ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు! | Maruti Suzuki To Hike Prices By Up To Rs 30000 In August 2026 | Sakshi
Sakshi News home page

ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!

Jul 21 2026 8:26 PM | Updated on Jul 21 2026 8:38 PM

Maruti Suzuki To Hike Prices By Up To Rs 30000 In August 2026

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను మరోమారు పెంచడానికి సిద్ధమైంది. 2026 ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి దాని లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనుంది. అయితే ఏ మోడల్ ధరను ఎంత వరకు పెంచనుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా కంపెనీ మూడు నెలలు ముందు కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల అమ్మకాలు పెరుగుతాయా?, తగ్గుతాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో.. పెరిగిన ద్రవ్యోల్బణ భారాలు, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు నుంచి కొత్త కారు కొనాలంటే.. ఇంకొంత ఖర్చు చేయక తప్పదని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement