రేవంత్‌కు షాక్‌.. బియ్యం ధరలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు | MLC Vijaya Shanthi Questioned Govt On Rice Rates In Telangana | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు షాక్‌.. బియ్యం ధరలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Nov 6 2026 11:34 AM | Updated on Nov 6 2026 11:56 AM

MLC Vijaya Shanthi Questioned Govt On Rice Rates In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెరిగిన బియ్యం ధరలపై ఎమ్మెల్సి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే, పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

కాంగగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి తాజాగా తెలంగాణలో బియ్యం ధరలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె.. బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?. ఒకప్పుడు రూ.1,500 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.2,500కు ఎలా పెరిగింది?. కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100కు చేరడం ఆందోళనకరం. సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం ఎందుకు మోపుతున్నారు? అంటూ ప్రశ్నించారు.

ఇదే సమయంలో బియ్యం ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది అంటూ రేవంత్‌ సర్కార్‌ను ఆమె నిలదీశారు. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే బియ్యం కొనలేని పరిస్థితి? 25 కిలోల బస్తాపై రూ.1,000 భారం! కిలో సన్నబియ్యం రూ.100.. ధరల నియంత్రణ ఏది? అంటూ సర్కార్‌పై ప్రశ్నల వర్షమే కురిపించారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కలవరం.. పరిధి దాటి పంచాయితీలేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement