మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బ్రెజ్జా.. ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ అప్‌డేటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని డీలర్‌షిప్‌లకు పంపించడం కూడా స్టార్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారు డెలివరీలు లాంచ్ తరువాత చాలా వేగంగా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే లీక్ అయిన చిత్రాల ప్రకారం.. మారుతి బ్రెజ్జా అప్డేటెడ్ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ, కొన్ని కొత్త మార్పులు చూడవచ్చు. కొత్త గ్రిల్, బంపర్‌ను చూడవచ్చు. అంతే కాకుండా.. హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. అయితే.. వెనుక భాగంలో బంపర్, టెయిల్-ల్యాంప్ అంతర్గత భాగాలలో కూడా స్వల్ప మార్పులు ఉండవచ్చు. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లలో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ లాంచ్ తరువాత అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
లోపలి భాగంలో.. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మరిన్ని గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను అప్‌డేట్ చేయడంతో.. ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, సన్‌గ్లాస్ హోల్డర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్‌తో కూడిన కొత్తగా డిజైన్ చేసిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన రీచ్ అండ్ రేక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి పరికరాలు ఉంటాయని అంచనా.
అలెక్సా ఇంటిగ్రేషన్‌తో కూడిన పెద్ద 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లలో ఒకటిగా ఉండబోతోంది. సీట్ వెంటిలేషన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త బ్రెజ్జా మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో రానుంది. వీటిలో 103 hp పవర్, 139 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజన్, 110 hp పవర, 170 Nm టార్క్ అందించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, ఒక CNG వేరియంట్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితోనూ అందించే అవకాశం ఉంది. CNG వెర్షన్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది.


