సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు విశాఖకు చెందిన నిఖితగా పోలీసులు గుర్తించారు. హోటల్ గదిలో గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. ఘటన స్థలంలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లను గుర్తించారు. రంగంలో దిగిన క్లూస్ టీమ్.. ఆధారాలను సేకరించింది. ప్రియుడు శ్రీనివాస రవితేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


