తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పాస్‌ ధర! | Telangana Government Cuts Metro And RTC Combo Pass Prices by Over 50%, Check Latest Price Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పాస్‌ ధర!

Nov 6 2026 10:03 AM | Updated on Nov 6 2026 10:36 AM

Telangana Metro RTC Pass Price Cut

సాక్షి, తెలంగాణ: రాష్ట్రంలో ప్రజలకు దీపావళి కానుకగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గించింది. ఇప్పటివరకు నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.8,500 ఉండగా.. దాన్ని ఏకంగా రూ.4,000కు తగ్గించారు.

ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని, నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఉమ్మడి పాస్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. దీంతో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement