పేటీఎంలో బ్లాక్‌ డీల్‌.. చేతులు మారిన రూ.963 కోట్ల షేర్లు | paytm block deal shares 963 crore one97 communications | Sakshi
Sakshi News home page

పేటీఎంలో బ్లాక్‌ డీల్‌.. చేతులు మారిన రూ.963 కోట్ల షేర్లు

May 24 2026 7:57 AM | Updated on May 24 2026 11:18 AM

paytm block deal shares 963 crore one97 communications

న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో 1.34 శాతం వాటా బ్లాక్‌ డీల్‌ ద్వారా చేతులు మారింది. గోల్డ్‌మన్‌ సాక్స్, సొసైటే జనరల్, సిటిగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అలాగే సుందరం మ్యూచువల్‌ ఫండ్, నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ వంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ షేర్లను కొనుగోలు చేశాయి.

మొత్తం 85.98 లక్షల షేర్లను ఒక్కోటి సగటున రూ.1,120.65 ధరకు కొనుగోలు చేయగా, డీల్‌ విలువ రూ.963.60 కోట్లకు చేరింది. ఈ షేర్లను హాంకాంగ్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీదారు ఎస్‌ఏఐఎఫ్‌ పార్ట్‌నర్స్, గురుగ్రామ్‌కు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ఎలివేషన్‌ క్యాపిటల్‌లు విక్రయించాయి. ఈ లావాదేవీ అనంతరం వన్‌97 కమ్యూనికేషన్స్‌లో ఎస్‌ఏఐఎఫ్‌ పార్ట్‌నర్స్‌ వాటా 13.43% నుంచి 12.18 శాతానికి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement