అమెరికాకు చెందిన అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజం సెంచురీ 21 తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
భారత రియల్టీలో అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లోని ప్రాపర్టీలను భారతీయ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశీయంగా తమ కార్యకలాపాలు తోడ్పడతాయని సెంచురీ 21 యూఏఈ, ఇండియా గ్రూప్ సీఈవో పీటర్ మాథ్యూస్ తెలిపారు.
కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15,000 కార్యాలయాలు, 4,00,000 పైగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని రవి శాస్త్రి తెలిపారు.


