లెగో గ్రూప్ హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో తొలి లెగో సర్టిఫైడ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆంపిల్ గ్రూప్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ 3,500 చదరపు అడుగుల స్టోర్‌ను టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ప్రారంభించారు. అలాగే, ఒక ప్రత్యేకమైన లెగో మొజాయిక్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను కేవలం ఒక నగరంగానే కాకుండా, ఒక అనుభూతిగా చిత్రీకరిస్తూ, మాస్టర్ బిల్డర్ రీతమ్ భట్నాగర్ 49,200 లెగ్ధో ఇటుకలను ఉపయోగించి ఈ మొజాయిక్‌ను రూపొందించారని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
చార్మినార్, హుస్సేన్ సాగర్ నుంచి ఇరానీ చాయ్ స్టాల్ వరకు, నగరంలోని సుప్రసిద్ధ ప్రదేశాలు సాంస్కృతిక చిహ్నాలను ప్రదర్శిస్తూ, 7 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉన్న మొజాయిక్ హైదరాబాద్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందింది.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌కు కొత్తగా, సరదా వినోదాన్ని పంచేది ఏదైనా రావడం నాకు ఎప్పుడూ ఆనందంగా అనిపిస్తుంటుంది ఆటల్ని ఏ వయసు వారైనా ఆస్వాదించవచ్చు. కుటుంబంతో కలిసి ఈ తరహా ఆటలు ఆడడం,. గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అది నాకు చాలా ఇష్టం.’’ అని అన్నారు.


