బెంగాల్‌లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం! | BJP Victory in Bengal: These Sectors Set to Get a Boost | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!

May 5 2026 7:16 AM | Updated on May 5 2026 8:43 AM

BJP Victory in Bengal: These Sectors Set to Get a Boost

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement