జూరాల నీటి విడుదల.. స్పందించిన కేటీఆర్‌ | BRS KTR React On Jurala Water Release | Sakshi
Sakshi News home page

జూరాల నీటి విడుదల.. స్పందించిన కేటీఆర్‌

Sep 23 2026 10:36 AM | Updated on Sep 23 2026 10:53 AM

BRS KTR React On Jurala Water Release

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు జూరాల ప్రాజెక్ట్‌ నుంచి అధికారులు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని వదిలారు. ఈ నేపథ్యంలో నీటి విడుదలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పందించి.. రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ..‘పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా!!. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!. ఈ కుంభకర్ణ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం!. ప్రశ్నించడం, పోరాడటం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడటం.. ఇదే మన ముందున్న లక్ష్యం’ అని పోస్టు చేశారు. 

 ఇదీ చదవండి: తెలంగాణకు బిగ్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement