హైదరాబాద్: క్యాబ్ ఎక్కుతున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పక్కకు లాగి ఓ సెక్యూరిటీ గార్డు ముద్దు పెట్టిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు... వైజాగ్‌కు చెందిన ఓ యువతి(24) ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి పక్కకు లాగి ముద్దు పెట్టాడు. ఆమె బిగ్గరగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇందిరానగర్‌లోని సంతోష్‌దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే జార్ఖండ్‌కు చెందిన రాజ్ కుమార్(25)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


