిష్‌ కుమార్‌ దాస్‌

Jul 24 2026 12:47 AM | Updated on Jul 24 2026 10:34 AM

Infosys appointed Ashiss Kumar Dash as New CEO

2027 ఏప్రిల్‌ 1 నుంచి బాధ్యతలు 

ఇన్ఫోసిస్‌ కాబోయే సీఈఓ (డిజిగ్నేట్‌)గా ఆశిష్‌ కుమార్‌ దాస్‌ ఎంపికయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రెండో విడత పదవీ కాలం ముగిసిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆశిష్‌ కుమార్‌ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపడతారు. ఐదేళ్ల పాటు (2032, మార్చి 31 వరకు) ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. 

దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇన్ఫీ గ్లోబల్‌ బిజినెస్‌ పోర్టుఫోలియో హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దాస్‌కు.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కంపెనీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. కాగా, ఇన్ఫోసిస్‌ కొత్త అధ్యాయానికి నాయకత్వం వహించే అవకాశం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అశిష్‌ కుమార్‌ దాస్‌ వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement