మాదాపూర్‌ ఓయో రూమ్‌ నెంబర్‌ 303లో ఏం జరిగింది! | Madhapur OYO Room Incident | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ ఓయో రూమ్‌ నెంబర్‌ 303లో ఏం జరిగింది!

Sep 23 2026 7:46 AM | Updated on Sep 23 2026 7:46 AM

 Madhapur OYO Room Incident

హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మరణించిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోనివి శాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖిత టోప్నో(29) ప్రైవేటు ఉద్యోగి. ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఈ నెల 21న మాదాపూర్‌ సిద్దిఖీనగర్‌ ఓఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్ ఓయో హోటల్‌లోని రూమ్‌ నెంబర్‌ 303కు వెళ్లింది. తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అర్ధరాత్రి కొత్తగూడలోని అపోలో హాస్పిటల్‌కి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించి మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతి చెందినట్టు తెలియగానే శ్రీనివాస రవితేజ ఆసుపత్రి నుంచి పారిపోయాడు . ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మృతురాలి ముఖంపై చిన్న గాయాలు, గోడలపై బెడ్‌ష్‌ట్‌లపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. రూమ్‌లో మద్యం సీసాలు ఉన్నట్టు గమనించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement