పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న వేళ, ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు అయిన 'వ్యాగన్ఆర్'(Maruti Suzuki WagonR Flex Fuel)ను ఆవిష్కరించింది. ఈ కొత్త రూపంలోని హ్యాచ్‌బ్యాక్, ఈ85 ఇంధనంతో (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
2026 జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ఆర్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు పాల్గొన్నారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ఆర్ కారు సాధారణ పెట్రోల్ వాహనాలకు భిన్నంగా.. ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. కాబట్టి కార్బన్ ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయి. వాహన పరిశ్రమలో ఇథనాల్ వినియోగాన్ని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మారుతి సుజుకి ఈ కారును లాంచ్ చేయడం జరిగింది.
సాధారణ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో అనేక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇందులో మెరుగైన ఫ్యూయల్ డెలివరీ కాంపోనెంట్‌లు, ఇథనాల్‌కు అనుకూలమైన మెటీరియల్స్, అప్డేటెడ్ ఇంజిన్ క్యాలిబ్రేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. పవర్‌ట్రెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇథనాల్ గాఢత ఆధారంగా రియల్ టైమ్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ అండ్ కంబషన్ పారామీటర్‌లను అడ్జస్ట్ చేస్తుంది. తద్వారా ఉత్తమ పనితీరు, సామర్థ్యంతో పాటు మన్నికను నిర్ధారిస్తుంది.
సాధారణ వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి పాపులర్ మోడల్. అలాంటి కారు ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ రూపంలో వచ్చింది. ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని ఆటోమొబైల్ ఔత్సాహికులు భావిస్తున్నారు.
📍 New Delhi
Launched India’s Flex-Fuel Car by Maruti Suzuki in New Delhi along with Union Minister Shri @HardeepSPuri Ji.
Congratulations to the entire team on this remarkable and forward-looking achievement. This milestone reinforces the vision of Prime Minister Shri… pic.twitter.com/r6UgSURqFM— Nitin Gadkari (@nitin_gadkari) June 4, 2026
నితిన్ గడ్కరీ స్పందన
భారతదేశం ప్రతి ఏటా ముడిచమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రత్యామ్నాయ ఇంధనం. దీనివల్ల రైతులు, పరిశ్రమలు, పర్యావరణం ఏకతాటిపైకి వచ్చి ప్రయోజనం పొందుతాయిని వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆవిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రవేశపెట్టి, స్వచ్ఛమైన, స్వయం సమృద్ధి గల రవాణా.. అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ, దీనికి అనుగుణంగా అడుగు వేసినందుకు మారుతి సుజుకిని నేను అభినందిస్తున్నాను. ఈ చొరవ ఇతర కార్ల తయారీదారులను కూడా వారి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుందని విశ్వసిస్తున్నాని గడ్కరీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!


