బతికుండగానే స్మశానానికి... కంటతడి పెట్టిస్తున్న ఘటన! | Heartbreaking Incident In Telangana, Family Takes Seriously Ill Man To Cremation Ground Before His Death | Sakshi
Sakshi News home page

బతికుండగానే స్మశానానికి... కంటతడి పెట్టిస్తున్న ఘటన!

Nov 6 2026 11:14 AM | Updated on Nov 6 2026 11:38 AM

Vemulawada Sick Man Shifted To Crematorium

సాక్షి, తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మర్రిపల్లి రాకేష్‌ను కుటుంబ సభ్యులు వేములవాడ వైకుంఠధామానికి తరలించారు. చనిపోకముందే స్మశానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఈ ఘటన స్థానికంగా కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత కుటుంబం కొన్నేళ్లుగా వేములవాడలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. రాకేష్ కొంతకాలంగా జాండీస్‌, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో రాకేష్ పరిస్థితి చూసి ఇంటి యజమాని అద్దె ఇంట్లోకి కూడా అనుమతించలేని దుస్థితి ఏర్పడిందంటూ కుటుంబ సభ్యులు వాపోయారు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రాకేష్‌ను వైకుంఠధామానికి తీసుకెళ్లినట్లు, చివరికి చావే పరిష్కారం అన్నట్లుగా.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మంటగలిసిందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, రాకేష్‌కు తగిన సహాయం అందించాలని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఏం కష్టమొచ్చింది తల్లులూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement