కొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే? | Mercedes Benz Launches AMG E 53 Plug-in Hybrid Sedan in India, Check Out Price, Features And Specifications | Sakshi
Sakshi News home page

కొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?

Jul 23 2026 4:47 PM | Updated on Jul 23 2026 4:53 PM

2026 Mercedes AMG E 53 Hybrid Launched at Rs 1 45 Crore

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో ఏఎంజీ ఈ 53 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. ఇది పెర్ఫార్మెన్స్, రేసింగ్ అనే రెండు ఎడిషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.45 కోట్లు, రూ. 1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).

కొత్త AMG E 53 హైబ్రిడ్ కారు అప్‌డేటెడ్ ఈ-క్లాస్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన బంపర్లు, ప్రకాశవంతమైన గ్రిల్, వెడల్పాటి ఫెండర్లు, డిఫ్యూజర్, లిప్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ కారులో అడాప్టివ్ సస్పెన్షన్, రియర్ యాక్సిల్ స్టీరింగ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద బ్రేకులు, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉన్నాయి.

లోపలి భాగంలో.. ఈ53 కి 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కూడిన మెర్సిడెస్ MBUX సూపర్‌స్క్రీన్, ఏఎంజీ స్పోర్ట్స్ సీట్లు, డాల్బీ అట్మోస్‌తో కూడిన 17 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ లభిస్తాయి. ఈ కారు పోలార్ వైట్, వెర్డే సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, నాటికల్ బ్లూ, వెల్వెట్ బ్రౌన్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్ అనే మలుపులు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

కొత్త మెర్సిడెస్-AMG E 53 హైబ్రిడ్ 4Matic+ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ 6-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. కాబట్టి ఇది 577 Bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ 100 కిమీ దూరం ప్రయాణించగలదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement