breaking news
Regional rural banks (RRB)
-
స్టాక్ మార్కెట్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లను లిస్టింగ్‌కు అనుమతించడం ద్వారా పెట్టుబడుల సమీకరణ మార్గాలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశలో ఆర్ఆర్బీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక మూలాలు తదితర అంశాలను రూపొందించింది. వీటి ప్రకారం గత మూడేళ్లలో కనీసం రూ. 300 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబంధనలు డిమాండ్ చేస్తున్న 9 శాతం లేదా అంతకుమించిన కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)ని గత మూడేళ్లలో నిలుపుకుని ఉండాలి. ఈ బాటలో మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తుండటంతోపాటు.. గత ఐదేళ్లలో మూడేళ్లు కనీసం రూ. 15 కోట్లు నిర్వహణ లాభం సాధించిన సంస్థనే లిస్టింగ్‌కు అనుమతిస్తారు. సంస్థ నష్టాలు నమోదు చేసి ఉండకూడదు. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు ఈక్విటీపై కనీసం 10 శాతం రిటర్నులు అందించిన సంస్థకు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఆర్ఆర్బీలు వ్యవసాయ రంగానికి రుణాలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాను కలిగి ఉంటోంది. మరో 35 శాతం సంబంధిత పీఎస్‌యూ బ్యాంకుల వద్ద, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. -
ఐబీపీఎస్ చేతికి ఆర్ఆర్బీ నియామకాలు
30 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్ఆర్బీ) సంబంధించిన వివిధ నియామకాల నిర్వహణ ప్రక్రియను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలె క్షన్ (ఐబీపీఎస్) పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. స్కేల్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచి 28 నుంచి 30 ఏళ్లకు పొడిగించింది. ఈ నియామకాల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌ఆర్‌బీలోని ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్-1,2,3 ఆఫీసర్లకు ఒకేరాత పరీక్షను ఐబీపీఎస్ నిర్వహిస్తోంది. -
ఉద్యోగాలు
ఐబీపీఎస్ కామన్ రిటెన్ టెస్ట్ వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్ఆర్బీ)లో కింది ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష(సీడబ్ల్యూఈ) నోటిఫికేషన్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాం కింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) విడుదల చేసింది. పోస్టులు: ఆఫీసర్ స్కేల్-1,2,3), ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టీపర్పస్) అర్హతలు: ఆఫీసర్ స్కేల్-1: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం. సంబంధిత ప్రాంతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు. వయసు: 28 ఏళ్లకు మించకూడదు(జూన్ 3, 1986 నుంచి మే 31, 1996 మధ్య జన్మించినవారు). ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చరల్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి (జూన్ 3, 1982 నుంచి మే 31, 1993 మధ్య జన్మించినవారు). ఆఫీసర్ స్కేల్-2(స్పెషలిస్ట్ ఆఫీసర్స్): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా ఆఫీసర్. 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ఏడాది అనుభవం. వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి (జూన్ 3, 1986 నుంచి మే 31, 1996 మధ్య జన్మించినవారు). ఆఫీసర్ స్కేల్-3: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం. సంబంధిత రంగంలో ఆఫీసర్‌గా ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (జూన్ 3, 1974 నుంచి మే 31, 1993 మధ్య జన్మించినవారు) ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టీపర్పస్): ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. సంబంధిత ప్రాంతీయ భాషలో ప్రావీ ణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి(జూన్ 2, 1986 నుంచి జూన్ 1, 1996 మధ్య జన్మించి ఉండాలి) ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 9 వెబ్సైట్: www.ibps.in