రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌! | Jeevan Reddy Comments On Rythu Bharosa Fake Messages | Sakshi
Sakshi News home page

రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌!

Nov 6 2026 2:11 PM | Updated on Nov 6 2026 2:26 PM

Jeevan Reddy Comments On Rythu Bharosa Fake Messages

సాక్షి, జగిత్యాల: ప్రభుత్వం పరంగా అందాల్సిన 'రైతు భరోసా' డబ్బులు.. రైతు ఖాతాల్లో జమయ్యాయంటూ వచ్చిన ఫేక్‌ మెసేజ్‌లపై.. బీఆర్‌ఎస్‌ కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతులను ఈ సందేశాలు గందరగోళానికి గురిచేశాయని విమర్శించారు.

జగిత్యాలలో పెట్టిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు రావడంతో పలువురు బ్యాంకులకు వెళ్లి ఆరా తీశారని, అవి నకిలీ సందేశాలని తేలిందన్నారు. రేవంత్‌రెడ్డి పేరుతో నడుస్తున్న ప్రభుత్వమే ఫేక్‌ గవర్నమెంట్‌ అని, రైతు భరోసా నిధుల పేరుతో వస్తున్న మెసేజ్‌లు కూడా ఫేక్‌ అని వారు ఆరోపించారు.

మరోవైపు వరద నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎత్తిపోసేలా ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ అని జీవన్‌రెడ్డి అన్నారు. అలాగే, కేసీఆర్‌ దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తించాలని ఈ సందర్భంగా వారు చెప్పారు.

ఇదీ చదవండి: రేవంత్‌కు షాక్‌.. బియ్యం ధరలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement