సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెడ్ అలర్ట్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచాలని పొంగులేటి పేర్కొన్నారు.
అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. జిల్లాల్లో 24 గంటలూ అందుబాటులో కంట్రోల్ రూమ్‌లు ఉండాలి. ప్రజలకు తక్షణ సహాయం అందించేలా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచించారు.
ఇదీ చదవండి: ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్


