breaking news
Rajanna Sircilla District Latest News
-
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
సిరిసిల్ల/బోయినపల్లి: పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్‌నాయక్ కోరారు. బోయినపల్లి పీహెచ్‌సీని సోమవారం పరిశీలించి, జిల్లా కేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో ప్రోగ్రాం ఆఫీసర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్‌బాబు, రామారెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ అ నిత, ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, నయీమ జహా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం సిరిసిల్ల: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. డీపీవో ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 19 ఫిర్యాదులు వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా ఠాణాల అధికారులకు సూచించారు. డీజేలకు అనుమతి లేదుగణేశ్ శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. సిరిసిల్లలోని పలు గణేశ్ మండపాలను రాత్రి టౌన్ సీఐ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,200 గణేశ్ మండపాలు ఏర్పాటు చేశారని వివరించారు. బాలసాహిత్యకర్త అశోక్‌కు పురస్కారం సిరిసిల్ల అర్బన్: విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, బాలసాహిత్యకర్త గరిపెల్లి అశోక్‌కు ఖమ్మం చాంద్ సితారె సంస్థ తొలి పురస్కారం అందజేసింది. ఖమ్మంలోని పీఆర్టీయూ భవన్లో సంస్థ అధ్యక్షుడు షఫీ, ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందజేశారు. పకడ్బందీగా నిమజ్జనం ఏర్పాట్లు వేములవాడ: గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆదేశించారు. గుడి చెరువు కట్టపై ఏర్పాట్లను సోమవారం కమిషనర్ లో కేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డితో కలిసి పరిశీలించా రు. వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ కొండ రాజశేఖర్, సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. విధుల్లో చేరిన ఏడీఈ అశోక్ సిరిసిల్ల: పరిశ్రమల సేవల మీటరు రిలే టెస్టింగ్ విభాగంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(ఏడీఈ)గా అశోక్ సోమవారం విధుల్లో చేరా రు. కామారెడ్డి జిల్లాలో ఏడీఈగా పనిచేసిన అశోక్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఆయనకు ఏఈడీ రాజలింగం, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సీని యర్ లైన్ ఇన్స్పెక్టర్ సూరయ్య, లైన్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్, సుధీర్, సత్తయ్య స్వాగతం పలి కారు. గతంలోనూ సిరిసిల్ల టౌన్ ఏఈఈగా అశోక్ ‘సెస్’ పరిధిలో పనిచేశారు. రాజన్నకు రూ.లక్ష విరాళంవేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి వరంగల్‌లోని పెరికవాడకు చెందిన అంచూరి నర్మద, కుమారుడు లోకేశ్వర్, కుమార్తె భవాని రూ.1,20,001 నగదు విరాళంగా పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మకు సోమవారం అందజేశారు. ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. -
కస్టమర్ల సహకారంతో బ్యాంకు అభివృద్ధి
సిరిసిల్లటౌన్: వినియోగదారుల సహకారంతో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో ముందుకుసాగుతోందని బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం బ్యాంకు 40వ వార్షిక మహాసభ స్థానిక పద్మశాలి కల్యాణ భవనంలో నిర్వహించారు. బ్యాంకులో నూతన సభ్యత్వం రూ.5వేలు వాటా ధనాన్ని బ్యాంకు నెట్‌వర్త్ పెంచి ఇస్తున్నామన్నారు. ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడంతోపాటు కొత్తగా వేములవాడ, కరీంనగర్ బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాటాదారులకు 14 శాతం డివిడెండ్‌ను 2025–26 సంవత్సరానికి ఇస్తున్నామన్నారు. బ్యాంక్ మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, గాజుల బాలయ్య, గాజుల నారా యణ, బుర్ర నారాయణగౌడ్, కోడం అశోక్ తదితరులు బ్యాంకు సేవలపై సూచనలు అందజేశారు. అనవసర ఖర్చులు అదుపులో పెట్టాలి బ్యాంకు లావాదేవీల్లో పెరుగుతున్న అనవసర ఖర్చులు అదుపులో పెడుతూనే వాటాదారులపై భారం మోపకుండా చూడాలని సభ్యులు కోరారు. ముఖ్య పోస్టుల్లో ఉన్న వారి జీతాలు అధికంగా ఉన్నాయని, మహాసభ ఖర్చులు కూడా లక్షలు దాటుతున్నాయన్నారు. పాతవాహనం రిపేరుకు రూ.3లక్షలు ఖర్చు చేయడం ఏంటని పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ తదితరులు ప్రశ్నించారు. బ్యాంక్ వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, కార్యవర్గ సభ్యులు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్రాజు, బుర్ర రాజుగౌడ్, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, సీఈవో పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి పూర్తి చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఏళ్లుగా అనంతారం బిక్కవాగు బ్రిడ్జిని పూర్తి చేయడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన యువజన సంఘాల అధ్యక్షుడు అక్కెం నాగరాజు సోమవారం నిరాహారదీక్ష చేపట్టారు. నాగరాజు మాట్లాడుడూ అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.44లక్షలు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా పనులు చేయడం లేదన్నారు. మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తీగల పుష్పలత పనులు త్వరగా ప్రారంభమవుతాయని దీక్ష విరమించాలని కోరిన విరమించలేదు. అనంతరం ఎస్సై ఉపేంద్రచారి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కోరినా వినలేదు. ఆమరణ నిరాహార దీక్షకు బీజేపీ నాయకులు చిమ్మనగొట్టు శ్రీనివాస్, జిల్లా దళిత మోర్చా కార్యదర్శి మామిడి హరీశ్, మానకొండూరు అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి సంఘీభావం తెలిపారు. -
ప్రజా‘వాణి’ వినండి
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 172 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 18 దరఖాస్తులు రాగా, ఎంపీడీవో కార్యాలయాల్లో 59 అర్జీలు వచ్చాయి. ప్రజా వాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.స్కావెంజర్లకు వేతనాలు ఇప్పించండి ప్రభుత్వ పాఠశాలల్లోని స్కావెంజర్లకు ప్రతీ నెల వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నాం. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. ఇప్పటికై నా జూన్ నుంచి ఈనెల వరకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇప్పించండి. – స్వీపర్స్, స్కావెంజర్స్ యూనియన్ సభ్యులు చర్యలు తీసుకోండి బోయినపల్లి మండలం నీలోజిపల్లిలోని 8వ వార్డులో గణేశ్ మండపం వద్ద అన్నదానం నిర్వహించాం. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తిన్న ప్లేట్లు, చెత్తను తీసుకుపోవడానికి వస్తే.. సర్పంచ్ మాత్రం వాటిని తీసుకుపోవద్దనడంతో వారు ఆ చెత్తను అక్కడే వదిలేసి పోయారు. తర్వాత రోడ్డుపై చెత్త వేశారంటూ పంచాయతీ కార్యదర్శి రూ.500 జరిమానా విధించారు. దీనిపై విచారణ చేపట్టి సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోండి. – నీలోజిపల్లి గ్రామస్తులు -
తింటే అనారోగ్యమే!
సిరిసిల్ల: జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో రుచి, శుభ్రత పాటించడం లేదు. వీధి వ్యాపారుల నుంచి ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లలోనూ పరిశుభ్రత కొరవడింది. ఆ హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాలు చూస్తే నోరూరుతున్నా.. తింటే వాంతలు అవుడే. వంటగదుల్లో శుభ్రత కరువైంది. మరోవైపు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. మ రుసటి రోజు వినియోగిస్తున్నారు. మిగిలిన మాంసం, చికెన్ కూరలను సైతం తెల్లవారి వేడి చేసి వడ్డిస్తున్నారు. ఇదంతా జిల్లా కేంద్రంతోపాటు ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ హోటళ్లలోని దుస్థితి. రంగులు.. రసాయనాలు జిల్లాలోని పలువురు హోటళ్ల నిర్వాహకులు తమ వ్యాపార అభివృద్ధికి.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వంటల్లో నిషేధిత రంగులను, రసాయనాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ అధికారులు సిరిసిల్ల, వేములవాడల్లో దాడులు చేయగా.. దుర్వాసన వస్తున్న నిల్వ చేసిన మాంసం, కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. నిల్వ ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు నిషేధిత రంగులు, రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. వాడిపోయిన దోసకాయలు, మెత్తపడిన క్యారెట్, మొలకలొచ్చిన ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఇవీ పాటించాలి సిరిసిల్లలోని ఓ హోటల్లో తనిఖీ చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష(ఫైల్) సిరిసిల్లలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పరిసరాలు ఇలా ఉన్నాయి..13 కేసులు బుక్ చేశాం జిల్లాలో ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని 13 మందిపై కేసులు బుక్ చేశాం. మరో 28 హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. ఇంట్లోని ఆహారాన్ని తింటేనే అన్నింటికీ మంచిది. వీలైనంత మేరకు హోటల్ తిండిని తగ్గించుకోవాలి. తప్పదు అనుకుంటే హైజిన్‌గా ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లాలి. ఫుడ్‌సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. – అనూష, ఫుడ్‌సేఫ్టీ అధికారి ‘ఇటీవల సిరిసిల్లకు చెందిన ఓ యువకుడి పుట్టిన రోజు నాడు అతని స్నేహితులు ఐదుగురు కలిసి చంద్రంపేట మార్గంలోని ఓ మండీలో బిర్యానీ తిన్నారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికే ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో యువకులు చావు అంచుల్లోకి వెళ్లివచ్చారు. వెంటనే ఆ యువకుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆ మండి బిర్యానీ సెంటర్‌ను ఫుడ్‌సేఫ్టీ సీజ్ చేశారు. ఇప్పటికీ అది తిరిగి ఓపెన్ కాలేదు.’ ‘ఇది గోపాల్‌నగర్‌లో సర్వపిండి తయారీ సెంటర్. ఇక్కడ సర్వపిండి తయారీలో వాడిన నూనెను మళ్లీ..మళ్లీ వాడుతున్నాడు. అయినా కస్టమర్లు ఎగబడి తింటున్నారు. పదే పదే అదే నూనెను కాగబెట్టడం ప్రమాదకరమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోటల్ వ్యాపారాల స్వరూపం హోటళ్లు : 920రెస్టారెంట్లు, దాబాలు : 68ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు : 280నిత్యం జరిగే వ్యాపారం : రూ.46.66 లక్షలు -
ఆర్టీసీలో ఎన్నికల సైరన్
కరీంనగర్‌టౌన్: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీజీఎస్ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో కార్మిక సంఘాల్లో సంద డి మొదలైంది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఒకవైపు టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొనగా.. మరోవైపు యూనియన్ల మధ్య పొత్తులు, కూటములు కొత్త స మీకరణాలకు తెరతీస్తున్నాయి. గత ఎన్నికలతో పో లిస్తే ఈసారి పోరు ఆసక్తికరంగా మారే అవకాశముంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు యూని యన్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరి కి ఏ సంఘానికి కార్మికుల మద్దతు లభిస్తుందన్నది అక్టోబర్ 17న వెలువడే ఫలితాలతో తేలనుంది. 2,830 మంది ఓటర్లు కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్–1, కరీంనగర్–2, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, మంథని, గోదావరిఖని, సిరిసిల్ల డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,830 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 376 మంది మెయింటెనెన్స్ సిబ్బంది, 132 మంది ఎగ్జిక్యూటీవ్ సిబ్బంది, 19 మంది రీజియన్ కార్యాలయ ఉద్యోగులు, నలుగురు మెడికల్, ముగ్గురు ఫైనాన్స్, ఒకరు స్టోర్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. టీఎంయూ దారెటు? 2016లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) విజయం సాధించింది. ఈసారి ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోవడం, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల్లో టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొంది. లేబర్ కమిషన్ నుంచి అనుమతి విషయంలోనూ సమస్యలు ఎదురయ్యా యి. రీజియన్‌లో బలమైన సభ్యత్వం ఉన్న టీఎంయూ పోటీకి దూరమైతే.. ఇతర సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా తమ బలాన్ని చాటుకునేందుకు ఆ సంఘం నాయకులు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, నేషన ల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిపోల్లో గేట్ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ)తో పోటీకి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గుర్తులు కేటాయించిన తర్వాత మరి కొన్ని యూనియన్ల మధ్య పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. షెడ్యూల్ ఇలా ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోటీ చేసేందుకు యూనియన్ల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం డీఎంల ద్వారా రిట ర్నింగ్ అధికారులకు డ్రాఫ్ట్ అభ్యంతరాలకు ఆహ్వా నం, 24న ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 25న తుది ఓటర్ల జాబితా, 26న గుర్తుల కేటాయింపు, అదే రోజు తుది ఓటర్ల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించనున్నారు. 29న డమ్మీ బ్యాలెట్ పేపర్ల సమీకరణ, అక్టోబర్ 9న పోలింగ్, అక్టోబర్ 14, 15న పోస్టల్ బ్యాలెట్, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. -
డ్రైవింగ్ శిక్షణ.. భవితకు రక్షణ
● అంతర్జాతీయ నైపుణ్యాలతో విదేశాల్లో కొలువులు ● మండెపల్లి ఐడీటీఆర్‌లో ట్రెయినింగ్ ● ఎంపికైతే రూ.లక్షల్లో వేతనాలు తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉపాధి వేటలో ఉన్న గ్రామీణ యువతకు డ్రైవింగ్ మంచి అవకాశంగా మారింది. విదేశాల్లో డ్రైవర్లకు ఆకర్షణీయమైన వేతనాలు ఉండడంతో జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని యువత డ్రైవింగ్ శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్(ఐడీటీఆర్)లో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఐడీటీఆర్‌లో శిక్షణ, ఉపాధి అవకాశాలపై స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ స్థాయి శిక్షణ మండెపల్లిలోని ఐడీటీఆర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్) కేంద్రంలో అత్యాధునిక వసతులతో ప్రాక్టికల్, థియరీ శిక్షణ ఇస్తున్నారు. వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లే ముందు.. సిమ్యులేటర్ పరికరాల ద్వారా వర్చువల్‌గా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ రోడ్డు భద్రత నిబంధనలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, డ్రైవింగ్ ఎథిక్స్‌పై నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న భారీ వాహనాలు(హెచ్ఎంవీ), తేలికపాటి వాహనాలు(ఎల్ఎంవీ) నడపడంలో అనుభవజ్ఞులైన శిక్షకుల ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు జిల్లా యువతకు ఈ కేంద్రం విదేశీ ఉపాధికి రాజమార్గంగా మారింది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. గల్ఫ్, జపాన్ దేశాల్లో డిమాండ్ సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలతోపాటు సాంకేతికంగా అభివృద్ధి సాధించిన జపాన్‌లో డ్రైవర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. మండెపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో నెలకు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. యువతకు ఉపాధి భద్రత గతంలో సిరిసిల్ల ప్రాంతం నుంచి సరైన శిక్షణ లేకుండా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ మండెపల్లి ఐడీటీఆర్ ద్వారా పూర్తిస్థాయి సాంకేతిక శిక్షణ, లైసెన్స్ ప్రాసెసింగ్ అవగాహన పొంది వెళ్లడంతో ఉద్యోగ భద్రతతోపాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. -
దంచికొట్టిన వర్షం
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం వాన దంచికొట్టింది. బోయినపల్లిలో అత్యధికంగా 22.5 మిల్లీమీటర్ల వర్షం పడగా.. తంగళ్లపల్లిలో 22.3, ఎల్లారెడ్డిపేటలో 18.8, గంభీరావుపేటలో 11.6, రుద్రంగిలో 1.4, చందుర్తిలో 4.3, వేములవాడ రూరల్‌లో 4.6, సిరిసిల్లలో 9.4, కోనరావుపేటలో 1.9, ముస్తాబాద్‌లో 8.7, ఇల్లంతకుంటలో 3.0 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 8.3 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కాటన్ చీరల కార్మికులకు న్యాయం చేయండి సిరిసిల్లటౌన్: కాటన్ చీరల కార్మికులు, ఆసాములకు న్యాయం చేయాలని సీఐటీయూ నేతలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. నిరవధిక సమ్మెలో ఉన్న కాటన్ చీరలు ఉత్పత్తి చేసే కార్మికులు, ఆసాములపై యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మూశం రమేశ్, కోడం రమణ ఉన్నారు. ఆత్మరక్షణకు కరాటే వేములవాడ: బాలికల ఆత్మరక్షణకు కరాటే అవసరమని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వేములవాడలోని ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. కటాస్, కిక్ బ్యాలెన్సింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, మెరున్ బెల్టులు ప్రదానం చేశారు. కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నాన్‌ను అభినందించారు. సీనియర్ కరాటే మాస్టర్ కనకరపు రాజశేఖర్ ఉన్నారు. కూలిన పెంకుటిల్లు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని దేశాయిపల్లెకు చెందిన నకీర్తి బాలయ్య పెంకుటిల్లు ఇటీవల కురిసన వర్షాలతో కూలిపోయింది. దీంతో కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో ఎంపీడీవో డి.రమేశ్ ఆదివారం దేశాయిపల్లెలో పర్యటించారు. కూలిన పెంకుటిల్లును పరిశీలించి అర్హత ఉండడంతో ఇందిరమ్మ ఇంటి మంజూరుకు జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ కంకణాల రజిత–రమేశ్, కార్యదర్శి సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు అవార్డు ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం గ్రామానికి చెందిన ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు ఉత్తమ సేవ–2026 అవార్డు వచ్చింది. ఈ మేరకు భువనగిరి జిల్లా ఆత్మకూరు భారత్ రక్తాదాన్ ఎన్జీవో ఉత్తమ సేవా అవార్డును సంస్థ అధ్యక్షుడు మేడి సురేశ్‌కు ఆదివారం అందజేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు అవార్డు అందజేశారు. అవార్డును అందుకున్న సురేశ్, సభ్యులు వెంకట్‌ను గ్రామస్తులు అభినందించారు. -
రాజకీయ ‘భూ’కంపం !
● 8వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారన్న సీఎం ● బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలన్న కేటీఆర్ ● ముఖ్యమంత్రిపై ‘కొండూరి’ పరువు నష్టం దావా ● సీఎం పర్యటన నేపథ్యంలో పొలిటికల్ హీట్ సిరిసిల్ల: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన జిల్లాలో రాజకీయ ‘భూ’కంపం సృష్టించింది. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కాజేశారనగా.. చట్టబద్ధంగా కొనుగోలు చేశామని కావాలనే అధికార పార్టీ నాయకులు తమను బద్నామ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల లొల్లి రాజకీయ దుమారం రేపుతోంది. పలువురి అరెస్ట్ ● తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులో సర్వే నంబర్ 1148లో 11 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టాలు పొందారంటూ తహసీల్దార్ ఫిర్యాదుతో తాడూరు మాజీ సర్పంచ్ భర్త సురభీ నవీన్‌రావును 2024లో అరెస్ట్ చేశారు. అక్రమంగా పట్టాలు పొందారని సురభీ సుధాకర్‌రావు, సురభీ సురేందర్రావులపైనా తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ● బీఆర్ఎస్కు చెందిన సిరిసిల్ల బీసీ సంఘం నాయకులు బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాస్, సర్ధాపూర్ మాజీ సర్పంచ్ ఒజ్జెల అగ్గిరాములు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. విమర్శలు.. ప్రతివిమర్శలు ప్రభుత్వ భూముల పట్టాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సర్కారు భూమిని కొనడం, అమ్మడం తప్పయినప్పుడు ఆ పార్టీ అనుచరులను కేటీఆర్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేస్తున్నారు. అసైన్మెంట్ భూములపై లోతుగా విచారణ ప్రభుత్వ భూముల కేటాయింపులపై రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ భూములను పేదల పేరిట పెద్దలకు పట్టాలిచ్చిన అసైన్మెంట్ భూములపై జిల్లా రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో 22–ఏ నిషేధిత భూముల జాబితాలో 3,718 ఎకరాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 91,416 సర్వేనంబర్లు ఉండగా 4,68,532 ఎకరాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా వాపస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టిన తీరుపై అప్పటి కలెక్టర్ సందీర్కుమార్ ఝా తీసుకున్న చర్యలు తాజాగా చర్చనీయాంశమైంది. గతంలో కొందరు ప్రభుత్వ భూములను పట్టాలు పొంది స్వచ్ఛందంగా కలెక్టర్‌కు తిరిగి ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఇవ్వకుండా.. ఇంకా అలాగే ఉంచుకున్నట్లు సమాచారం. దీనిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ప్రభుత్వ భూముల కేటాయింపులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెలాఖరులో సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఇది 2024.. అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అప్పటి ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ భూమిపత్రాలు అందిస్తున్నారు. పద్మ పేరిట 2018లో తాడూరు శివారులోని సర్వే నంబర్ 545/1/1/3/1లో రెండెకరాల ప్రభుత్వ భూమికి పట్టా పొందారు. తనకు కేటాయించిన ఆ రెండు ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు. -
భీమన్న సన్నిధిలో భక్తులు
వేములవాడ: భీమన్నను ఆదివారం 10 వేల మంది దర్శించుకున్నారు. వర్షం కురుస్తున్నా బారులుతీరారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ● సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తంలో భూమి తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని నోటీస్‌లో స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల ద్వారా కోరారు. -
నేతన్నల సంక్షేమానికి పెద్దపీట
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● చేనేత వస్త్ర వ్యాపార సంఘం ప్రమాణస్వీకారం సిరిసిల్లటౌన్: నేతన్నల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇక్కడి వస్త్రపరిశ్రమ అభివృద్ద్ధికి, నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలిపిందని గుర్తుచేశారు. రూ.49 కోట్ల నేతన్నల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. నేతన్నల విద్యుత్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలోనే సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చిన 48 గంటల్లోనే 25 హెచ్‌పీ విద్యుత్ కనెక్షన్లలో మార్పు చేశామన్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడిగా తాటిపాముల దామోదర్, ఉపాధ్యక్షుడిగా గౌడ రాజు, కార్యదర్శిగా శ్రీగాధ విష్ణు, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కోశాధికారిగా సామల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేశం, గుండేటి మధుకర్, మేర్గు సత్యనారాయణ, అన్నల్దాస్ సురేష్, దూస కృష్ణప్రసాద్, జిందం రవి, కళ్యాడపు పాండురంగం, రిక్కుమల్లె బాలశివరామకృష్ణ, కోడం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ విప్ ఈరపత్రి అనిల్‌కుమార్, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ అధ్యక్షుడు దూడం వెంకటరమణ, వైస్‌చైర్మన్ జక్కని లత, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కే.కే.మహేందర్‌రెడ్డి, రాపెల్లి లక్ష్మీనారాయణ, దార్ల సందీప్ పాల్గొన్నారు. -
ఇక.. పల్లెలు పరిశుభ్రం
● అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు ● ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టిగంభీరావుపేట(సిరిసిల్ల): పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత హీ సేవ–2026 కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్, వికసిత భారత్’ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘వోల్ ఆఫ్ గవర్నమెంట్–వోల్ ఆఫ్ సొసైటీ’ విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, గ్రామస్తుల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు, కార్యక్రమాలివే.. గ్రామాల్లో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, ప్రజలకు తడి–పొడి చెత్తపై అవగాహన కల్పించడం, పారిశుధ్యంపై ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞలు, వ్యాసరచన, చిత్రలేఖనం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు యువతను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయనున్నారు. గ్రామాల్లో ప్రత్యేక దృష్టి గ్రామపంచాయతీల పరిధిలో ప్రధాన కూడళ్లు, రహదారులు, బస్టాండ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కా ర్యాలయాల పరిసరాలు, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను శుభ్రపరచాలని సూచిస్తున్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించేలా అవగాహన కల్పించనున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలతో ఈ పక్షోత్సవాలను ముగించనున్నారు. -
వ్యాపారంపై ప్రభావం ఉంది
తరచూ ధరల హెచ్చుతగ్గులతో మార్కెట్లో ఇబ్బంది ఎదురవుతుంది. ధరలు సైతం పెరి గిపోవడంతో వినియోగం పడిపోయి ంది. గతంలో ఎక్కువ సరుకులు తీసుకునే వారు ఇప్పుడు తగ్గించుకుంటున్నారు. ధరలు పెరుగుదల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. – శ్రీనివాస్, ట్రేడర్ ధరలు బాగా పెరిగాయి నెల రోజులకు, ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయి. గతంలో నెలకు రూ.5వేల వరకు సరుకులకు ఖర్చు పెట్టేవాళ్లం. ధరలు పెరిగిపోవడంతో నెలవారీ సరుకుల బిల్లులు కూడా పెరుగుతున్నాయి. – బాపురెడ్డి, ప్రైవేట్ ఉద్యోగి, ఎల్లారెడ్డిపేట సర్దుకుపోతున్నాం గతంలో కిచెన్‌లో అవసరం ఉన్న సరుకులు ఎక్కువ మొత్తంలో కొనేవాళ్లం. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తక్కువ మొత్తంలో కొని, వాటితోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. – కనకవ్వ, గుట్టపల్లిచెరువు తండా, గృహిణి -
సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేస్తున్నాం
ఐడీటీఆర్‌లో మెరుగైన శిక్షణ ఇస్తూ రోడ్డు భద్రతను పెంపొందిస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. స్థానిక నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.దురైమురుగన్, సెక్రటరీ ప్రిన్సిపాల్, ఐడీటీఆర్ సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవడం ద్వారా స్వదేశంతోపాటు విదేశాల్లోనూ చక్కని వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా యువత ఐడీటీఆర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. – గరీమా అగ్రవాల్, కలెక్టర్ -
ఘాటెక్కిన ఉల్లి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉల్లిగడ్డ..ఎల్లిగడ్డ..నూనె.. ఏది చూసిన ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు సరుకులకే సరిపోతలేవు. ఇక పిల్లల చదువులు.. వైద్యం.. పండుగలు.. పబ్బాల ఖర్చులు భరించడం మరింత భారమవుతున్నాయి. జీతాలు.. కూలి పనులు.. వ్యాపారాల నుంచి ఆదాయం అంతంతే వస్తుండగా నిత్యావసరాల సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన సరుకుల ధరలు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. పెరిగిన ధరలు.. సామాన్యుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం. భగ్గుమంటున్న ధరలు నిత్యావసర సరుకుల ధరలు గత పదిహేను రోజుల్లో విపరీతంగా పెరిగాయి. గతంలో ఉల్లిగడ్డ రూ.100లకు ఐదు కిలోల చొప్పున విక్రయించగా.. నేడు కిలో రూ.75 నుంచి రూ.80 పలుకుతోంది. ఎల్లిగడ్డ రూ.250కి చేరింది. ఇక చక్కెర కిలో రూ.60, లీటర్ సన్‌ఫ్లవర్ నూనె రూ.185, పల్లినూనె రూ.160కి చేరింది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుల నెలవారీ ఖర్చు సైతం యాభై శాతానికి పైగా అధిక భారమయ్యాయి. సామాన్యుల జేబుకు చిల్లు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు అధికమయ్యాయి. గతంలో నలుగురు ఉన్న కుటుంబానికి ఒక నెలలో నిత్యావసర సరుకులకు రూ.5వేల వరకు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు రూ.7వేల వరకు చేరుకుంటుంది. ఒక నెలలో రూ.2వేల వరకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడంతో ప్రైవేట్ ఉద్యోగులు, కూలి పనులు చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది తమ ఖర్చు తగ్గించుకునేందుకు సర్దుకుపోతున్నారు. సరుకుల్లో కోత పెట్టుకోవడం, కొన్ని వస్తువులను తాత్కాలికంగా కొనుగోలు చేయడం లేదు. -
మీసేవ కేంద్రంలో పోలీసుల విచారణ
● ఇప్పటికే నిందితుడి రిమాండ్ ● ఇతరుల ప్రమేయంపైనా ఆరా ● ఎల్లారెడ్డిపేటలో కలకలం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. మీసేవ కేంద్రంలో పనిచేసే యువతిపై అనుచితంగా ప్రవర్తించిన నిర్వాహకుడు శ్రీనివాస్‌ను శుక్రవారం రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేశ్, ఎస్సై రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది శనివారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. కేంద్రంలోని సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించి, పలు సాక్ష్యాలు సేకరించినట్లు తెలిపారు. యువతిని వేదించిన విషయంలో ఇతరుల ప్రమేయం ఉందన్న కోణంలో ఆరా తీస్తున్నామన్నారు. అలాగే కేంద్రం యజమానిని పిలిపించి పలు వివరాలు ఆరా తీశామని తెలిపారు. -
● గుర్తింపు కోసం హద్దులు దాటుతున్న కంటెంట్ ● వైష్ణవి భర్త హరిబాబు హత్య అనంతరం నిందితుడి వీడియో ● ఈశ్వర్‌సాయి ఉదంతంలోనూ ప్రైవేటు వీడియోలు లీక్ ● ఇంటర్వ్యూ చూసి 20 ఏళ్ల పగ తీర్చుకున్న యువకుడు ● సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన
19 ఏళ్ల వైష్ణవి యూట్యూబర్. సోషల్ మీడియాలో ఫేమస్. వైష్ణవిని సోషల్ మీడియాలో చూసి మనసు పారేసుకున్న హరిబాబు.. ఆమెనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం దంపతుల మధ్య విభేదాలు చెలరేగి వైష్ణవి హత్యకు దారితీసింది. వైష్ణవి హత్యపై పగపెంచుకున్న ఆమె సోదరుడు సంతోష్ సోషల్‌మీడియా వేదికగా హరిబాబును చంపుతానని ప్రతినబూనాడు. అన్నట్లుగానే హత్య చేసి, తానే చంపానంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఒక ప్రాణం తీసి నెటిజన్ల నుంచి మద్దతు కోరడం సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ ఉదంతం వైష్ణవి–హరిబాబుల ప్రాణాలు పోవడంతోపాటు సంతోష్‌ను జైలు పాలుజేసింది. -
వాతావరణానికి అనుగుణంగా సాగు చేయాలి
● ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి చందుర్తి(వేములవాడ): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి కోరారు. మండలంలోని సనుగులలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముకుందరెడ్డి మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు పంటల పెరుగుదలపై ప్రభావం చూపుతాయన్నారు. వ్యవసాయాధికారి దుర్గారాజు, సర్పంచ్ బొడిగే లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సాయికుమార్, ఏఈవో శారద పాల్గొన్నారు. చేయూత దరఖాస్తులపై విచారణ ముస్తాబాద్(సిరిసిల్ల): చేయూత పింఛన్ దరఖాస్తులపై నామాపూర్ గ్రామపంచాయతీలో శనివారం విచారణ చేపట్టారు. దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు చేసుకున్న దరఖాస్తులను ఏవో అనూష పరిశీలించారు. సర్పంచ్ అనిల్, ఉపసర్పంచ్ కొంరయ్య, కార్యదర్శి రాజు ఉన్నారు. సదరం శిబిరాలు సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈనెల 21 నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం తెలిపారు. సెప్టెంబరు 21న ఆర్థోపెడిక్(ఎముకలు), కంటిచూపు శిబిరం, 23న వినికిడి, జనరల్, 24న వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక వైకల్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. అక్టోబరు 1, 3, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్ పరీక్షలు, 3న మానసిక, 8, 15, 22, 26న కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. యూడీఐడీ దరఖాస్తు ఫామ్‌తోపాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్‌ఫోన్, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్‌రే వంటి వాటిని తీసుకుని శిబిరాలకు రావాలని కోరారు. -
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ప్రధాన రహదారిపై శనివారం బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. రోడ్డుకు ఇరువైపులా జాగిలంతోపాటు బాంబులను గుర్తించే పరికరాలతో తనిఖీలు చేశారు. ఈనెలాఖరును జిల్లాకు ముఖ్యమంత్రి వస్తానని ప్రకటించడం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టడం చర్చనీయంగా మారింది. పారితోషికం చెల్లించండి వేములవాడ: తమకు అధికారులు ఇచ్చిన హామీ మేరకు 50 శాతం పారితోషికం చెల్లించాలని పేర్కొంటూ రాజన్న కల్యాణకట్టలో పనిచేసే నాయీబ్రాహ్మణులు శనివారం నిరసన తెలిపారు. పార్కింగ్ స్థలం వద్దనున్న కల్యాణకట్టలో ప్రైవేట్ నాయీబ్రాహ్మణులు పనులు చేస్తుంటారు. వీరికి టికెట్‌పై యాభై శాతం ఇస్తామని ముందుగా ప్రకటించి, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. దీంతో చేసేదేమి లేకనే భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదులు వెల్లడంతో చర్యలకు దిగారన్నారు. ఈనేపథ్యంలోనే తమకు టికెట్‌పై యాభై శాతం పారితోషికం ఇవ్వాలని నిరసన తెలిపారు. భూముల రీసర్వే కోసం గ్రామసభలు ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని జంగారెడ్డిపల్లి, తిప్పాపురం, జవారిపేట, రహీంఖాన్పేటల్లో శనివారం భూముల రీసర్వే కోసం సర్వే, ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ అధికారులు శనివారం గ్రామసభలు నిర్వహించారు. ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా సిరికొండ, రహీంఖాన్‌పేట, తిప్పాపురం, జవారిపేట, జంగారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేశారన్నారు. సిరికొండలో భూముల రీసర్వే సాగుతోందని పేర్కొన్నారు. ఏ భూముల వద్ద సర్వే చేస్తారో ఆ ప్రాంతంలోనీ రైతులు భూమికి సంబంధించిన కాగితాలు తీసుకురావాలని సూచించారు. డీఐ వెంకటాచారి, తహసీల్దార్ సురేష్, సర్పంచులు మంజుల, పండుగ సునీత, నాగరాజు, కమటం లావణ్య, ఆర్ఐ సంతోష్, కార్యదర్శి పులి సంధ్య, జీపీవో ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక సిరిసిల్ల అర్బన్: రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు జిల్లా నుంచి 45 మంది ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. మినీస్టేడియంలో శనివారం నిర్వహించిన పోటీల్లో 13 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు మెన్ అండ్ ఉమెన్ పోటీలు నిర్వహించారు. ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. వ్యాయాయ ఉపాధ్యాయులు రాజు, అశోక్, శైలజ, అజయ్, సంతోష్ పాల్గొన్నారు. రేపు సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వార్షిక మహాసభసిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు 40వ వార్షిక మహాసభ సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఈవో పత్తిపాక శ్రీనివాస్ శనివారం తెలిపారు. స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మహాసభ జరుగుతుందని వివరించారు. 2025–2026 బడ్జెట్ ఖర్చుల ఆమోదం, నికర లాభం పంపిణీ, 2026–2027 వార్షిక బడ్జెట్ ఆమోదంపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు. -
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
అనంత పద్మనాభస్వామి రూపంలో...విద్యుత్ దీపాల అలంకరణలో వినాయకుడువిభిన్న రూపాయ.. విఘ్నేశ్వరాయవినాయక నవరాత్రి ఉత్సవాలు సిరిసిల్లలో కనులపండువగా సాగుతున్నాయి. గణేశుడి విగ్రహాలు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపాల సెట్టింగులు భారీ హంగులతో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిత్యం అన్నదానాలు, కుంకుమపూజలతో ఆధ్యాత్మిక, సేవ భావాలను విస్తరింపజేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
భక్తితో నిమజ్జనం చేయాలి
సిరిసిల్ల/వేములవాడ: వినాయక నిమజ్జన వేడుకలను దీక్ష, భక్తితో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. సిరిసిల్లలోని వరసిద్ధి వినాయక ఆలయాన్ని శనివారం సందర్శించారు. పట్టణంలోని సాయినగర్, బీ.వై.నగర్, సిక్కువాడు, ప్రెస్‌క్లబ్, రెడ్డివాడ, రాళ్లబావి, వేములవాడలోని వినాయక మండపాలను శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఇతరులు వేలెత్తి చూపకుండా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రతాప రామకృష్ణ, వికాస్‌రావు, రాపెల్లి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, నాయకులు ఎర్రం వెంకట్రాజం, అన్నల్దాస్ వేణు, నాగుల శ్రీనివాస్, బర్కం లక్ష్మీనవీన్‌యాదవ్, వంశీ పాల్గొన్నారు. -
సోషల్‌మీడియా దుర్వినియోగం వద్దు
భావ ప్రకటన స్వేచ్ఛకు సోషల్‌మీడియా మంచి వేదిక. ప్రజలకు విజ్ఞానాన్ని పంచేందుకు చక్కటి సాధనం. దురదృష్టవశాత్తూ దీన్ని దుర్వినియోగానికి వాడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాలంలో వచ్చే కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఫేక్ కంటెంట్‌తో సమాజంలో అలజడులు రేపే, రెచ్చగొట్టే కంటెంట్, వీడియోలపై రిపోర్టు చేస్తే చర్యలు తీసుకుంటాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ సోషల్ మీడియా ఫేమ్, పరిచయాలు, తాత్కాలిక ఆకర్షణలు జీవిత నిర్ణయాలను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి. వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలి. అప్పుడే సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ బంధాలను కాపాడుకోగలుగుతాం. – ప్రీతి, మానసిక వైద్య నిపుణురాలు -
భరతనాట్యంలో ‘ఆరాధ్య’!
చదువుతోపాటు భరతనాట్యంలో రాణిస్తోంది ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన మూల ఆరాధ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపులో తోటి కళాకారులతో కలిసి నాట్య ప్రదర్శన చేసింది. ఆరాధ్య తల్లిదండ్రులు భూపాల్‌రెడ్డి, మానస. ఆరాధ్య ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి చదువుతోంది. 4వ తరగతి నుంచి భరతనాట్యంలో స్థానిక నాట్య కళా అకాడమీలో శిక్షణ పొందింది. రెండేళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలిచ్చింది. ఈనెల 6న అస్సాంలోని గౌహతిలో నాట్యజరి ఫెస్టివెల్లో పాల్గొంది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం, ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దాదాపు 20 ప్రదర్శనలిచ్చింది. – ఇల్లంతకుంట(మానకొండూర్) -
స్వచ్ఛకీర్తి కాపాడుదాం
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్ల కీర్తిని కాపాడేలా ప్రజలు బాధ్యతగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్లను ఆవిష్కరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు, భక్తులు సహజమైన పువ్వులను, రంగులను మాత్రమే వాడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, వైస్‌చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్ సభ్యులు బూర బాలు, ఎర్రం వెంకట్రాజం, మొగిలి నాగరాజు, కూ ర భాగ్యలక్ష్మి దేవరాజ్, ఎలుక వెంకటేశం, అడిచెర్ల రూపసాయికృష్ణ, పాషికంటి రమ్య, బత్తుల రమేశ్, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్ పాల్గొన్నారు. -
ఆదర్శం.. ఆధ్యాత్మికం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఐక్యత.. దేశభక్తి..ఆధ్యాత్మికతను చాటి చెప్పేందుకు ఆరంభమైన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు.. రోజురోజుకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల నవరాత్రి ఉత్సవాల్లో కొత్త పోకడలు ప్రవేశించాయి. డ్యాన్స్‌లు, డీజే మ్యూజిక్‌తో కొంతమంది యువత నృత్యాలు చేస్తున్నారు. భారీతనానికి వెళ్తూ ఖర్చు సైతం లక్షల నుంచి కోట్లకు చేరుకుంది. అయితే ఈ పోకడల మధ్యే కొన్ని మండపాల నిర్వాహకులు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు జరిగినన్నీ రోజులు భజనలు.. పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికతను విస్తరిస్తున్నారు. జిల్లాలో వేడుకలు ప్రత్యేకం ఇలా.. -
పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి
సిరిసిల్ల: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ(డీఐపీసీ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులపై ఆరా తీయగా.. టీజీ ఐ–పాస్‌లో 44, టీ ప్రైడ్ కింద 83 దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని అధికారులు వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి హనుమంతు, లీడ్‌బ్యాంక్ మేనేజర్ రాజీవ్‌కుమార్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బీఎం అనిల్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి సంగీత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కిరణ్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్, టీజీఐఐసీ, పీసీబీ అధికారులు శ్రీనివాస్, విక్రమ్, కనకజ్యోతి, డీటీసీపీవో అన్సార్ పాల్గొన్నారు. 4న రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్సీఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహిస్తామని జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఎన్నికలు జిల్లా సమాఖ్య భవనంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఐఆర్సీఎస్లో సభ్యత్వం ఉన్న వారు పోటీ చేసేందుకు అర్హులని తెలిపారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ వ్యవహరిస్తారని ప్రకటించారు. -
భజనలతోనే శోభాయాత్ర
ముస్తాబాద్ గౌడ సంఘంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాం. సంఘంలో యాభై ఏళ్లుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. భజనలతోనే గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చుతాం. ఇదే విధానం మేము పాటిస్తాం. – తాళ్లపల్లి శ్రీనివాస్, ముస్తాబాద్ చైతన్యం చేస్తున్నాం గణేశ్‌నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులను కోరుతున్నాం. తొమ్మిది రోజులపాటు నిష్టగా ఉండాలని సూచిస్తున్నాం. మా విజ్ఞప్తి మేరకు మందు, మాంసానికి దూరంగా ఉంటామని పలువురు ముందుకొచ్చారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికతను పెంచేలా ఉండాలని కోరుతున్నాం. – రేపాక రాజేందర్‌శర్మ, అర్చకుడు సంప్రదాయాలు పాటించాలి నిర్వాహకులతో నిర్వహించిన సమావేశాలకు స్పందన వస్తోంది. మండపాలు నిర్మించిన దగ్గర నుంచి, ఆగమనం, తొమ్మిది రోజుల ఉత్సవం, శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నాం. డీజేలు, సినిమా పాటలకు దూరంగా ఉంటూ, డప్పు కళాకారులను ప్రోత్సహించాలని చెప్పాం. – కత్తురోజు నాగేంద్రచారి, డీఎస్పీ, సిరిసిల్ల -
జర్మన్ సిల్వర్ వినాయకుడు !
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో తొలిసారి జర్మన్ సిల్వర్ గణపతులతో కూడిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెంకంపేట(మార్గం ఫంక్షన్‌హాల్ ఎదురుగా) రామ్‌లాల్ మండప్‌లో 18వ వార్షికోత్సవం సందర్భంగా జర్మన్ సిల్వర్‌తో చేసిన 2,400 వినాయకుడి విగ్రహాలతో కూడిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వెండికోటింగ్ గణపతుల విగ్రహాన్ని చిలువేరి రాజేశం–రాజమణి, చిలువేరి మారుతి–శ్రీదేవి దంపతులతోపాటు వారి పిల్లలు అభినవ్, అభిశ్రీలు అందించారు. టోకెన్ తీసుకున్న వారికి నిమజ్జనం రోజు సిల్వర్ గణపతి విగ్రహాలను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
దూరం నుంచి తెచ్చుకుంటున్నాం
ఒకప్పుడు ఊరిలోకే యూరియా బస్తాలు వచ్చేవి. ఇప్పుడు యాప్‌లో బుక్ చేసుకుంటే ఎక్కడెక్కడో దొరుకుతున్నాయి. బస్తాకు రూ.300 అయితే తెచ్చుకునేందుకు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. మా కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. – సూర భాస్కర్, నారాయణపూర్, రైతు స్థానికంగా దొరికేలా చూస్తాం మండల పరిధిలోనే యూరి యా దొరకడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇతర జిల్లాలు, మండలాల్లో కాకుండా మండల రైతులకు స్థాని కంగా యూరియాను అందించాలని కలెక్టర్‌కు నివేదించాం. రైతుల ఇబ్బందులు తొలగించడానికి క లెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. – రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి -
బాలల రక్షణ అందరి బాధ్యత
తంగళ్లపల్లి(సిరిసిల్ల): బాలలపై జరిగే లైంగిక నేరాలు అరికట్టడం, హక్కుల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు కోరారు. తంగళ్లపల్లిలోని శ్రీసరస్వతీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేణు మాట్లాడుతూ చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతోనే లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం–2012(పోక్సో)ను తీసుకొచ్చిందని వివరించారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, న్యాయవాదులు కుంట శ్రీనివాస్, గుర్రం ఆంజనేయులు, అరుణ పాల్గొన్నారు. -
యూరియా.. దూర భారమాయే!
● అన్నదాతలను వెంటాడుతున్న ఎరువుల కష్టాలు ● జిల్లా రైతులకు ఇతర జిల్లాల్లో బుకింగ్ ● రూ.300 బస్తాను తెచ్చేందుకు రూ.300 ఆటో కిరాయి ● రైతులకు ఆర్థిక ఇబ్బందులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఊరిలోకే వచ్చిన ఎరువులు.. ఇప్పుడు యాప్‌లో బుక్ చేసుకునే విధానం రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం.. తెలిసిన వారి దగ్గరికి పోయి బుక్ చేయించుకుంటే ఇతర జిల్లాల్లో బుక్ అవుతుండడం సమస్యగా మారింది. రూ.300 బస్తాను దూర ప్రాంతం నుంచి తెచ్చుకునేందుకు ఆటో కిరాయికి రూ.300 పెట్టాల్సి వస్తుండడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రైతుల యూరియా కష్టాలపై ఫోకస్ కథనం.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్‌కు చెందిన ఓ రైతుకు బోయినపల్లి మండలంలో ఒక్క బస్తా యూరియా బుక్ అయ్యింది. అంతదూరం వెళ్లి ఒక్క బస్తా తెచ్చుకోలేక క్యాన్సిల్ చేసుకున్నాడు.గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓర్సు రాజమల్లు అనే రైతు వారం రోజుల క్రితం యాప్‌లో యూరియా బుక్ చేసుకోగా ఇల్లంతకుంట మండలంలో దొరికింది. యూరియా బస్తా ఒక్కంటికి రూ.300 కాగా.. నాలుగు బస్తాలను అక్కడి నుంచి ఆటోలో తెచ్చేందుకు రూ.2వేలు కిరాయి చెల్లించాల్సి వచ్చింది. బస్తా ధర కంటే రవాణా చార్జీ డబుల్ అయ్యిందని సదరు రైతు వాపోయాడు. -
సారూ.. పని ఉందా !
వేములవాడరూరల్: పని దొరుకుతుందన్న భరోసాతో వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది లేబర్ అడ్డాకు సూర్యోదయానికి ముందే చేరుకుంటారు. అరుణ కిరణాల సాక్షిగా ఎవరైనా పని ఇస్తారనే ఆశలు చిగురిస్తుంటా యి. అందరికీ పని దొరకడం లేదు. చాలా మంది ని రాశతో వెనుదిరుగుతున్నారు. వేములవాడలో రోజూ ఉదయం లేబర్ అడ్డా వద్ద వందలాది కూలీ లు గుమిగూడుతున్నారు. భవన నిర్మాణ పనుల కో సం యజమానులు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను తీసుకెళ్తుంటారు. అవసరానికి మించి కూలీలు ఉండటంతో అందరికీ పని దొరకడం లేదు. పని దొరికితే పండుగే.. రోజంతా కష్టపడితే వచ్చే కూలీతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ఒక రోజు పని దొరికితే మరో రోజు పని లేక ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని పలువురు కూలీలు వాపోతున్నారు. పని లేని రోజుల్లో కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టి సారించాలి కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉపాధి అవకాశాలు, ఇతర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కూలీలు కోరుతున్నారు. లేబర్ అడ్డా వద ్ద ఎలాంటి సౌకర్యాలు లేవు. వర్షాకాలం తడుస్తూ ఇబ్బంది ప డుతున్నారు. మూత్రశాలలు, నీటి సౌకర్యం లేదు. ఇతర రాష్ట్రాల కూలీల రాకతో.. ఇసుక కొరత, పెరుగుతున్న ధరలతో నూతన గృహాల నిర్మాణం తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాల కూలీలు రావడంతో స్థానికులకు పని దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు తక్కువకే పనిచేస్తుండడం కూడా స్థానికులపై ప్రభావం చూపుతుంది. -
అంబేడ్కర్‌కు క్షీరాభిషేకం
సిరిసిల్లటౌన్: అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై జిల్లా కేంద్రంలో శుక్రవారం సంబరాలు చేశారు. దళిత, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాసు, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, జిల్లా అధ్యక్షుడు తుంగ శివరాజు, నేదూరి లక్ష్మణ్, నక్క నర్సయ్య, సిరిగిరి కిశోర్, లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. హమార ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం ముస్తాబాద్(సిరిసిల్ల): అంబేడ్కర్‌ను అవమానిస్తూ రచనలు చేసిన హమార ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకుడు అంకని భాను కోరారు. మండలంలోని తుర్కపల్లిలో హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుర్గాప్రసాద్, దేవదాస్, ఎల్లం ఉన్నారు. -
జీవో 97 ఉపసంహరించుకోవాలి
వేములవాడ అర్బన్: జీవో 97ను ఉపసంహరించుకోవాలని కోరుతూ అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జేఏసీ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. వెనుకకు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీవో 97తో అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యజమానులపై చర్యలు తీసుకోవాలి సిరిసిల్లటౌన్: కాటన్ చీరల నడిపించే కార్మికులు, ఆసాముల కూలి పెంచాలని చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శుక్రవారం నిరసనలు హోరెత్తించారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనితకు వినతిపత్రం అందించి మాట్లాడారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చీరలు ఉత్పత్తితో అధిక లాభాలు పొందుతూ కార్మికులకు కూలి పెంచడానికి నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానుల మొండి వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్, బూర మల్లేశం. వడ్నాల వీరేశం, నగేశ్, చిరంజీవి, గుండేటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ‘సీఎం ప్రకటనపై అధికారులు స్పందించాలి’ సిరిసిల్లటౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు సీఎం చేసిన ప్రకటనపై జిల్లా అధికారులు స్పందించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతిపత్రం అందించారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు పంపిణీ చేయాలని కోరారు. పార్టీ నాయకులు గుంటి వేణు, సోమ నాగరాజు పాల్గొన్నారు. భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలిముస్తాబాద్(సిరిసిల్ల): భూసర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని మొర్రాయిపల్లిలో శుక్రవారం జరిగిన భూభారతి, భూరీసర్వే గ్రామసభలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రైతులు తాము చేసుకుంటున్న భూముల వివరాలు, ఆధారాలు, అధికారులు చూపుతూ సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే కోసం పనిచేస్తున్న సిబ్బందికి సహకరించాలన్నారు. నిర్ధేశిత సమయంలో ప్రభుత్వం సూచించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గూడూరు, మొర్రాపూర్, తెర్లుమద్ది గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. ల్యాండ్సర్వే ఏడీ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయబ్ తహసీల్దార్ అపర్ణ, సర్పంచులు మెంగని శ్రీనివాస్, సునీత, శ్రీనివాస్, దుర్గమ్మ, ఆర్ఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చండి వేములవాడ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు మంజూరు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణప్రసాద్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న కోరారు. వేములవాడలో శుక్రవా రం పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం చూపుతున్న ఏ–25ను సవరించాలని, ఏ–317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు కోల వినయ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల బాబురాజు, సిరిసిల్ల మండల అధ్యక్షుడు పోతుగంటి రమేశ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్ఎస్సీ చైర్పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు అవగాహన తరగతులు పెట్టాలన్నారు. సైన్‌బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతంలో ఆర్అండ్బీ, రవా ణా, పోలీస్ అధికారులు పరిశీలించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపైకొచ్చే చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు. నెల రోజుల్లో డ్రంకెన్‌డ్రైవ్ కింద 1,072, ఎంవీఐ యాక్ట్‌లో 449 కేసులు నమోదు చేశామని, 30 రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన సిరిసిల్లకు చెందిన ఆటోడ్రైవర్ పోసు శ్రీనివాస్ రూ.25వేలు ఆర్థిక సహాయానికి రహవీర్లో ఎంపికై నట్లు తెలిపారు. ఆర్అండ్బీ ఈఈ భీమ్లానాయక్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, రోడ్డు భద్రత కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఎస్బీ డీఎస్బీ జి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్ పాల్గొన్నారు. స్వచ్ఛత పనులపై శ్రద్ధపెట్టాలి స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం స్వచ్ఛత హీ సేవ–2026 పోస్టర్లను ఆవిష్కరించారు. రద్దీ ఉండే ఆలయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, వీవో భవనాలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, డీఏవో అఫ్జల్‌బేగం, ఎస్బీఎం సురేశ్ పాల్గొన్నారు. వృద్ధులకు సహాయ ఉపకరణాలు పంపిణీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3,521 మందికి రూ.2.90 కోట్లతో 16,631 సహాయ పరికరాలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొందరికి ఉపకరణాలు అందించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
● అభివృద్ధి.. సంక్షేమ ‘ప్రజాపాలన’ ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ● ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ● హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: ప్రజాపాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయజెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948లో నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటికి 78 ఏళ్లు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు నుంచి స్వతంత్ర భారతావనిలో 60 ఏ ళ్లు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. రాజన్న ఆలయానికి రూ.390 కోట్లు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు రూ.390 కోట్లతో చేస్తున్నాం. రూ.47.86కోట్లతో రోడ్డు విస్తరణ చేపట్టాం. రూ.111.25 కోట్లతో చేపట్టిన నిత్యాన్నదానం సత్రం పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.12కోట్లతో గుడిచెరువు బండ్ పూర్తి చేశాం. బద్ది పోచమ్మ ఆలయ పనులు తుది దశకు చేరాయి. గుడి చెరువులో బోటింగ్‌కు రూ.1.40కోట్లు మంజూరయ్యాయి. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం పనులు జరుగుతున్నాయి. గోశాల నిర్మాణానికి వేములవాడ మండలం మర్రిపెల్లిలో 40 ఎకరాలు కేటాయించాం. మహిళలకు రుణాలు మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఇందిరా మహిళాశక్తిలో జిల్లాలోని 1,563 స్వయం సహాయక సంఘాలకు రూ.187 కోట్ల రుణాలు, సీ్త్రనిధిలో రూ.20 కోట్లు అందించాం. జిల్లాలో 1,13,375 మందికి ప్రతీ నెల రూ.24.40 కోట్లు పింఛన్లు అందిస్తున్నాం. రూ.41 కోట్ల సీ్త్రనిధి రుణాలతో 1984 యూని ట్లను గ్రౌండింగ్ చేశాం. ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు 50,745 యూనిఫాంలు కుట్టించి అందించాం. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి జిల్లా సమాఖ్య భవనం నిర్మించాం. నేతన్నలకు చేతి నిండా పని వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు ఇందిరా మహిళాశక్తి చీరల తయారీకి 6.86 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇచ్చాం. జిల్లాలోని 133 మ్యాక్స్ సంఘాల ద్వారా 6 వేల మంది కార్మికులకు పనికల్పిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్స్‌కు 30.31 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశాం. నేతన్నకు పొదుపు పథకంలో 4,963 మంది కార్మికులకు రూ.12.40 కోట్లు వాటాధనం విడుదల చేశాం. వేములవాడలో రూ.50 కోట్లతో యారన్ డిపో ద్వారా 90 శాతం క్రెడిట్‌పై నూలు అందిస్తున్నాం. నేతన్న భద్రతలో 5,864 మంది మరమగ్గాల కార్మికులు, 214 మంది చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాం. పేదలకు సన్నబియ్యం జిల్లాలో 5,77,547 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. కొత్తగా 24,643 రేషన్‌కార్డులు అందించాం. రూ.500 గ్యాస్ సిలిండర్‌ను 1,04,058 కుటుంబాలకు అందిస్తున్నాం. రైతుభరోసాలో 1,27,884 మంది ఖాతాల్లో రూ.149.32 కోట్లు జమచేశాం. 46,492 మంది రైతులకు రూ.2లక్షల లోపు పంట రుణాలు రూ.370.75 కోట్లు మాఫీ చేశాం. మర్రిపల్లి వద్ద తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రానికి 40 ఎకరాలు కేటాయించాం. నీటిపారుదల పనుల్లో పురోగతి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ–2 ఫేస్–1 లో రుద్రంగి చెరువు, మర్రిపల్లి చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులు సాగుతున్నాయి. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ–2 కలికోట సూరమ్మ చెరువు కింద 43,100 ఎకరాల ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల సర్వే పూర్తయింది. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. పేదింటి కలను నెరవేర్చాం జిల్లాలో 7,088 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. 3,797 పూర్తయ్యాయి. 2023, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.184.85 కోట్ల విలువైన 457 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతిలో 28.79 లక్షల జీరో కరెంట్ బిల్లులు జారీ అయ్యాయి. రూ.113 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చాం. 1,838 కొత్త వ్యవసాయ కనెక్షన్లు అందించాం. విద్య, వైద్యం సిరిసిల్ల, కోనరావుపేటలకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మూడపల్లి వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,948 ప్రసవాలు జరిగాయి. ఆరోగ్యశ్రీలో 4,692 మంది రోగులకు రూ.14.కోట్ల విలువైన ఆపరేషన్లు చేశారు. రుద్రంగిలో రూ. 45.15కోట్లతో ఏటీసీ కేంద్రానికి శ్రీకారం చు ట్టాం. జిల్లాలోని 3,521 మంది సీనియర్ సిటిజన్లకు రూ.2.90కోట్లతో 16,631 సహాయ ఉపకరణాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 16 అంగన్వాడీ కేంద్రాల భవనాలు పూర్తి చే శాం. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో గొట్టె జయశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, శ్రీసెస్‌శ్రీ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చై ర్మన్లు జిందం కళాచక్రపాణి, పుల్కం రాజు, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్బీ కుమా రి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు. -
నిమజ్జనానికి తిప్పలే !
● మానేరునదిలో నీటి కొరత ● జిల్లా కేంద్రంలో రోడ్లు శిథిలం ● ఏర్పాట్లలో అధికారులు ● భారీ విగ్రహాల నిమజ్జనంపై ప్రత్యేక దృష్టిసిరిసిల్లటౌన్: వర్షం నిత్యం కురుస్తున్నా మానేరునదిలో నీటి లభ్యత అంతంతే ఉంది. వినాయకుల నిమజ్జనానికి కష్టంగా మారింది. గతేడాది ఈ సీజన్లో మానేరువాగు ఉధృతంగా ప్రవహించింది. భారీ వినాయకులను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యాయి. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. మరో వైపు పట్టణంలో లూజు వైర్లు, రోడ్లపై గుంతలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం.. ఎదురయ్యే సమస్యలు.. సవాళ్లపై ప్రత్యేక కథనం. గుంతలతో చింతలు జిల్లా కేంద్రంలో వందలాది సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారు. 28 అడుగుల భారీ వినాయక విగ్రహాలను నెలకొల్పారు. రూ.లక్షలు వెచ్చించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీనగ్రామాలు పెద్దూరు, సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, రాజీవ్‌నగర్, చంద్రంపేట, రగుడులో విగ్రహాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లు ధ్వంసమయ్యాయి. మోకాల్లోతు గుంతలతో వినాయకులకు స్వాగతం పలుకుతున్నా యి. వారం రోజుల్లో నిమజ్జనం కాగా.. రోడ్లపై గుంతలను, లూజ్‌వైర్లు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తీగలను సరిచేయాలని భక్తులు కోరుతున్నారు. అధికారులు అప్రమత్తం జిల్లా కేంద్రంలో జరిగే నిమజ్జనోత్సవంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషా వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మానేరు బ్రిడ్జి వద్ద ప్రధాన నిమజ్జనం పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడే లోతైన కృత్రిమ కొలనులు సిద్ధం చేస్తున్నారు. విలీన గ్రామాలు రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్‌లలో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వినాయకులు తరలే రూట్లలో అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలు తొలగించారు. గుంతలతో ఉన్న ఈ రోడ్డు సంజీవయ్యనగర్. ఇక్కడ సీసీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు వేయాలని స్థానికులు ఏళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏరియా నుంచి నిమజ్జనానికి వెళ్లే గణనాథులకు ఈ రోడ్డు ప్రమాదంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి విలీనగ్రామాల్లో, పట్టణంలో మెహెర్నగర్, రాళ్లబావి, పద్మనగర్, బీవైనగర్ తదితర ప్రాంతాల్లో నెలకొంది. సిరిసిల్లలో వినాయకుల వివరాలు గుర్తించిన వినాయకులు 370(ఇప్పటివరకు) మొత్తం వార్డులు 39 నిమజ్జనం పాయింట్లు 08 మున్సిపల్ సిబ్బంది 100(మూడు షిఫ్టుల్లో) నీటి కొరతపై ఆందోళన వద్దు -
శోభాయాత్రకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలి
వేములవాడఅర్బన్: గణేశ్ శోభాయాత్రకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయం చేసుకుని శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరుపై సమీక్షించారు. డయల్–112కు వచ్చే కాల్స్‌పై త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తదితరులు ఉన్నారు. -
భీమన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు
వేములవాడ అర్బన్: భీమేశ్వరస్వామి హుండీలలో శ్రావణమాసంలో భక్తులు వేసిన కానుకలను రెండు రోజు లుగా లెక్కిస్తున్నారు. రెండో రోజు గురువారం రూ.1.81 కోట్ల నగదు సమకూరింది. మిశ్రమ బంగారం 81.900 గ్రాములు, మిశ్రమ వెండి 6.800 కిలోలు వచ్చినట్లు ఆలయ అధి కారులు తెలిపారు. ఈవో రమాదేవి, కరీంనగర్ దేవాదాయశాఖ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఆలయ డీఈవో నవీన్‌కుమార్, పీఆర్వో పెరిక శ్రీనివాస్ లెక్కింపు పర్యవేక్షించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుసిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19న సిరిసిల్ల మినీస్టేడియంలో ఎంపిక పో టీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపా రు. అండర్ 14, 16, 18, 20 బాలికలు, పురుషులు, మహిళలకు పోటీలు ఉంటాయని వివరించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాల కోరారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని తెలిపారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్ర భవనాలు నిర్మించుకొని సామాన్యులకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా వైద్యాధికారిణి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. మండలంలోని సబ్ సెంటర్ భవనాల నిర్మాణ పనులు, విద్యుత్, తాగునీరు, వైద్య సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను గురువారం పరిశీలించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సబ్ సెంటర్ల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలు మరింత చేరువ చేయాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, మండల వైద్యాధికారిణి సరియా అంజుమ్ పాల్గొన్నారు. -
హియరింగ్‌కు డుమ్మా ‘సర్’
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో సర్ నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావడంలేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో ెపెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కలిపి 6,94,517 సర్ నోటీసులు జనరేట్ కాగా.. ఇందులో 6,12,976 డెలివరీ చేశారు. 81,541 నోటీసులు డెలివరీ కాలేదు. మరో వైపు హియరింగ్ తేదీల్లో గైర్హాజరు కావడంతో 3.21 లక్షలకుపైగా నోటీసులు ల్యాప్స్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతదరు విచారణకు హాజరవుతారు? ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది. నోటీసులు అందినా.. హాజరు ఎక్కడ? నోటీసు డెలివరీ పూర్తయ్యాక సదరు వ్యక్తికి హియరింగ్ తేదీ కేటాయిస్తారు. ఆ తేదీన హాజరు కాకపోతే అది ల్యాప్స్ అవుతుంది. అదేఅంశంపై మరోసారి తేదీ కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఇలాంటి గైర్హాజరీలు పెరిగితే హియరింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కరీంనగర్, జగిత్యాలలో విచారణకు ఓటర్లు గైరాజరవుతున్నారు. కారణాలు అనేకం. హియరింగ్ తేదీలు ల్యాప్స్ కావడానికి ప్రధానంగా నోటీసుల డెలివరీలో జాప్యం ఒక కారణంగా కనిపిస్తోంది. నోటీసు అందిన తర్వాతే సంబంధిత వ్యక్తి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో నోటీసులు ఉండటంతో ప్రతీదానిని నిర్ణీత సమయంలో డెలివరీ చేయకపోవడం, నోటీసు అందుకునే సమయానికి విచారణ తేదీ ముగిసిపోవడం, లేదా తక్కువ సమయం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే నోటీసులు అందుకున్న వారు స్థానికంగా కాకుండా హైదరాబాద్ తదితర దూరప్రాంతాల్లో ఉండటం కూడా హియరింగ్‌కు హాజరుకావడం లేదంటున్నారు. ఒకవేళ గడువురోజు హాజరైనా పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటం, వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో చాలామంది విచారణకు హాజరుకాకుండానే వెనుతిరుగుతున్నారు. విచారణకు హాజరు పెంచడమే కీలకం నోటీసులు జారీచేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. లేకపోతే ఒకే కేసుకు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా సర్ నోటీసుల సమాచారం జిల్లా జారీ డెలీవరి పెండింగ్ విచారణపూర్తి ల్యాప్స్ కరీంనగర్ 2,70,190 2,29,052 41,138 82,773 1,24,386 పెద్దపల్లి 1,47,518 1,30,616 16,902 23,107 55,837 సిరిసిల్ల 83,846 76,211 7,635 27,297 38,619 జగిత్యాల 1,92,963 1,77,097 15,866 47,652 1,02,203 -
దంచి కొట్టిన వర్షం
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వర్షం దంచికొట్టింది. వినాయక చవితి రోజు తెల్లవారుజామునే భారీ వర్షం కురవగా.. మంగళవారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 16.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 4.7, చందుర్తిలో 5.7, వేములవాడ రూరల్‌లో 6.6, బోయినపల్లిలో 7.4, వేములవాడలో 9.0, సిరిసిల్లలో 8.6, కోనరావుపేటలో 6.9, వీర్నపల్లిలో 5.8, ఎల్లారెడ్డిపేటలో 12.6, గంభీరావుపేటలో 8.0, ముస్తాబాద్‌లో 11.8, తంగళ్లపల్లిలో 12.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. వర్షాలతో సిరిసిల్ల మానేరు వాగు, వేములవాడ మూలవాగుల్లో ప్రవాహం పెరిగింది. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేతన్న చౌక్, పాత బస్టాండు ఏరియా వర్షం నీటితో నిండిపోయాయి. జిల్లా అంతటా వర్షం పడడంతో పత్తి, వరి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. రెండు రోజుల పాటు మంచి వర్షాలు పడ్డాయి. -
చేయూత దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి
సిరిసిల్ల: జిల్లాలో చేయూత సామాజిక భద్రత పెన్ష న్ల కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో ఆమె సమీక్షించారు. బుధవారం నుంచి ఈనెల 25 వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, చేనేత, జౌళిశాఖ ఏడీ సంతోశ్‌కుమార్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు. భూముల రీసర్వే పూర్తి చేయాలి భూముల రీసర్వేను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ శాఖల భూముల వివరాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగువైపు ప్రోత్సహించాలి జిల్లాలో ఆయిల్ పాం సాగుతో వచ్చే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పిస్తూ సాగు వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో ఉద్యాన వనాల శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో 709 ఎకరాలకు డ్రిప్ ఆమోదించగా, 502 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటించామని, ఈ వారంలో 143 టన్నుల దిగుబడి రాగా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.35 లక్షలు జమ అయ్యాయని అధికారులు వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి అ ఫ్జల్ బేగం, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు. కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వేములవాడఅర్బన్: తిప్పాపూర్‌లోని గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. కోడెల పంపిణీ ఆనంతరం గోశాలలోని షెడ్లను పరిశీలించి ఎండు, పచ్చి గడ్డి దానాపై ఆరా తీశారు. -
అర్బన్‌పార్క్.. నిర్లక్ష్యపు మార్క్
సిరిసిల్ల: పాలకులు మారితే.. అభివృద్ధి ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. ప్రజల ప్రయోజనాలను సైతం పక్కనపెట్టేస్తుంటారు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది సిరిసిల్ల ఫారెస్ట్ అర్బన్(ఆక్సిజన్) పార్క్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బడి పిల్లలకు విజ్ఞానం, పట్టణ వాసులకు వికాసాన్ని అందించే అర్బన్ పార్క్ నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్–హరిదాస్‌నగర్ మధ్య 150 ఎకరాలలో రూ.3కోట్లతో ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేయగా.. వసతుల కల్పనలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని సిరిసిల్ల అర్బన్పార్క్పై నిర్లక్ష్యపు నీడపై శ్రీసాక్షిశ్రీ ఫోకస్. వాచ్ టవర్.. సఫారీ జీపు ఏది? సిరిసిల్ల పట్టణ పరిధి సర్ధాపూర్ వరకు విస్తరించి ఉండడంతో అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరంలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ – హరిదాస్‌నగర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ 1250 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. ఇందులో 150 ఎకరాల్లో అర్బన్ పార్క్‌ను గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అడవి అందాలను వీక్షించేందకు వాచ్ టవర్ నిర్మాణానికి ప్రతిపాదించారు. అడవి దారిలో ప్రయాణించే రక్షిత వాహనం(సఫారీ) ఏర్పాటు చేస్తే అడవి అంతా తిరిగి అవకాశం దక్కుతుంది. కానీ వాచ్ టవర్ నిర్మాణం, సఫారీ వాహనాన్ని సమకూర్చలేదు. మూడు వాచ్ టవర్లు, ఇతర వసతుల కోసం రూ.3కోట్లతో చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. పిల్లల కోసం ఓ పది సైకిళ్లను అందుబాటులో ఉంచితే వాటిపైన చక్కర్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఛాయ్, బిస్కెట్లతో కూడిన క్యాంటీన్ గది కూడా లేదు. ఇక్కడ పనిచేసే వాచర్‌కు జీతం ఇవ్వడం లేదు. ఆకట్టుకుంటున్న అందాలు అర్బన్పార్క్లోకి వెళ్లేందుకు వీలుగా ప్రాకారంతో కూడిన రోడ్డు వేశారు. పూలమొక్కలు, ఆట వస్తువులు, ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. సేదతీరేందుకు కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. అర్బన్పార్క్లోకి ప్రవేశించగానే... స్వాగతం పలికే నెమలి, ఏ, బీ, సీ, డీ, ఎఫ్ అక్షరాలతో కూడిన దారి, రాకాసిబల్లి, కొంగలు, అడవిలో విహరించే పులిబొమ్మ, సీతాకోక చిలుకలతో అర్బన్‌పార్క్ ఆకట్టుకుంటోంది. తాగునీటి వసతి, టాయిలెట్స్, పిల్లల పార్క్‌లను ఏర్పాటు చేశారు. ఔషధ మొక్కల నిలయం అర్బన్ పార్క్‌లో ఇప్పటికే ఉన్న వృక్షాలు, మొక్కలకు తోడుగా ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలను, నక్షత్ర వనాలు, రాశివనాలను పెంచారు. హెర్బల్ గార్డెన్, అడ్వెంచర్ టెక్కింగ్‌కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని చెట్లు వాటి చరిత్రను పిల్లలకు వివరించేందుకు వీలుగా మొక్కల చరిత్రను రాయనున్నారు. నీటినిల్వ కోసం ఊటకుంట నిర్మించారు. చుట్టూరా పూలమొక్కలతో గార్డెన్లు ఏర్పాటు చేశారు. కుంట మధ్యలోకి వెళ్లేందుకు వంతెన నిర్మించారు. అర్బన్ పార్క్‌లో రాకాసి బల్లి బొమ్మఅర్బన్ పార్క్‌లో నీటి కుంట, మధ్యలోకి వెళ్లేందుకు వంతెనఅభివృద్ధి పనులకు ప్రతిపాదించాం అర్బన్ పార్క్‌లో వాచ్‌టవర్‌కు రూ.20లక్షలు, సఫారీ వాహనానికి రూ.10లక్షలు, క్యాంటీన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. వన్యప్రాణు ల కోసం సోలార్ బోర్లు వేయాల్సి ఉంది. వాటికి ఇంకా మంజూరు కాలేదు. ఆదివారాల్లో ఎక్కువ సందర్శకులు వస్తున్నారు. గత నెలలో 362 మంది వచ్చారు. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.20 రుసుం పెట్టాం. సఫారీ ఉంటే మరింత మంది పర్యాటకులు, స్కూల్ పిల్లలు వస్తారు. వనదర్శిని పేరిట పిల్లలకు ప్రవేశ రుసుంలో రాయితీ ఇస్తున్నాం. అడవి అందాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. – ఎన్.మోహన్‌లాల్, డిప్యూటీ రేంజ్ అధికారి, సిరిసిల్ల -
రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రాజన్న తిప్పాపూర్ గోశాలలోని 500 కోడెలను మంగళవారం రైతులకు అందజేశారు. గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నామని అన్నారు. కోడెలను రైతుల పేరుతో తీసుకొని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనారోగ్య కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని కలెక్టర్ కేటాయించారన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, కౌన్సిలర్ ఎల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల స్థాయిలోనే దృష్టి లోపాలు గుర్తించాలి
సిరిసిల్ల: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపాలను గుర్తించి వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. సిరిసిల్లలోని మైనార్టీ బాలిక గురుకుల విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన కంటి వైద్యశిబిరంలో మాట్లాడారు. విద్యార్థులు కంటి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, నేత్ర సంబంధిత సమస్యలను గుర్తించడం ద్వారా భవిష్యత్‌లో తీవ్రమైన దృష్టి సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నియంత్రణ అధికారి డాక్టర్ నయీమ్ జహా, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ గౌస్ బాషా, డాక్టర్ ప్రమోద, పాఠశాల ప్రిన్సిపాల్ వురూసా ఫాతిమా, ఆప్టోమెట్రిస్ట్ రాజేందర్, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. గణేశ్ నిమజ్జన ప్రదేశాలు పరిశీలనసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించే ప్రదేశాలను సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రాచారిలు మున్సిపల్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. విద్యానగర్ మానేరువాగు తీరంలో నిమజ్జన వేడుకల నిర్వహణపై చర్చించారు. వినా యకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ క్రేన్ల ఏర్పాట్లు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, సందర్శకుల గ్యాలరీ ఏర్పాటు, చిన్న చిన్న ప్రతిమల నిమజ్జన కొలనుల ఏర్పాట్లపై సమీక్షించారు. వారి వెంట సిరిసిల్ల టౌన్, రూరల్ సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మున్సిపల్ డీఈఈ పి.వాణి, ఏఈఈ నర్సింహాస్వామి, సిరిసిల్ల టౌన్ ఎస్సై అశోక్, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మందు తాగం.. మాంసం ముట్టం ముస్తాబాద్(సిరిసిల్ల): ఆదిదేవుడు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో నిష్టగా, ఉపవాసలతో నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రమాణం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో యువకులు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మందు, మాంసం, డీజే సినిమా పాటల జోలికి వెళ్లమని దేవుని సాక్షిగా, అర్చకుడు రాజేందర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు. తొమ్మిది రోజులపాటు పరమ పవిత్రంగా ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, చోట్ల యువకులు గణేశ్ ఉత్సవాల పేరుతో చిందులు వేయడం, మద్యం తాగడం జరుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. బందనకల్ యువత మాత్రం అందుకు భిన్నంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వమే వారోత్సవాలు నిర్వహించాలి ఇల్లంతకుంట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఏటా సెప్టెంబర్ 17న ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో మంగళవారం బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలంగాణ సాయుధ రైతా ంగమే అన్నారు. ఈనెల 12నుంచి 17వరకు తె లంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే వారోత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు మంద అనిల్, సావనపల్లి మల్లేశం, భూంపల్లి భూంరెడ్డి, మీసం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా భాస్కర్
సిరిసిల్ల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడిగా చింతోజు భాస్కర్‌ను నియమించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ చైర్మన్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఎస్పీ సభ్యులుగా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సెక్రటరీ కన్వీనర్‌గా ఉన్నారు. మరో పదకొండు మంది సభ్యుల్లో సిరిసిల్లకు చెందిన మానేరు స్వచ్చంధ సంస్థ చైర్మన్ చింతోజు భాస్కర్‌ను నియమించారు. లోక్‌అదాలత్ సభ్యులు, పీసీపీఎన్డీటీ సభ్యుడిగా పనిచేస్తున్న భాస్కర్‌ను ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడిగా నియమించడం విశేషం. గల్ఫ్ ఏజెంట్‌పై ఎస్పీకి ఫిర్యాదుజగిత్యాల క్రైం: గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పట్టణంలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి ఐదుగురి నుంచి రూ.2.37లక్షలు తీసుకుని మస్కట్ పంపించాడని, అక్కడ పనిలేక వాపస్ వచ్చామని, తమకు నష్టం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై విచారణజగిత్యాల: కథలాపూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. ఓ ఉపాధ్యాయురాలిని వేధించి సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ 2013 ప్రకారం మంగళవారం విచారించారు. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు, ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అతడిని కమిటీ విచారణ చేపట్టింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు పంపించామని కమిటీ సభ్యులు తెలిపారు. సిరిసిల్లలో ఇరు వర్గాల ఘర్షణ సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం కొందరు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇరువర్గాల్లోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే జరిగిన ఓ సామాజిక వర్గం ఎన్నికల విభాదాలే ఘర్షణకు కారణమతి ఆరోపణలున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐటీ కొలువు వదిలి.. మట్టినే నమ్ముకుని
వేములవాడ: ప్రకృతి సేద్యకుడు, వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సామ ఎల్లారెడ్డి (43) గుండెపోటుతో మృతిచెందారు. పదేళ్ల పాటు విదేశాల్లో ఉన్న ఆయన ఐటీ రంగంలో పనిచేస్తూ.. రూ.కోట్లు వచ్చే జీతాన్ని వదిలి స్వదేశం చేరారు. కన్నతల్లి లాంటి నేలతల్లి సేవకే అంకితమయ్యారు. సిద్దిపేట వద్ద ఆరెకరాల భూమిని ఎంచుకుని పూర్తిస్థాయి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రారంభించారు. పాలిహౌస్‌లలో జెర్బెరా పూల సాగుతోపాటు ఆర్గానిక్ పంటల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయన సాగు పద్ధతులు, పట్టుదల ఎందరో రైతులకు దిశానిర్దేశం చేశాయి. వినాయక చవితి వేళ విషాదం అందరికీ ఆరోగ్యం, ఉపాధి పంచుతూ.. పచ్చటి సాగు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఎల్లారెడ్డి వినాయక చవితి రోజున అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన అకాల మరణంతో వేములవాడ, సిద్దిపేట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి. విదేశీ ఉద్యోగం వదిలి మట్టిలోకి దిగి ఆయన సాధించిన విజయాలు, ప్రకృతి వ్యవసాయ విధానాలు అప్పట్లో మహర్షి సినిమా ద్వారా రైతు ప్రాముఖ్యతను చాటిన సూపర్ స్టార్ మహేష్‌బాబు దృష్టిని ఆకర్షించాయి. నిజమైన ‘రియల్ మహర్షి’ అని మహేష్‌బాబు ఆయనను అభినందించారు. ప్రకృతి సేద్యంలో ఆయన సాధించిన ప్రగతికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘ఆదర్శ ప్రకృతి సేద్యం రైతు’ అవార్డు అందుకున్నారు. ఇటీవల హన్మాజీపేట స్కూల్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన రెండు రోజులపాటు హాజరైన దాదాపు రెండు వేల మంది పూర్వ విద్యార్థులకు స్వయంగా రాగి జావా పంపిణీ చేశారు. వేములవాడరూరల్: సిద్దిపేటలో మృతి చెందిన వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సామ ఎల్లారెడ్డికి లింగంపల్లి గ్రామస్తులు కన్నీటితో వీడ్కోలు పలికారు. గ్రామస్తులతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రకృతి శాస్త్రవేత్త సామ ఎల్లారెడ్డి పండుగ పూట అనంతలోకాలకు.. -
వీసా పేరుతో మోసం.. నకిలీ ఏజెంట్ అరెస్ట్
కోనరావుపేట (వేములవాడ): ఇజ్రాయిల్‌కు పంపిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకొని మోసానికి పాల్పడిన నకిలీ ఏజెంట్‌ను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన దర్ర మల్లయ్యను కామారెడ్డికి చెందిన బోనగిరి రాజు ఇజ్రాయిల్‌కు పంపిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం ఇజ్రాయిల్‌కు పంపకుండా మోసం చేయడంతో మల్లయ్య కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాజును పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక మొబైల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విదేశాలకు, గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామ్మోహన్ సూచించారు. సరైన ధ్రువపత్రాలు, అనుమతులు లేని ఏజెంట్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దన్నారు. వీసాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం మర్రిపల్లికి చెందిన గొర్రె అవినాశ్(22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అవినాశ్ బైండ్ల పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ డబ్బులు వృథాగా ఖర్చు చేస్తుండేవాడని అన్నారు. తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పినప్పటికీ వినకుండా సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎకై ్సజ్ అధికారుల దాడులుఎల్లారెడ్డిపేట: మండలంలోని అల్మాస్ పూర్ తండా, గుంటపల్లి చెరువు తండా, కిష్ట నాయక్ తండా, అక్కపల్లి తండాలపై ఎకై ్సజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎకై ్సజ్ సీఐ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో అల్మాస్పూర్ తండాలో మద్యం విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు లీటర్ల అక్రమ మద్యం, 100 లీటర్ల బెల్లం పానకాన్ని నాటు సారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. -
తిలా పాపం.. తలా పిడికెడు!
సిరిసిల్ల: అందరి పల్లెంలో మెతుకునై.. మనిషికి జీవనాధారమైన నేను ఇప్పుడు ఎవ్వరికీ కానిదాన్ని అయినాను. అన్నం పెట్టే అన్నదాతలకు, ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణనైన నేను.. ఏళ్లుగా సగర్వంగా జీవించాను. నా చెంతకు చేరిన వారికి ఉపాధినిస్తూ రేయింబవళ్లు శ్రమించాను. పంట పండించిన రైతులకు పైసలిస్తూ.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా.. గాసం ఇస్తూ.. నా నిర్వహణ చూసేవారికి సమాజంలో గౌరవాన్ని తెచ్చి పెడుతూ.. ఎంతో నమ్మకంగా మెలిగాను. కానీ.. ఇప్పుడు నా రెక్కలు విరిగాయి. బొక్కలు మూలకుపడ్డాయి. పాలకుల విధానపరమైన లోపాలు.. నన్ను ఏలినోళ్ల పాపాలు.. మార్కెట్లో నెలకొన్న పోటీతో పైసకు కొరగాకుండా అయ్యాను. ఒకప్పుడు గొప్పగా జీవించిన నేను.. అప్పుల్లో కూరుకుపోయి.. తిప్పలు పడుతున్న. ఇంతకీ నేను ఎవరో మీకు చెప్పనే లేదు కదూ.. నేను మీ ఊరి రైస్‌మిల్లును. నా మనసులోని మాటలను పంచుదామని వచ్చాను. ఈ పాపం ఎవ్వరిది? గతమెంతో ఘనమైన చరిత్ర ఉన్న నేను.. ఇప్పుడు ఎవ్వరికీ కొరగానిదాణ్ణి అయినాను. అమ్మో.. రైస్మిల్లా అనే దుస్థితికి చేరారు. నేనేం తప్పు చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా పల్లెల్లో గిర్నీగా మొదలైన నా ప్రస్థానం భారీ రైస్‌మిల్లుల వరకు చేరింది. ప్రభుత్వ విధానాల నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తూ.. రైస్‌మిల్లులకు ఇస్తూ బియ్యాన్ని తీసుకునే వ్యవస్థ రావడంతో అసలు సమస్య మొదలైంది. క్వింటాలు వడ్లను మిల్లుకు ఇచ్చి 67 కిలోల బియ్యాన్ని ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 55 కిలోల బియ్యం కూడా రావడం లేదని యజమానులు చెబుతున్నారు. కానీ... సర్కారు మిల్లర్ల మొరవినడం లేదు. 2014 నుంచి మిల్లులకు చెల్లించాల్సిన మిల్లింగ్, రవాణా, డ్రైయేట్, కస్టోడియన్ చార్జీలు ఇవ్వడం లేదు. క్వింటాలు వడ్లను బియ్యంగా మార్చి ఇస్తే రూ.10 ఇస్తున్నారు. ఇది ఏనాడో 40 ఏళ్ల కిందట నిర్ణయించిన ధర. వాస్తవానికి క్వింటాలు వడ్లు పడితే మార్కెట్లో రూ.150 ఖర్చు అవుతుంది. మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా పాత ధరలనే అమలు చేస్తున్నారు. ఎవరైనా బియ్యం సకాలంలో పెట్టకుంటే.. పెండింగ్‌లో ఉన్న బియ్యానికి 25 శాతం జరిమానా.. 12 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టారు. నేను వ్యవసాయ అనుబంధంగానే నడుస్తాను. నా నిర్వహణలో విద్యుత్ వినియోగం తప్పనిసరి. 100 హెచ్‌పీల వరకు ఎల్టీ విద్యుత్‌గా పరిగణిస్తున్నారు. పెరిగిన యాంత్రీకరణతో 250 హెచ్‌పీల వరకు ఎల్టీగానే చూడాలని, హెచ్టీగా విద్యుత్ బిల్లులు వేయొద్దని మా వాళ్లు కోరుతున్నారు. మిల్లు గొల్లుమంటుంది మనసు ఊరుకో‘లేఖ’ ఇది రైస్‌మిల్లు ఆవేదన ఇగ మావోళ్ల మాయాజాలం అంతా ఇంతా కాదు. కొందరు సవ్యంగానే నా నిర్వహణ చూస్తుండగా.. మరి కొందరైతే.. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ.. అవే బియ్యాన్ని మళ్లీ సర్కారుకు సరఫరా చేస్తూ.. కేసుల పాలవుతున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నంచేస్తూ.. సామాన్యులను నిండా ముంచుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్కారు వడ్లను కొని ఇస్తే.. ఆ వడ్లను అటుకుల మిల్లులకు, ప్యాలాల మిల్లులకు అమ్ముతూ.. పొరుగు దేశాలను ఎగుమతి చేస్తూ.. వచ్చిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టినోళ్లు ఉన్నారు. మావోళ్ల కథలు.. ఒక్కొక్కటి బయటికి రావడంతో సర్కారోళ్లు ఇన్నేళ్లుగా మెక్కిన సొమ్మును కక్కుమని కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నారు. మధ్యే మార్గాన్ని ఆలోచించి.. భవిష్యత్‌లో తప్పులు జరగకుండా.. సవరిస్తూ.. సర్కారుకు రావాల్సిన రూ.కోట్లను వసూలు చేయాల్సిందే. ఉన్న పళంగా నా గొంతు పిసికేయొద్దు. సామరస్యంగా కూర్చుని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇరువర్గాలు ఆలోచించాలి. ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించి.. నా గుండెల్లోని బాధను ఆలకించిన మీకు పది వేల వందనాలు. ఇక ఉంటాను. ఇట్లూ... సదా మీ అందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని కోరే.. – మీ రైస్ మిల్లు -
బస్సుకు చుట్టుకున్న విద్యుత్‌వైర్లు
హన్మకొండ చౌరస్తా: మూల మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకోవడం.. డ్రైవర్ అలానే ముందుకు వెళ్లడంతో చెట్ల కొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న పలువురు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హనుమకొండ వస్తోంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్దకు చేరుకోగానే పక్కనే ఉన్న వృక్షం పక్కనుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకున్నాయి. గమనించని బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతో భారీ వృక్షం కొమ్మలు విరిగి రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలపై పడ్డాయి. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేదా గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడున్న పలువురు ఆరోపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సుపై పడిన కొమ్మలను తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. చెట్టుకొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసం -
కడుపునొప్పితో భార్యాభర్తల మృతి!
● ఫుడ్ పాయిజన్‌గా అనుమానం ● మృతురాలు మూడు నెలల గర్భిణి రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో నివాసం ఉండే దంపతులు అజయ్ కుమార్ కారే(28) – దినేశ్వరి కారే(25) కడుపునొప్పితో తీవ్రఅస్వస్థతకు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా లాంజీ తాలూకా ధర్మార గ్రామానికి చెందిన అజయ్‌కుమార్ కారే– దినేశ్వరి కారే భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం సెంటినరీకాలనీకి వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో మేసీ్త్ర పనులు చేసుకుంటున్నారు. ఈనెల 13న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భార్యాభర్తలు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 00.30గంటలకు దినేశ్వరికి కడుపునొప్పి రావడంతో భర్తతోపాటు బంధువులకు విషయం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నొప్పి తగ్గుతుందని భావించి నిద్రపోయింది. ఉదయం దినేశ్వరి, అజయ్‌కుమార్‌కు కూడా కడుపునొప్పి రావడంతో ఇద్దరినీ వారి యజమాని రోశయ్య కారులో కమాన్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 14న ఉదయం సుమారు 10.20 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అజయ్‌కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు.. చికిత్స పొందుతున్న దినేశ్వరి కూడా మృతి చెందింది. దీంతో వారికుటుంబ సభ్యులు, స్నేహి తులు విషాదంలో మునిగిపోయారు. అయితే, పోరెన్సిక్ నివేదిక తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని మంథని సీఐ స్వామి తెలిపారు. కాగా, దినేశ్వరి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. -
పర్వతం పరీక్ష.. విజయంతో సమాధానం
● ఖర్దుంగ్లా ఛాలెంజ్‌లో 72 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన ఏఆర్ కానిస్టేబుల్ ● అనిల్‌కు రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్బిగీతే అభినందనసిరిసిల్ల: ‘ఖర్దుంగ్ లా పర్వత మార్గం నా శారీరక, మానసిక సామర్థ్యాలకు కఠినమైన పరీక్షగా నిలిచింది. ప్రతీ అడుగు నా పరిమితులను పరీక్షించినప్పటికీ నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఓడించలేకపోయింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగి 72 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశా..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అన్నారు. లడక్‌లో 17,618 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఖర్దుంగ్ లా చాలెంజ్‌లో 72 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్ పరుగును అనిల్ 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో.. మరుసటి రోజు లాడక్ మర్థన్ 42.2 కిలోమీటర్ల రన్‌ను ఎముకలు కొరికే చలిలో పూర్తి చేశారు. అనిల్‌ను ఎస్పీ మహేశ్ బి గితే మంగళవారం సిరిసిల్లలో అభినందించారు. సముద్ర మట్టానికి 17,618 అడుగుల ఎత్తులో అత్యంత కఠినమైన కొండ ప్రాంతాలు, తీవ్రమైన చలి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని పూర్తి చేయడంపై పలువురు అభినందించారు. ప్రజాసేవలో నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఇటువంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పాల్గొంటూ విజయాలు సాధించడం ద్వారా పోలీస్ ఫోర్స్‌లోని యువ సిబ్బందికి అనిల్ ఆదర్శంగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి పోటీల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
నాలుగేళ్లు సహజీవనం.. పెళ్లికి నిరాకరణ
మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్లల అని తెలిసి అబా ర్షన్ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి న సంఘటన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహామైంది. వీరికి ఇద్దరు కూ తుళ్లు ఉన్నారు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరు మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్‌తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్‌పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్త కు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు. కలిసి జీవనం సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్‌పాష నమ్మించి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకా లం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకో వాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్‌ఖాన్‌పై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకు ని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థాని కులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్‌పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించిన ప్రియుడు వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం -
ఇంటింటా అందిస్తూ..
సిరిసిల్లటౌన్/పెద్దపల్లి/మెట్పల్లి/ధర్మపురి: సిరిసిల్ల బల్దియా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సైతం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలోని చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. 24వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. పదిహేనేళ్లుగా వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. ● పెద్దపల్లికి చెందిన దేవసాని పద్మ కుటుంబం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ● మెట్పల్లి లయన్స్‌క్లబ్ సభ్యులు మట్టి గణపతులను పూజించాలని ప్రచారం చేస్తున్నారు. 2009లో మెట్పల్లిలో లయన్స్‌క్లబ్ ఏర్పాటు చేశారు. ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు తెలిపారు. ● ధర్మపురికి చెందిన గాజు భాస్కర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో 500 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వద్దని.. మట్టి విగ్రహాలను పూజిద్దామని ప్రచారం చేస్తున్నారు. -
గణేశ్ మండపాలు
నిఘా నీడలో ● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా ఉంచాలని, రేయింబవళ్లు మండపాల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. నవరాత్రి వేడుకలు, సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ స్టేషన్ల వారీగా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతించబోమని తెలిపారు. ఆదివారం పలు వివరాలు వెల్లడించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్ బీ గీతే -
గణపతి బొప్పా మోరియా
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ భక్తుల నినాదాలు మార్మోగాయి. వినాయక చవితి పండుగకు ఒక్క రోజు ముందు ఆదివారం సిరిసిల్లలో గణపతుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి వినాయక మండపాల నిర్వాహకులు భారీ విగ్రహాలను తీసుకెళ్లారు. డీజే సౌండ్ మ్యూజిక్ మధ్య గణనాథులు మండపాలకు తరలిపోయారు. వినాయకుడి పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లో సందడి నెలకొంది. పత్రి, ఎలక్కాయ, పత్రికాయ, మామిడాకులు, అరటాకులు, పండ్లు, వివిధ రకాల పూలు, ఆకులు, ఓనగాయ, మక్కకంకులు కొనుక్కొని వెళ్లారు. గణనాథుడికి ఘన స్వాగతం పలుకుతూ.. గణేశ్ మండపాల నిర్వాహకులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వినాయకుడి విగ్రహానికి గుడ్డను కట్టి.. భజన చేస్తూ.. మండపాలకు గతంలో తరలించేవారు. కానీ ఆగమనం పేరిట అదిరిపోయేలా.. ఆటాపాటలతో.. డీజే సౌండ్ సిస్టమ్స్‌తో ఘనంగా స్వాగతం చెబుతున్నారు. వారం రోజులుగా వినాయకుడి విగ్రహాలను మండపాలకు అంగరంగ వైభవంగా చేర్చుతున్నారు. ఆగమన వేడుకలను అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో విశ్వదేవ్ మండప్ ఆధ్వర్యంలో ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కళ్లు మిరిమిట్లు గొలిపే భారీ సెట్టింగులు.. వారణాసి గంగాహారతి బృందంతో ఏర్పాట్లు చేశారు. ఈ స్ఫూర్తితో జిల్లాలోని 260 గ్రామాల్లో 1,130 మండపాల నిర్వాహకులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. -
ప్రజా రవాణా మరింత చేరువ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘టీజీఎస్ ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ పనిచేస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ఇప్పుటి వరకు 6.91కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి ద్వారా ప్రయాణించారు. రూ.308.84 కోట్ల వరకు లబ్ధి పొందారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పాలసీ పరిధిలోనిది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 997బస్సులు రోజుకు 3లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తద్వారా రూ.2.5కోట్ల ఆదాయం సమకూరుతోంది’ అని ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు వివరించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. -
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ రెండేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. గోపి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆపరేషన్ పోలో తర్వాత 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తు చేశారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, దుమాల శ్రీకాంత్, అంకిరెడ్డి, రాజాసింగ్, మ్యాన రాంప్రసాద్, కొండ నరేశ్, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘ముసురు’కున్న వాన సిరిసిల్ల: జిల్లా అంతటా ఆదివారం ముసురు వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లిమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 5.8, చందుర్తిలో 10.9, వేములవాడ రూరల్‌లో 12.6, బోయినపల్లిలో 18.3, వేములవాడలో 13.6, సిరిసిల్లలో 7.9, కోనరావుపేటలో 10.2, వీర్నపల్లిలో 10.5, ఎల్లారెడ్డిపేటలో 13.1, గంభీరావుపేటలో 2.9, ముస్తాబాద్‌లో 10.2, తంగళ్లపల్లిలో 16.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా సగటున 12.7 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. పోపా ప్రతిభా పురస్కారాలు ప్రదానం సిరిసిల్ల అర్బన్ : చదువులో ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు పోపా బాధ్యులు మామిడాల భూపతి తెలిపారు. సిరిసిల్లలోని పద్మశాలి కల్యాణ భవన్లో ఆదివారం పోపా ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్, పాలీసెట్, ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పారితోషికంతోపాటు, మెమొంటో, సర్టిఫికెట్లను ఎంఈవో రఘుపతి చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. గాజుల ప్రతాప్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, సిరిపురం కృష్ణ, శ్రీనివాస్, గూడూరు ప్రవీణ్, గూడూరు రవీందర్, గడ్డం భగవత్, పోపా సభ్యులు ఆడెపు వేణు, చీరాల ప్రభాకర్, సత్యనారాయణ, అంకార జ్ఞానోబ పాల్గొన్నారు. జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికగంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మండలంలోని సైమా అకాడమీకి చెందిన ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. 8–10 ఏళ్ల వయస్సు విభాగంలో వైష్ణవి రజతం సాధించింది. వచ్చే నెలలో జైపూర్‌లో జరిగే జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. వైష్ణవిని డీవైఎస్వో అజ్మీరా రాందాస్, యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ నవీన్‌కుమార్, యోగా కోచ్ దేవయ్య, ఉషు సెక్రటరీ విక్రం, పీఈటీ భాను, గంభీరావుపేట మార్నింగ్ వాకర్స్ సభ్యులు అభినందించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా లహరివేములవాడ: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా తోట లహరి నియమితులయ్యారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్‌ను ఆదివారం కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలి’
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు సూచించా రు. 39 వార్డుల కాంగ్రెస్ అధ్యక్షులు, క మిటీలతో ఆదివారం నిర్వహించిన స మావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, వెంగల లక్ష్మీనర్సయ్య, వెంగల అశోక్, కంసాల మల్లేశం పాల్గొన్నారు. లోక్ అదాలత్ సక్సెస్ : ఎస్పీసిరిసిల్ల: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సక్సెస్ అయిందని, దీని ద్వారా అనేక కేసులు పరిష్కారమయ్యాయని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం తెలిపారు. సైబర్‌క్రైమ్ బాధితులకు రూ.2,79,030లకు పైగా రీఫండ్ అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విచారణలో ఉన్న 228 కేసులు, 56 పెట్టి, 823 డ్రంకెన్‌డ్రైవ్, 11,456 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్‌క్రైమ్ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రావణ్‌యాదవ్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
చేపా..చేపా.. ఎక్కడున్నావ్?
● టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు ● సీడ్‌ఫామ్స్ తనిఖీ చేస్తున్న అధికారులు ● నెలాఖరులోగా చేపపిల్లల పంపిణీ ! ● జిల్లాలో 1.46 కోట్ల పిల్లలు లక్ష్యంబోయినపల్లి(చొప్పదండి): మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టే చేపపిల్లల పంపిణీకి ఈ యేడాది జాప్యమవుతుంది. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో మొదలుకాలేదు. పలువురు కాంట్రాక్టర్లు చేపపిల్లల సరఫరాకు టెండర్లు దాఖలు చేయడంతో ఆలస్యంగా నైనా పంపిణీ చేయవచ్చని మత్స్యకారులు ఆశాభావంలో ఉన్నారు. 1.46 కోట్ల చేపపిల్లలు లక్ష్యం జిల్లాలో 1.46కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయడం లక్ష్యం పెట్టుకున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు, గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, ఇల్లంతకుంట మండలం అనంతగిరి, కోనరావుపేట మండలం మల్కపేట ప్రాజెక్టుల్లో ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదులుతారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుందనే కారణంతో ప్రతీసారి చేపపిల్లలు పంపిణీ చేసే ఏజెన్సీలు ముందుకురావడం లేదు. ఈసారి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. సిరిసిల్ల, వేములవాడ మండలంలోని పలు గ్రామాలతోపాటు బోయినపల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి గ్రామాల్లో ఏటా ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో చేప, రొయ్యపిల్లలు వదులుతున్నారు. సీడ్ ఫామ్స్ తనిఖీల్లో అధికారులు ఈ సీజన్లో చేప పిల్లలు సరఫరా చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి సీడ్‌ఫామ్స్ తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పెద్దపల్లి, కామారెడ్డి, ఖమ్మం జిల్లా నాచుపల్లి, తూర్పుగోదావవరి జిల్లాల్లోని సీడ్ పాయింట్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లోని విషయాలతో నివేదికను మత్స్యశాఖ కమిషనర్‌కు సమర్పిస్తారు. క్వాలిఫై అయిన టెండర్ల నుంచి ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. ఎవరైతే తక్కువ మొత్తం కోట్‌చేసిన కాంట్రాక్టర్ ఉంటారో అతనికి టెండర్ ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.జిల్లాలో చేపపిల్లలు పంపిణీ చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల సీడ్ఫామ్స్ల్లో కలెక్టర్ నియమించిన కమిటీ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ నెలాఖరు వరకు చేప పిల్లల పంపిణీ చేస్తాం. – సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిరిసిల్లమత్స్యశాఖ స్వరూపంమత్స్య పారిశ్రామిక సంఘాలు 117 మహిళా సంఘాలు 47 మత్స్యకారులు 10,156 చేపపిల్లల పంపిణీ లక్ష్యం ఇలా మిడ్‌మానేరు 28.50 లక్షలు అప్పర్ మానేరు 10.50 లక్షలు అనంతగిరి రిజర్వాయర్ 13.69 లక్షలు మల్కపేట రిజర్వాయర్ 7.49 లక్షలు 456 చెరువుల్లో.. 87.82 లక్షలు -
ఈ నెలాఖరున సీఎం బహిరంగ సభ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆదేశాలతో అసెంబ్లీ గేటు ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారన్నారు. దళిత స్పీకర్‌ను బూతులతో తిట్టి అవమానపరిచారని, పసుపు నీళ్లు పోసి నేలను శుద్ది చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. పర్శ హన్మండ్లు, మండల మాజీ అధ్యక్షుడు హమీద్, నాయకులు రాజనర్సింహారెడ్డి, బలరాంరెడ్డి, ఎలుక రాజు, గంగి స్వామి, అజాం, బాల్‌రెడ్డి, భాస్కర్‌నాయక్, విఠల్‌నాయక్, సంతోష్, శ్రీనివాస్, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): చందుర్తి తహసీల్దార్ ఆఫీస్ అధికారులపై సోషల్‌మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. మండలంలోని బండపల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం రణధీర్‌రెడ్డి రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన నిధులు 2025 జనవరి 1 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ఎంత ఖర్చు చేశారు? ఏయే అవసరాలకు వెచ్చించారన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఎంత మందికి ఇచ్చారు? ఎంత మందికి రిజెక్టు చేశారు? అనే వివరాలు కావాలని ఆగస్టు 12న అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్ సరిఫ్టికెట్లు 45 మందికి, ఈడబ్ల్యూఎస్ 49 మందికి ఇవ్వగా.. 10 మందికి రిజెక్టు చేశామని సమాధానం ఇచ్చారు. అనుమానాలుంటే కార్యాలయంలో రికార్డులు చూసుకోవాలని ఈనెల 9న అధికారులు సమాధానం ఇచ్చారు. అంకెలు తప్ప సమగ్ర సమాచారం ఇవ్వలేదంటూ అధికారుల పనితీరును సోషల్‌మీడియాలో విమర్శించడం చర్చనీయంగా మారింది. -
మధుయాష్కిగౌడ్‌ను కలిసిన రవితేజగౌడ్
సిరిసిల్ల అర్బన్: ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) చైర్‌పర్సన్‌గా నియమితులైన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్‌ను టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు బుర్ర రవితేజగౌడ్ ఆదివారం కలిశారు. ఉస్మానియా విద్యార్థి నాయకులు వెంకట్, మహేశ్, పవన్ ఉన్నారు. విద్యుత్‌షాక్‌తో పాడిగేదె మృతిఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో విద్యుత్ షాక్‌తో ఆదివారం పాడిగేదె మృతిచెందింది. గ్రామానికి చెందిన కోదని బాలయ్య తన పాడి గేదెను మేత కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి చనిపోయినట్లు ఎన్పీడీసీఎల్ ఏఈ నగేశ్‌కుమార్ తెలిపారు. ఎక్స్‌గ్రేషియా కోసం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. -
మట్టి కొరత.. ఇత్తడి విగ్రహం
కోరుట్లటౌన్: కోరుట్లలోని గాంధీరోడ్డులో గల పద్మశాలీ సంఘం భవనంలో 52 ఏళ్లుగా ఇత్తడి గణపతి ప్రతిష్టాపన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇత్తడి గణపతిని దర్శించుకునేందుకు కోరుట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమారు 52ఏళ్ల క్రితం మట్టి దొరకని కరువు పరిస్థితుల్లో విగ్రహం తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మద్రాసు నుంచి ఇద్దరు శిల్పులను కోరుట్లకు రప్పించి పంచలోహాలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఇత్తడి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలాలను విగ్రహంపై చల్లి తిరిగి పద్మశాలీ సంఘం భవనానికి తీసుకువచ్చి భద్రపరుస్తారు. -
నోటీసులు వచ్చిన ఓటర్లు గుర్తింపుకార్డులు ఇవ్వాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎస్ఐర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అందజేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లోని 185 నుంచి 191 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, తహసీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
రాజీతో శాశ్వత పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సిరిసిల్ల: కక్షిదారులు వివాదాలను పెద్దవి చేసుకోకుండా రాజీతో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. ప్రీ–లిటిగేషన్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,666 కేసులు పరిష్కరించి, రూ.2,02,74,283 నష్టపరిహారం ఇప్పించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
మంథనిలో శతాబ్దపు ఉత్సవాలు
మంథని: మంత్రపురిలో 110 ఏళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లేవారు. అక్కడి సాంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. నాగ్‌పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి..బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో సిద్ధి, బుద్ధి గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్‌రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య ఆధ్వర్యంలో ఆనాడు ఉత్సవాలు జరిగేవి. నడివీధిలో 1918 నుంచి నిర్వహిస్తున్నారు. మందాట వీదిలో గత 65 ఏళ్లుగా అఖండ గండదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
ఎనౖభై ఏళ్ల వేడుక
సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్‌లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజా రాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతిని నెలకొల్పారు. ప్రస్తుతం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారి ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతి ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు ఇదే విధంగా నిర్వహిస్తాం. – డి.శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు -
దుబాయ్‌లో ఉన్నా.. లోక్ అదాలత్‌లో న్యాయం
● వీడియో కాల్లో మాట్లాడిన జడ్జి ● పరస్పర అంగీకారంతో కేసు క్లోజ్ వేములవాడ: దూరభారాలు సత్వర న్యాయానికి అడ్డంకి కాదని వేములవాడ లోక్‌అదాలత్ నిరూపించింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వ్యక్తి ఇక్కడి కోర్టులో కొనసాగుతున్న కేసును వర్చువల్‌గా హాజరై క్లోజ్ చేయించుకున్నారు. రుద్రంగి మండలం డెగావత్తండాకు చెందిన కున్సత్ సుమన్ రెండేళ్ల క్రితం కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదం కేసు వరకు వెళ్లింది. రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సుమన్ ఇటీవల దుబాయ్ వెళ్లాడు. రుద్రంగి ఎస్సై మోతీరాం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా చూశారు. వీడియోకాల్ ద్వారా విచారణ కేసు విచారణలో భాగంగా వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ దుబాయ్‌లో ఉన్న సుమన్‌తో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఇరువర్గాలు రాజీకి రావడం, సుమన్ వర్చువల్‌గా సమ్మతి తెలపడంతో రెండేళ్లుగా నడుస్తున్న ఈ కేసును జడ్జి క్లోజ్ చేశారు. 429 కేసులు పరిష్కారం వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 429 కేసులకు పరిష్కారం లభించినట్లు సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ తెలిపారు. బాధితులకు రూ.30,500 పరిహారం జమయినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు, పీపీ విక్రాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, ఏపీపీలు బొడ్డు ప్రశాంత్, రజనీకాంత్, లోక్ అదాలత్ మెంబర్లు నేరెళ్ల తిరుమల్‌గౌడ్, అనిల్‌కుమార్, సీఐలు శ్రీనివాస్, కె.రవీందర్, ఎస్సైలు మోతీరాం, ప్రశాంత్ పాల్గొన్నారు. -
అమ్మ..నాన్న.. ఇంటి భోజనం
వేములవాడ: పట్టణ బైపాస్ రోడ్డులోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ వద్ద శనివారం భావోద్వేగ వాతావరణం కనిపించింది. పిల్లల కోసం తల్లిదండ్రులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు, క్యారేజీలు పట్టుకొచ్చారు. పాఠశాల కాంపౌండ్ బయట చెట్ల నీడన కూర్చొని తినిపిస్తూ కబుర్లు చెప్పారు. ఈనెల రోజుల్లో స్కూల్లో జరిగిన విశేషాలు అమ్మనాన్నలకు చెబుతూ ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినగా.. పిల్లలతో గడిపిన క్షణాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు భారంగా వెనుదిరగడం కనిపించింది. -
ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం
సిరిసిల్ల: ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగ వేటలో విజయం మీదేనని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి, ఆయా సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ఏమైనా సందేహాలు వస్తుంటే వెంటనే నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలన్నారు. చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా, వాటిని పాఠాలుగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకుసాగాలన్నారు. సబ్జెక్టుల వారీగా అవగాహన పోటీపరీక్షలకు అవసరమైన సబ్జెక్టుల వారీగా పరీక్షల విధానం, సమయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక, పరీక్షల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఫిజికల్ టెస్ట్, గ్రౌండ్ ఈవెంట్స్‌కు సంబంధించిన అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించారు. సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్, రవీందర్, స్కిల్గురు డాక్టర్ విజయరఘు రామరాజు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మహేశ్‌కుమార్, నవీన్, సుందర్, అమరేశ్ పాల్గొన్నారు. కుడికాలువ ద్వారా నీరు విడుదల చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఎస్సై ఉపేంద్రచారి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాలకు చేరుకొని.. మిడ్‌మానేర్ డీఈ రఘుతో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. పట్నం శ్రీనివాస్, రోడ్ల కరుణాకర్‌రెడ్డి, రాగటి రమేశ్, ఉపసర్పంచ్ నరేశ్, పినకాశి అనిల్, కాట్నపల్లి రవీందర్‌రెడ్డి, పండుగ స్వామి, పరుశురాం పాల్గొన్నారు. ఐఎంఏ జిల్లా కార్యవర్గంసిరిసిల్లటౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ చీకోటి సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్ల సరయు ఆసుపత్రి పిల్లల వైద్యనిపుణుడు తడుక సాయికుమార్, కోశాధికారిగా శ్రీమహాలక్ష్మి ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఎ.జైల్‌సింగ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.యాదగిరి, డాక్టర్ జి.అభినయ్, సహ కార్యదర్శులుగా డాక్టర్ వెంకట్, డాక్టర్ మోహనకృష్ణ, డాక్టర్ చందన ఎన్నికయ్యారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ శోభారాణి స మక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించగా, ఎన్నికల అధికారిగా డాక్టర్ మనోహర్ వ్యవహరించారు. సంతోష్కుమార్సాయికుమార్ -
ఊరంతా ఒకే దేవుడు
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. అందరు కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడతారు. అందరికి ఏదోఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఊరు మొత్తంలో ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్టించాలని ఆలోచన చేశారు. తాటా కులతో మండపం వేశారు. అదే ఆనవాయితీతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
63 ఫీట్ల ఎకో గణేశుడు
హైదరాబాద్ తర్వాత పెద్దపల్లికి గుర్తింపు వచ్చేలా భారీ మట్టిగణపతిని ఏర్పాటు చేస్తున్నాం. నవరాత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రవచనాలు, లక్షపుష్పార్చన, మహాహారతి, సహస్రదీపాలంకరణ ఇలా రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. – శివంగారి సతీశ్, ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈసారి 63అడుగుల పంచముఖ గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీశ్ ఆధ్వర్యంలో ఏటా భారీ ఎకో గణేశుడు పూజలందుకుంటున్నాడు. 31ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఎనిమిదేళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. 36 ఫీట్ల ఎత్తుతో మొదలై ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ తర్వాతిస్థానంలో పెద్దపల్లిలోనే భారీ గణేశుడు కొలువుదీరేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
నెల్లూరులో పుట్టి.. సిరిసిల్లలో గెలిచి
● 1989లో జనశక్తి మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్వీ కృష్ణయ్య విజయం ● నేడు 20వ వర్ధంతి సభ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి వామపక్ష విప్లవోద్యమాల వరకు సిరిసిల్ల చైతన్యవంతమైన భూమిక పోషించింది. ఎన్నికల బరిలో నక్సలైట్లు అభ్యర్థిని నిలిపి విజయం సాధించిన అరుదైన ఘటన ఈ నేల సొంతం. 1989 శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య జనశక్తి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఆనాటి పరిస్థితులపై ‘సాక్షి’ కథనం. – సిరిసిల్ల జనశక్తి ఉద్యమ చరిత్రలో మైలురాయి మూడున్నర దశాబ్దాలపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చిత్రపటంలో జనశక్తి బలమైన ముద్రవేసింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్యను జనశక్తి చట్టసభలకు పంపింది. కృష్ణయ్య గెలుపులో అప్పటి జనశక్తి జిల్లా కార్యదర్శి బోడ లక్ష్మారెడ్డి అలియాస్ భూపతిరెడ్డి అలియాస్ సత్యం కీలక భూమిక పోషించారు. 1973లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటాలతో మొదలైన రైతుకూలీ సంఘం ఉద్యమం క్రమంగా సీపీఐ (ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గ సాయుధ పోరా టంగా మారింది. తొమ్మిది విప్లవ గ్రూపుల కలయికతో సీపీఐ(ఎం.ఎల్) జనశక్తి సాయుధ నక్సలైట్ల ఉద్యమంగా రూపాంతరం చెందింది. ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదంతో విస్తరించింది. ఎన్నికలు ఓ ఎత్తుగడ సాయుధ దళాలతో పోరా టాలు చేస్తూనే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బ్యాలెట్పోరును సాగిస్తున్నామని జనశక్తి నాయకులు చెప్పేవారు. 1983లో వై.కాశీపతి సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. 1994 ఎన్నికల్లో అజ్ఞాతంలో ఉన్న జె.చలపతిరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. అంతకుముందు రచయిత పెద్ద విమలక్క, మారోజు వీరన్న, గుంటి వేణు, బడే స్వామిదాస్, చెట్టి రాజేశ్వర్ ఎన్నికల బరిలో నిలిచారు. సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లి, నేరెళ్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. 1991 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్య కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పట్లో లక్షన్నరకు పైగా ఓట్లు సాధించి జిల్లాలో ద్వితీయస్థానం పొందారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిసిల్ల ప్రాంతంలోని పలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనశక్తి కైవసం చేసుకుంది. సర్పంచ్‌గా గెలవా లన్నా, ఎంపీటీసీగా పోటీచేయాలన్న జనశక్తి కనుసన్నల్లో స్థానిక ఎన్నికలు జరిగేవి. ఆటుపోట్ల మధ్య జనశక్తి పార్టీ అగ్రనేత కూర రాజన్న, ఆయన సోదరుడు కూర దేవేందర్ ఉరఫ్ అమర్, మరో నేత సాగర్ ఉరఫ్ ఎడ్ల లక్ష్మీరాజం అరెస్టయ్యారు. అంతకుముందు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రణధీర్ ఉరఫ్ సాయిలు 46 మందితో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఎదుట లొంగిపోయారు. నేడు సిరిసిల్లలో వర్ధంతి సభ ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సభను సిరిసిల్లలో ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి దశరథం ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఎన్కౌంటర్ ముచ్చట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య న్యాయ విచారణకు డిమాండ్ చేసేవారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలీసుల హింస, బూటకపు ఎన్కౌంటర్లపై గొంతు వినిపించేవారు. కృష్ణయ్యకు తోడుగా ఖమ్మం, నల్గొండ జిల్లాల వామపక్ష ఎమ్మెల్యేలు గళం కలిపేవారు. ఎన్వీ కృష్ణయ్య డిమాండ్ మేరకు అప్పటి ప్రభుత్వం ఎన్కౌంటర్లపై ఆర్డీవో స్థాయిలో మెజిస్ట్రేరియల్ విచారణలకు ఆదేశించడం విశేషం. -
ఇదేంది సర్ !
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్షర దోషాలు, వయసు తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్ల జాబితా నమోదు సమయంలో ఇంగ్లిష్‌లో నమోదు చేయడంతో తెలుగులో జాబితా రావడంతో అనేక అక్షర దోషాలు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పుడు చాలా మంది ఓటర్ల నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. మరోవైపు తల్లిదండ్రుల వయసుతో పిల్లల వయసును పోల్చినప్పుడు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల తేడా మాత్రమే ఉండడంతో ఆ ఓటర్లను బోగస్‌గా భావిస్తున్నారు. నిజానికి వయసు నమోదులోనూ తేడా ఉండడమే ఇందుకు కారణం. ఖచ్చితమైన వయసు నిర్ధారణ పత్రాలను పరిశీలించకుండానే బూత్ లెవల్ ఆఫీసర్లు, అప్పట్లో వీఆర్వోలు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ ఓటర్ల జాబితాను ఆన్లైన్ చేయడంలో తప్పులు దొర్లి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
మట్టి గణపతిని పూజిద్దాం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా పోలీ స్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మట్టి వినాయడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారైన విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వా తావరణంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఎస్బీ సీఐ రవికుమార్ పాల్గొన్నారు. కుడికాలువకు నీటిని విడుదల చేయాలి ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గాలిపల్లి, తాళ్లపల్లి రై తులు శుక్రవారం గాలిపల్లిలో ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ కుడికాలువపై ఆధారపడి వందలాది ఎకరాల్లో వరిపంట వేశామని, నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్రచారి, మిడ్‌మానేరు డీఈ సూర్యప్రకాశ్, ఏఈ వంశీ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించా రు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరి ష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతా మని హెచ్చరించారు. గాలిపల్లి సర్పంచ్ బద్దం శేఖర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, రాజమల్లు, నరేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి వేములవాడరూరల్: నాణ్యమైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫైడ్ సూ చించారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం సందర్శించా రు. మాత, శిశు ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల నివారణ చర్యలపై దృష్టి సారించారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీపీవో రాజేందర్, సూపర్వైజర్ రాజయ్య, గంగమరాజు ఉన్నారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని డీఏ వో అఫ్జల్‌బేగం అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి, ప్యాక్స్ నర్సింగాపూర్, బోయినపల్లి లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శుక్రవారం తనిఖీ చేశారు. విలాసాగర్లో డిజిటల్ క్రాప్ సర్వే నమోదు పరిశీలించారు. ఎంఏవో ప్రణీత, ఏఈవోలు రవళి, హరీష్ ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు వేములవాడ: మందు సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 182 మందుబాబులను శుక్రవారం వేములవాడ కోర్టులో హాజరుపరి చారు. వీరికి మేజిస్ట్రేట్ మేఘన జరిమానాలు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు చెప్పారు. 52 మందికి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున, 26 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 45 మందికి ఒక్కొక్కరికి రూ.3వేలు, 59 మందికి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు. అంతకుముందు మద్యం సేవించి పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఆర్ఎస్సై దిలీప్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
విద్యుత్ కోతలపై నిరసన
చందుర్తి(వేములవాడ): విద్యుత్ కోతలను నిరసిస్తూ చందుర్తిలో బీజేపీ నాయకులు శుక్రవారం చందర్తి బస్టాండ్ ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను రోడ్డుపై నుంచి లాగేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, నాయకులు షిర్డీ మల్లేశం, పేరుక గంగరాజు, రాజశేఖర్, గంగస్వామి, చింతకుంట శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, బద్దం తిరుమల్‌రెడ్డి, పర్శరాములు, జలగం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు దరిచేరడం లేదు. పరిసరాల పరిశుభ్రత లోపించడం సర్వ సాధారణంగా మారింది. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో గాలి, నీరు, భూమి, తినే ఆహారం కలుషితమై జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లాలో చెత్త సమస్య గ్రామాలను వెంటాడుతోంది. మండల కేంద్రాలు, పట్టణాల్లో కొంత నిర్వహణ ఉన్నప్పటికీ, వ్యర్థాలను ఏం చేయాలో తెలియక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలను నియంత్రించలేక సిబ్బంది, ఉద్యోగులు చేతులెత్తుస్తున్నారు. వ్యర్థాలతో జరిగే అనర్థాలు ఇవే.. చెత్త, ప్లాస్టిక్ వస్తువులతోపాటు ఇతర తడి, పొడి చెత్తను ఒకే చోట వేయడంతో కొంత భూమిలో కలిసిపోయిన కొంత అలాగే ఉంటుంది. దీంతో చాలా గ్రామాల్లో ప్లాస్టిక్ సంచులను కాల్చివేయడంతో గాలి కాలుష్యంగా మారుతుంది. అలాగే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చెరువులు, కుంటలలో నీరు రంగు మారుతోంది. రసాయన పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితమవుతోంది. చెత్త నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో కలిసి జీవరాశులను ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నాయి. దోమలు, దుర్వాసనతో డెంగీ, కలరా, మలేరియా, జ్వరాల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డులు నిరుపయోగం జిల్లాలోని 255 గ్రామాల్లో డంపింగ్‌యార్డులు నిర్మించారు. కానీ చాలా యార్డులు వృథాగానే ఉన్నాయి. తడి, పొడి చెత్తను వేరుచేసి, ఎరువులను తయారు చేయడం తగ్గిపోయింది. సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణాల్లో చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఉన్నప్పటికీ అది గాలిని కలుషితం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహాలను వేరుచేసి రీసైక్లింగ్‌కు పంపించాలి. ప్రజలను చైతన్యపరచడం ద్వారానే చెత్త, వ్యర్థాలను నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్‌హాల్స్‌లో పెద్ద ఎత్తున జరిగే శుభకార్యాల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగిండం, వాటిని నేరుగా డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదం. గంభీరావుపేట, ముస్తాబాద్, బోయినపల్లి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ అర్బన్, ఇల్లంతకుంటల్లో పారిశుధ్య, చెత్త సమస్య అధికంగా ఉంది. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చెత్తను, ప్లాస్టిక్‌ను కాల్చకుండా ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలి. శ్వాసకోస వ్యాధులే కాకుండా, క్యాన్సర్, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. గాలి, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. – డాక్టర్ చింతోజు శంకర్ -
రోడ్డెక్కిన రైస్‌మిల్లర్లు
సిరిసిల్ల: జిల్లాలో రైస్‌మిల్లర్లు శుక్రవారం రోడ్డెక్కా రు. రైస్‌మిల్లులను బంద్‌చేసి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ ధాన్యం మిల్లర్లకు ఇవ్వాలని, ఎఫ్‌సీఐ టెక్నికల్ స్టాప్ ద్వారా టెస్ట్ చేయాలన్నారు. సార్టెక్స్ రిజక్షన్స్‌ను మిల్లులకు అందించిన ధాన్యంలో తొలగించాలని, సీఎంఆర్‌లో 25 ఫెనాల్టీ, 12 శాతం వడ్డీని రద్దు చేయాలని కోరారు. మిల్లింగ్ చార్జీలను ఇతర రాష్ట్రాల తరహాలో రా రైస్‌కు క్వింటాలుకు రూ.100, బాయిల్డ్ రైస్ మిల్లులకు రూ.150 ఇవ్వాలని నాగరాజు కోరారు. రైస్ మిల్లులకు 125 హెచ్ పీ ఎల్టీ విద్యుత్ లైన్ సరిపోవడం లేదని 210 హెచ్‌పీ వరకు ఎల్టీ విద్యుత్‌గా పరిగణించాలని విన్నవించారు. గన్నీ రేట్లను రూ.50గా నిర్ధారించా లని, ఎఫ్‌సీఐ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల్లో షార్ట్ఫాల్ను 20 శాతం మేరకు పెంచాలని, ధాన్యం బకాయిలను ఎంఎస్పీ ప్రకారం చెల్లిస్తామని రైస్ మిల్లర్లు స్పష్టం చేశారు. ఈమేరకు 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు అందించారు. రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.రాజిరెడ్డి, సీ.హెచ్.శ్రీనివాస్, గరిపెల్లి ప్రభాకర్, పి.అనిల్‌రావు, వి.వంశీధర్‌రావు, పి.సత్యంరావు, బందం అంజయ్య, మల్లేశం, అనంతుల శ్రీనివాస్, నగునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అసత్యాలు తిప్పికొడతాం
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు తిప్పికొడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. పోలీసులపై బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్‌పై అసభ్యంగా మాట్లాడడం వంటి ఘటనలను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒకే గూటి పక్షుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. కేటీఆర్ నిత్యం అబద్ధాలు ఆడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు, ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. -
సమగ్ర ఓటర్ల సవరణ స్వరూపం
గ్రామాలు: 260పట్టణాలు: 02ఓటర్లు: 4,75,694బీఎల్వోలు : 549మృతులు : 12,791శాశ్వతంగా వెళ్లిపోయిన వారు: 25,926అడ్రస్ లేని వారు : 9,098అనామలీస్ జాబితాలోని ఓటర్లు : 78,835జనరేట్ అయిన నోటీసులు : 83,846నోటీసులు అందుకున్న వారు: 70,952నోటీసులు అందుకుని వచ్చిన వారు : 19,180తర్వాత వస్తామని సమాచారం ఇచ్చిన వారు: 103 -
12 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా
మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం. పన్నెడేళ్లుగా సిరిసిల్లలోనే ఉంటున్నా. ఇక్కడే ఓటుహక్కు ఉంది. మా ఊరిలో డెవిడ్ అని పిలిచే వారు. ఇక్కడ సత్యనారాయణగా గెజిట్ ద్వారా పేరు మార్చుకున్నా. ఓటర్ల సర్వేలో ఫొ టోలు, ఇతర ఆధారాలు అందించాను. అయినా.. మరోసారి నోటీసు రావడంతో విచారణకు వచ్చాను. – సత్యనారాయణ, సిరిసిల్లతలనొప్పిగా మారింది ఓటర్ల జాబితా సవరణ తలనొప్పిగా మారింది. నాకు 1,140 మంది ఓటర్ల జాబి తా ఇచ్చారు. పల్లెటూరు అయితే వెంటనే గుర్తుపడతాం. పట్టణం కావడంతో ఎవరూ.. ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. అద్దెకు ఉండి వెళ్లిపోతారు. ఓటు ఉంటుంది. కానీ వాళ్ల అడ్రస్ తెలియదు. నా పరిధిలో అడ్రస్ లేని వారు 300 మంది ఉన్నారు. – కాసర్ల తార, బీఎల్వో, సిరిసిల్ల -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
సిరిసిల్ల: మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(యూఎన్ఐడీవో) ప్రతినిధి దేవజిత్దాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం యూఎన్ఐడీవో ఆధ్వర్యంలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ(ఎన్ఐ–ఎంఎస్ఎంఈ) ఆధ్వర్యంలో మహిళలకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. దేవజిత్ దాస్ మాట్లాడుతూ మహిళల ఆధ్వర్యంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల అనుసంధానంతో బ్యాంకు రుణాలు పొందవచ్చని, సంక్షేమ పథకాలను, సామాజిక భద్రత సౌకర్యం లభిస్తుందన్నారు. సూక్ష్మ బీమాపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎల్డీఎం రాజీవ్‌కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు అరవింద్‌రావు, కె.సూర్యప్రకాశ్‌గౌడ్, శరత్ ముత్యాల, జిగ్నేశ్ డేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ పనులు వేగంగా చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడ: వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయం, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీ, విద్యుత్ టవర్లు, రోడ్డు పనులపై ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆర్అండ్బీ ఎస్ఈ భీమ్లానాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, నీటి పారుదలశాఖ అధికారి దయాకర్, తహసీల్దార్ జయంత్ ఉన్నారు. -
ఉండలేకపోతున్నాం
ముస్తాబాద్ డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడంతో పొగ విపరీతంగా వస్తుంది. రత్నాలకుంట, మానేరు కెనాల్లోకి మురుగుచేరి దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలతో జ్వరాలు వస్తున్నాయి. డంపింగ్‌యార్డులో చెత్తను కాల్చకుండా నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకోవాలి. – మాడూరి కిషన్, ముస్తాబాద్డంపింగ్యార్డును శుద్ధి చేశాం ముస్తాబాద్ డంపింగ్‌యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తను సగానికి పైగా తొలగించాం. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఖరీదైనది. ఎనిమిది నెలలుగా పారిశుధ్య చర్యలు తీసుకోవడంలో సిబ్బంది, మేము శ్రమిస్తున్నాం. మేజర్ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్, ముస్తాబాద్ -
కలలోనూ వెంటాడుతోంది
నా పేరు గోల్కొండ విజయ(58). మాది డబ్బు తిమ్మాయపల్లి గ్రామం. నా కూతురు సుమలత గర్భవతి కావడంతో ఆ రోజు హాస్పిటల్లో చూయించుకునేందుకు పయనమయ్యాం. క్షణాల్లో బస్సు బోల్తాపడడంతో జనాలు నాపై పడడంతో చేతులు, పక్కటెముకలు విరిగిగాయి. వెన్నుపూసకు గాయమై కదలలేని పరిస్థితుల్లో ఉన్న. నాపై నుంచి శవాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతోంది. ప్రమాదంలో నా బిడ్డను కోల్పోయా. నేను హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నా. ఇంటికి వచ్చేవరకు నా బిడ్డ చనిపోయిన విషయం నాకు చెప్పలేదు. ఇప్పటికీ ఆ ప్రమాదం కలలోనూ వెంటాడుతోంది. శరీరంలో పలుచోట్ల రాడ్లు వేసి ఆపరేషన్ చేయడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నిలబడ్డానికి కూడా చేతనైత లేదు. పెద్ద సార్లు దయ తలచి నాకు పింఛన్ ఇప్పించాలని విన్నపం. – విజయ, తిమ్మాయపల్లి -
● సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో గురువారం సమావేశమయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, తొమ్మిది రోజులపాటు హిందూ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలన్నారు. ఐక్యత, భక్తిభావం చాటేలా స్థానిక డప్పు కళాకారులతో శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ నాగేశ్వర్రావు, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు, ఎస్సై జ్యోతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
రామగుండం గ్రిడ్ ఫెయిల్యూర్.. చీకట్లో దక్షిణ భారతం
కొండగట్టు ప్రమాద దృశ్యం (ఫైల్)ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్2001, సెప్టెంబరు 11న అమెరికాలో ని ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడులు జరిగాయి. సరిగ్గా అదే రోజు ప్రస్తుత పెద్దపల్ల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సదరన్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిమ్మచీకట్లోకి జారిపోయింది. దీని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళపైనా పడింది. ఫలితంగా రాష్ట్రమంతా కరెంటు లేదు. రైల్వే, కమ్యూనికేషన్స్, ఆపరేషన్లు కష్టంగా మారాయి. సాధారణ శస్త్రచికిత్సలు వాయిదాపడ్డాయి. అత్యవసరమైనచోట జనరేటర్లతో సర్దుకున్నారు. పత్రిక కార్యాలయాలు, టీవీ మీడియా ఆఫీసులు కరెంటు కష్టాలు చవిచూశాయి. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్ ప్రజలు లిఫ్టులు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. మరునాడు రాత్రికి గ్రిడ్ పునరుద్ధరించారు. అప్పటి వరకూ అమెరికాపై దాడులు జరిగిన సంగతి దక్షిణ భారతవాసులకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచానికి నిరంతరం వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో దాదాపు రెండు రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడం అదే తొలిసారి, చివరిసారి. సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రదాడులు.. మనవద్ద కరెంటు పోవడంతో ప్రజల ఆందోళనతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మాకు ఇప్పటికీ షాకింగే. కరెంటు ఎందుకుపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే అధికారులు చెప్పలేమన్నారు. ఏదో పెద్ద సమస్య అని అర్థమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అవాయిడ్ చేయలేదు. కొన్ని జనరేటర్లు పెట్టి చేసేశాం, మరికొందరు వైద్యులు చీకటి ఉన్నా.. టార్చ్లైట్లు పెట్టి ఆపరేషన్లు పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశాం. నా సర్వీసులో గోదావరిఖనిలో రెండు రోజులపాటు కరెంటు పోయిన సందర్భం అదే. అమెరికాపై ఉగ్రదాడి జరిగి వందలాదిమంది మరణించిన రోజు కావడంతో సెప్టెంబరు 11ను అంత తేలిగ్గా మర్చిపోలేం. – డాక్టర్ నిరంజన్, గోదావరిఖని 2018 సెప్టెంబరు 11.. అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ఎలక్షన్ వేడి మొదలైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (జగిత్యాల– శనివారంపేట సర్వీసు) కొండగట్టు వద్ద సామర్థ్యానికి మించి దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులతో గుట్ట ఘాట్ రోడ్డు దిగుతోంది. ఆఖరు మలుపు వద్ద అదుపుతప్పి మట్టి కోసం తీసిన 12 అడుగుల గొయ్యిలో పడింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక, అంతర్గత గాయాలు, రక్తస్రావంతో 60మందికిపైగా మరణించారు. దేశంలోని ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలోనూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్‌ప్రదేశ్, డార్జిలింగ్ వంటి ఎత్తయిన పర్వతాలు, లోయలున్న ప్రాంతాల్లో బస్సు పడిన ఘటనల్లోనూ ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందినా.. వారి కుటుంబాలు రోడ్డు ప్రమాదం రూపంలో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎరవెల్లిలో కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ రౌడీలు, గూండాలను రేవంత్ స ర్కారు ఉసిగొల్పడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై గన్నుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిదన్నారు. చావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, నాయకులు బొల్లి రా మ్మోహన్, మీసరగండ్ల అనిల్‌కుమార్, కుంబా ల మల్లారెడ్డి, దిడ్డి రాజు, మ్యాన రవి, బాలమ ల్లు, సాయికుమార్, కందుకూరి రామాగౌడ్, అనిల్‌గౌడ్, మొగిలి నాగరాజు పాల్గొన్నారు. ఒత్తిడి లేని జీవితం గడపాలి సిరిసిల్లటౌన్: కార్మికులు ఒత్తిడి లేని జీవితం గడపాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో తమ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని సూచించారు. సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు, మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి విరాళం వేములవాడ: రాజన్న ఆల అభివృద్ధి, విస్తరణ పనులకు మహారాష్ట్రలోని పర్భణికి చెందిన మనోజ్ ప్రకాశ్‌రావు రూ.51,111 విరాళంగా అందించారు. ఆలయ అకౌంట్స్ అడ్వయిజర్ ఆగంరావుకు గురువారం అందజేశారు. అనంతరం దాతకు అర్చకులు స్వామి వారి ప్రసాదం, ఆశీర్వచనం అందించారు. సాయుధ పోరాట వారోత్సవాలు సిరిసిల్లటౌన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో సిరిసిల్లలో వారం రోజులపాటు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి గురువారం నివాళి అర్పించి మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో జిల్లాలోని సమస్యలపై పోరాడుతామన్నారు. నాయకులు సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్, శ్రీరాం సదానందం, బింగి సంపత్, ఆడెపు రజిత, పులి గోపాల్, గుండేటి వెంకటేశం, వడ్నాల వీరేశం, బోనాల రాజు, చిరంజీవులు, మార్కండేయులు పాల్గొన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలిసిరిసిల్ల అర్బన్: గణేశ్ మండపాల వద్ద విద్యుత్ భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్ఈ శ్రీనివాస్‌రావు సూచించారు. మండపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తును విద్యుత్ శాఖకు తెలియజేయాలని కోరారు. లైన్ల కింద మండపాలు ఏర్పాటు చేయరాదని, నాణ్యమైన వైర్లు, సరైన ఎర్తింగ్ వినియోగించాలని సూచించారు. స్తంభాలకు మండపాలు తగలకుండా చూడాలని, సర్వీస్ కేబుళ్లకు హుక్కులు ఉపయోగించరాదన్నారు. తడి చేతులతో స్విచ్‌లు, బోర్డులు తాకవద్దని తెలిపారు. మండపాల వద్ద వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే విద్యుత్ టోల్ ఫ్రీ 1912కు సమాచారం అందించాలని కోరారు. -
కొడుకు, అమ్మ చనిపోయారు
ఆ దుర్ఘటన జరిగిన రోజు మా బాబు అరుణ్ సాయి(5)కి జ్వరం రావడంతో మా అమ్మ భాగ్యమ్మ(45)తో కలిసి హాస్పిటల్‌కు బస్సులో బయల్దేరాం. కిక్కిరిసిన బస్సు అదుపుతప్పడంతో అందరూ అరవడం మాత్రమే గుర్తుంది. లేచేసరికి హాస్పిటల్లో బెడ్‌పై ఉన్నాను. ఈ ప్రమాదంలో నా కొడుకు అరుణ్‌సాయి, మా అమ్మ భాగ్యమ్మను కోల్పోయాను. ఆ విషయం రెండు రోజుల వరకు నాకు చెప్పలేదు. నా కొడుకు వయసు ఉన్న స్కూల్‌కి వెళ్లే పిల్లలను చూస్తే ప్రాణం విలవిల్లాడుతోంది. చేతికి పలుచోట్ల రాడ్లు పడడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రభుత్వం దయ తలసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. – కొండ శైలజ, హిమ్మత్‌రావుపేట -
గణేశ్ నవరాత్రులు వైభవంగా నిర్వహిద్దాం
● ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌లతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణేశ్ నవరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మున్సి పల్, విద్యుత్, మత్స్య, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జనం సందర్భంగా క్రేన్స్, జేసీబీలు, విద్యుత్‌దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు పోలీస్ శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీని వాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి జిల్లాలో ఖరీఫ్(వానాకాలం) సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2.40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు చివరి వారంలో వడ్లు చేతికి వస్తాయని గన్నీసంచులు, ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మి షన్లు, తేమయంత్రాలు సిద్ధం చేయాలని, లారీల కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు లారీలను సిద్ధం చే యాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగే శ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్బీ కుమారి, డీసీఎస్వో బుచ్చిబాబు, డీఎం గోపాల్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్ణ, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ప్రకాశ్, మార్క్‌ఫెడ్ అధికారి హబీబ్ పాల్గొన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలు పూర్తిచేయాలి జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్హెచ్ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇతర నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. 10 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో ఆరు భవనాలు తుది దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ పోస్టర్ ఆవిష్కరణ మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకుసాగాలని కలెక్టర్ కోరారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 14416 పోస్టర్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్తో కలిసి ఆవిష్కరించారు. డాక్టర్ నయీమా జహా ఉన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. మట్టివిగ్రహాలను పూజించాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్ పాల్గొన్నారు. -
భిక్షాటనకో లెక్కుంది !
భిక్షాటన.. గంగిరెద్దుల వారి జీవనవిధానం. ఆచారం..వంశాచారంగా భావిస్తూ గంగిరెద్దులను పట్టుకొని ఊరూరా సంచార జీవనం గడుపుతుంటారు. అయితే భిక్షాటనలోనూ వీరు హద్దులు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీగా ఊర్లను పంచుకొని భిక్షాటనకు వెళ్తున్నారు. ఎవరైనా హద్దులు దాటి ఇతరుల పరిధిలోకి వచ్చి యాచిస్తే భారీ జరిమానా చెల్లించాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఏళ్లుగా భిక్షాటనతో సంచార జీవనం సాగిస్తున్న గంగిరెద్దుల కుటుంబాల జీవనశైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సిరిసిల్ల -
పెన్షన్ కథాచిత్రం
● పీఆర్సీల జాప్యం.. ● బెనిఫిట్స్ కోసం పండుటాకుల పడిగాపులు ● ఆ‘వేదనతో’ ఉద్యోగులు రి‘టైర్డ్’సిరిసిల్లటౌన్: వారి జీవితం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణ తర్వాత శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని ఆశిస్తే ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెందుతున్నారు. మూడు దశాబ్దాల శ్రమకు ఫలితం దక్కలేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వృద్ధాప్యంలో అవసరాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మూడున్నర దశాబ్దాల కష్టాన్ని ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పొదుపు చేసుకుంటే వాటన్నింటికీ గ్రాట్యూటీని కలిపి రావాల్సిన సొమ్ము ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఒకప్పుడు విశ్రాంత ఉద్యోగులు పొందిన బెనిఫిట్స్ మాదిరిగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు అందడం లేదు. అయోమయంలో 2,400 మంది పెన్షనర్లు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారు, ఫ్యామిలీ పెన్షనర్లు మొత్తంగా 2,400 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతీ నెల ఒకటో తారీఖున వచ్చే పెన్షన్ డబ్బులతోనే కిరాణం, మందులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. పెన్షన్ డబ్బులతోనే కుటుంబాలను వెళ్లదీసే వారు చాలా మంది ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునే కొంతమంది పెన్షనర్లు తమ జీతంపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థలలో రుణాలు పొంది ఉన్నారు. ప్రతీనెల మొదటి వారంలో కిస్తులు చెల్లించాల్సి ఉంటోంది. ఒక్కో నెలలో ఏదైనా కారణాలతో జీతాలు ఆలస్యంగా వస్తే రుణదాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షనర్లకు కూడా ప్రభుత్వం ఈహెచ్ఎస్ కార్డులు అందివ్వగా.. అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ వైద్యం చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ పనిచేయకపోవడంతో పెన్షనర్లు నగదు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకు రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉండగా.. నిధుల్లేక ఏళ్లుగా రావడం లేదు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు ఇవీ.. -
ఖతార్‌లో ఉద్యోగావకాశాలు
● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలువేములవాడ: ఖతార్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీష్‌రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్‌లు, సౌస్చెఫ్లు, కుక్‌లు, క్యాటరింగ్ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ 1,000 రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్‌కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్కు 3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకూ పోస్టును బట్టి 1,600 నుంచి 3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లపై సంప్రదించవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 17 : సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం సెప్టెంబర్ 18: సిరిసిల్ల, జగిత్యాల–(క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) సెప్టెంబర్ 19: నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) -
యువత ఆలోచనలకు జాతీయ వేదిక
సిరిసిల్ల అర్బన్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 క్విజ్ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు ప్ర త్యేక చొరవ చూపాలని జిల్లా విద్యాధికారి ఎస్. మొండయ్య కోరారు. అందుకు సంబంధించిన పో స్టర్లను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 యువత ఆలోచనలకు జాతీయ వేదిక కానుందన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని మై భారత్ విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరిగే జా తీయ యువజనోత్సవంలో భాగంగా రూపొందించిన ఈ వేదిక ద్వారా దేశ భవిష్యత్, వినూత్న విధాన రూపకల్పనలో విద్యార్థులు, యువతీ, యు వకులు భాగస్వాములు కావాలని కో రారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు మై భారత్.జీవోవీ.ఐఎన్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్‌కుమార్ తెలిపారు. -
యోగా సంబరం
● కరీంనగర్లో 13వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ పోటీలు ● ఈనెల 11, 12న నిర్వహణ ● 890 మంది క్రీడాకారుల రాకకరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగా క్రీడలకు కరీంనగర్ వేదిక కానుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆదేశాల మేరకు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో ఈ నెల 11,12న పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలురు, 400 మంది బాలికలు, 50 మంది కోచ్‌లు, మేనేజర్లు, 40మంది రిఫరీలు, కలిపి మొత్తం 890 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 8–10, 10–12, 12–14 సంవత్సరాల సబ్‌జూనియర్ విభాగాలతో పాటు 14–16, 16–18 సంవత్సరాల జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
ఘనంగా శ్రావణ పూజలు
వేములవాడ: భీమేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రావణమాస పూజలు వైభవంగా నిర్వహించారు. రాజన్న ఆలయంలో ఏకాంతంగా విశేష పూజలు చేయగా, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసమంతా జరిగిన నిత్య రుద్రాభిషేక పూజా ఫలాలను సమర్పిస్తూ 11 మంది రుత్వికులతో 121 రుద్రాలతో విశేష రుద్రహవనం నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, నరేందర్ తదితరులు హాజరయ్యారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో ఈవో తనిఖీలు భీమేశ్వరస్వామి ఆలయంలో ఈవో రమాదేవి త నిఖీలు చేపట్టారు. సౌకర్యాలపై భక్తులతో ఆరా తీశారు. ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏఈవో నాగుల మహేశ్, పర్యవేక్షకులు నరేందర్, భాస్కర్, శివసాయి, రాజేందర్, సీని యర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, మహేశ్ ఉన్నారు. -
రైతు అనుమానాస్పద మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌కు చెందిన రైతు జంగిటి శ్రీనివాస్(57) చింతల్‌ఠాణా శివారులోని తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం ఉదయం పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లిన ఆయన సాయంత్రం 7 గంటలైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పక్క పొలం వారికి ఫోన్ చేశారు. వారు వెళ్లి చూడగా శ్రీనివాస్ పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనివాస్ మరణానికి గుండెపోటు కారణమా లేదా మరేదైనా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర విద్యావిధానంపై శిక్షణసిరిసిల్లటౌన్: జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బుధవారం ఒక్క రోజు ఓరియంటేషన్ నిర్వహించారు. పద్మనాయక ఫంక్షన్హాల్లో ఎంఈవోలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవోలు, సీఆర్పీలకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్(సమగ్ర విద్యా విధానం)పై జరిగిన వర్క్‌షాప్‌లో ప్రశస్తయాప్, స్వచ్ఛ హరిత విద్యాలయ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య, సెక్టోరియల్ ఆఫీసర్ పాషికంటి సతీశ్‌కుమార్, ఫిజియోథెరపిస్ట్ రాజేశ్, ఎంఈవోలు రామకృష్ణ, కిషన్, గంగారం, శ్రావణ్‌కుమార్, రఘుపతి, రవీందర్, మనోహర్‌రెడ్డి, కపిల నరేశ్ పాల్గొన్నారు. చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టుగంగాధర: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గతంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకరైన గజవెల్లి వంశీ బుధవారం మధురానగర్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, పోలీసులకు చిక్కాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఇటీవల దొంగతనానికి పాల్పడిన కొండ శశికాంత్, సీహెచ్.సంతోష్, గజవెల్లి వంశీతో కూడిన ముఠాపై నిఘా వేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొండ శశికాంత్‌ను ఇప్పటికే అరెస్టు చేయగా, వంశీని సైతం అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు. గంజాయి విక్రయ కేసులో ఐదేళ్ల జైలుకరీంనగర్ క్రైం: గంజాయితో పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన జంబార్తి ఈశ్వర్(24) శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయించి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. 2022 అక్టోబర్ 17న గంజాయి విక్రయించేందుకు మానకొండూర్ చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కిలోకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ ఎం.రాజ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. సాక్షులను సీఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కోర్టు పీసీ మౌనిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శరత్ సాక్షులను విచారించారు. ఈశ్వర్ నేరానికి పాల్ప డినట్లు నిర్ధారించిన న్యాయమూర్తి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధించారు. ఒకరిపై దాడిచేసిన ముగ్గురిపై కేసుజగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద మంగళవారం రాత్రి పురాణం పవన్‌కుమార్‌పై దాడిచేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్ సమీపంలోని దుర్శేడ్‌కు చెందిన పురాణం పవన్‌కుమార్ ట్రాలీ వాహనం నడుపుతుంటాడు. మంగళవారం ఆయిల్ కాటన్స్ తీసుకుని మెట్పల్లి వెళ్లి తిరిగి కరీంనగర్ వెళ్తుండగా మంచినీళ్ల బావివద్ద గొల్లపల్లి మండలం వెంగళాపూర్‌కు చెందిన దొనకంటి నరేశ్, లక్ష్మీపూర్‌కు చెందిన సంతోష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అతివేగంగా ఎందుకు వెళ్తున్నావంటూ వాహనాన్ని ఆపి దాడిచేశారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆలయ భూములపై సర్వే చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆలయాల భూములపై సర్వే చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిరణ్‌నాయక్ కోరారు. ఈమేరకు బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ సుప్రియకు భూముల వివరాలు తెలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కేశవ పెరుమాండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీరుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ భూముల వివరాల కోసం వెంటనే సర్వే చేయాలన్నారు. గ్రామంలోని ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ ఆలయ భూముల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. నాయకులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
అంగన్వాడీల్లో పోషణ సందడి
గంభీరావుపేట(సిరిసిల్ల): చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించేందుకు ఏటా జాతీయ పోషణ మాసం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం, సమతుల ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించడంతోపాటు చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించే చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార ప్రదర్శనలు, అవగాహన సమావేశాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణపై చర్చలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. స్థానికంగా లభించే పౌష్టిక పదార్థాలతో సమతుల ఆహారం తయారు చేసుకునే విధానాలను వివరించనున్నారు. బాల్యం కోసం.. పోషణ మాసం చిన్నారుల ఎదుగుదలలో పోషకాహారం కీలకం. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు వివరించనున్నారు. పోషకాహారంపై ప్రతీ కుటుంబంలో అవగాహన పెంపొందించడమే పోషణ మాసోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. అంగన్వాడీల వివరాలు ప్రాజెక్టులు కేంద్రాలు 2 587జిల్లాలో లబ్ధిదారులు ప్రాజెక్టు 7నెలల్లోపు మూడేళ్లలోపు ఆరేళ్లలోపు గర్భిణీలు బాలింతలు సిరిసిల్ల 1930 28827 9346 2110 1886 వేములవాడ 1052 6010 4590 1176 881సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పోషకాహార సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బాల్యంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది. ప్రతీ కుటుంబం పోషణమాసంలో భాగస్వామ్యం కావాలి. నెల రోజులపాటు లబ్ధిదారులకు పోషకాహార ప్రాధాన్యతపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అవగాాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – స్వరూప, ఐసీడీఎస్ సూపర్వైజర్, గంభీరావుపేట -
316 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. రగుడు వద్ద గల కనకదుర్గ ట్రేడర్స్ రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 316 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ మిల్లును సీజ్ చేసి, బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్వో బుచ్చిబాబు తెలిపారు. తనిఖీల్లో డీటీవో సత్యనారాయణ, రజిత తదితరులు పాల్గొన్నారు. పట్టు రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహనతంగళ్లపల్లి: కేంద్ర సిల్క్‌బోర్డు చేపట్టిన ‘మేరా రేషమ్ మేరా అభియాన్’లో భాగంగా బుధవారం మండలంలోని మండెపల్లిలో పట్టు రైతులకు శిక్షణ నిర్వహించారు. ‘మల్బరీ తోటల ప్రాముఖ్యత – పట్టుపురుగుల పెంపకం గృహ నిర్వహణం’ అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, రాఘవేందర్ మాట్లాడుతూ షెడ్ల నిర్వహణ, మొక్కల మధ్య పాటించాల్సిన దూరం, కొమ్మల కత్తిరింపు(ప్రూనింగ్)పై వివరించారు. సెరీకల్చర్ అధికారి(ఎస్వో) జగన్, రైతులు పాల్గొన్నారు. నిరంతరం విద్యుత్ అందించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సూచించారు. మండలం కేంద్రంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులతో సరఫరాపై ఆపరేషన్ సమీక్ష నిర్వహించారు. గత మూడు నెలల్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం రికార్డు నమోదవుతుందని తెలిపారు. అధిక వినియోగంతో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వీలైనంత తక్కువ అంతరాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్‌ప్లాంట్ ప్రారంభం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో 1.6 మెగావాట్స్ సోలార్ ప్లాంటును జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రతిరోజు 6వేల నుంచి 7వేల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అశోక్, డివిజనల్ ఇంజినీర్ అంజయ్య పాల్గొన్నారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీసిరిసిల్ల: జిల్లా న్యాయస్థానాల్లో ఈనెల 12న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం కోరారు. రాజీ పడదగిన కేసులలో కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి రాజీ పడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
బెనిఫిట్స్ ఇవ్వాలి
రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ పొందడంలో కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా ఏకమొత్తంలో చెల్లించాలి. 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు ఒకేసారి విడుదల చేయాలి. మూడేళ్లుగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించలేదు. – మల్లారపు పురుషోత్తం, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు ఈహెచ్ఎస్లో తప్పులు సరిదిద్దాలి విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)లో తప్పులు సరిదిద్ది కార్పోరేట్ వైద్యం అందించాలి. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, బకాయిల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీ ప్రకటించాలి. – ద్యావనపల్లి పరమేశ్, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి -
దృష్టిలోపం ప్రారంభ దశలోనే గుర్తించాలి
● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిరిసిల్ల: విద్యార్థుల్లో దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో బుధవారం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)పై సమీక్షించారు. ‘నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్’ అనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈనెల 15 నుంచి సమగ్ర నేత్రపరీక్షలు చేయాలని సూచించారు. పరీక్షల వివరాలు సక్రమంగా నమోదు చేసి, అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్‌బాబు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధి కారి, వైద్యులు నయీమ్ జహా, సంపత్‌కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీవో ఎన్హెచ్ఎం రాజేందర్ పాల్గొన్నారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యాటక రంగం అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ మాట్లాడారు. టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, డీవైఎస్వో రాందాస్, డీటీసీపీవో అన్సార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్‌లాల్ పాల్గొన్నారు. పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ పోటీలు ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువులో ఉన్న వీటీఏడీఏ పార్క్, నాంపల్లిగుట్టకు సంబంధించిన ఉత్తమ రీల్స్, ఎక్కువ వ్యూస్ వచ్చే వారు ఈనెల 20 వరకు పంపించాలని సూచించారు. అత్యుత్తమ రీల్స్‌కు మొదటి బహుమతి రూ.15వేలు, రెండో బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఉత్తమ రీల్స్ రూపొందించి.. ఎక్కువ వ్యూస్ వచ్చిన రీల్స్ లింక్ 94402 39783కు వాట్సాప్ చేయాలని కోరారు. -
ఆత్మహత్యలు చాలా తగ్గాయి
సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేతకార్మికుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. ఇప్పుడు కార్మికుల కొరత ఉంది. పని చేసే వారికి చేతి నిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. కారణాలు వేరే ఉంటున్నాయి. కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది. – శ్రీరాం సంతోష్‌కుమార్, చేనేత, జౌళిశాఖ ఏడీఆత్మహత్య పరిష్కారం కాదు ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి, అశాంతి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏమైనా సరే మానసిక వైద్యనిపుణుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి. భవిష్యత్‌పై ఆశలతో జీవించాలి. నిరాశపూరిత వాతావరణాన్ని దూరం చేసుకుంటూ మానసిక వికాసం పొందాలి. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలి. – డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా వైద్యాధికారి -
అన్నదాత ఆగ్రహం
● గాలిపల్లిలో సొసైటీ గోదాముకు తాళం ● ధర్మారంలో రాస్తారోకోఇల్లంతకుంట/కోనరావుపేట: యూరియా లభించడం లేదని మండలంలోని గాలిపల్లి ప్యాక్స్ ఎరువుల గోదాముకు రైతులు బుధవారం తాళం వేశా రు. యూరియా యాప్ జిల్లా యూనిట్‌గా ఉండడంతో స్థానిక రైతులకు ఎరువులు దొరకడం లేదన్నా రు. మండల యూనిట్‌గా చేయాలని కోరారు. ప్యాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, ఏఈవో రవళి, సొసైటీ కార్యదర్శి మల్లేశం చేరుకొని రైతులకు నచ్చజెప్పా రు. జిల్లా కోపరేటీవ్ అధికారి రామకృష్ణ రైతులతో ఫోన్లో మాట్లాడడంతో రైతులు తాళం తీశారు. ధర్మారంలో రాస్తారోకో కోనరావుపేట మండలం ధర్మారంలో సర్పంచ్, బీజేపీ మండలాధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో ఇంకా 22 ఎకరాల భూమి సేకరించి కాలువలు నిర్మించాలన్నారు. గంగుల ప్రశాంత్, పొన్నం పరశురాములు, గంగుల రమేశ్, మల్యాల సుమన్, మైలారం రమేశ్, అన్నబోయిన అభిషేక్, పొట్లపల్లి గోపి, తిరుపతి, బక్కయ్య, రాకేశ్, ఎల్లయ్య , విక్రం, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ సరఫరాలో లోపాలు అధిగమించాలి
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ సిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో తలెత్తే లోపాలు అధిగమిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సిరిసిల్లలోని విద్యుత్ స్టోర్‌లో బుధవారం ఆపరేషన్ సమీక్ష జరిపి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులతో మాట్లాడారు. పెద్దూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్, 132 కేవీ ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్, జిల్లా స్టోర్స్‌ను తనిఖీ చేశారు. చీఫ్ ఇంజినీర్ బి.అశోక్, డివిజనల్ ఇంజినీర్ ఎన్.అంజయ్య పాల్గొన్నారు. -
కార్మికక్షేత్రం మురిసింది!
కరువు తీరింది..సిరిసిల్ల: పవర్‌లూమ్స్ రాకతో వస్త్రోత్పత్తిలో వేగం పెరిగినా కార్మికుల జీవితాలు నెమ్మదించాయి. కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలతో ఉసురుతీసుకున్న సంఘట నలో నిత్యకృత్యం. ఒక్క రోజు నలుగురు కార్మికుల ఆత్మహత్యలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణం.. ఇవన్నీ దశాబ్దం క్రితం సిరిసిల్లలో ఒకప్పటి మాట. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల ఉపాధి కేంద్రమైంది. ఆత్మహత్యలు నిలిచిపోయాయి.. వలసలు ఆగిపోయాయి.. ఇప్పుడు చేతినిండా పనితో సిరిసిల్ల ముసిముసి నవ్వులతో మురిసిపోతోంది. వస్త్రోత్పత్తికి కేరాఫ్‌గా.. ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 27వేల మరమగ్గాలు ఉన్నాయి. తెలంగాణలో వస్త్రోత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా సిరిసిల్ల నిలుస్తుంది. 24వేల మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట ఉత్పత్తి అవుతుండగా.. మూడు వేల పవర్‌లూమ్స్‌పై కాటన్(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతుంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో 25వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్, వైపణి, వార్పిన్ పనులు ఉంటాయి. గతంలో ఉపాధి లేక నేత కార్మికులు పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ దశాబ్దకాలంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు దూరమయ్యారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఇక్కడికొస్తున్నారు. వలసలకు నిలయమైన పట్టణం ఇప్పుడు ఉపాధి కేంద్రంగా భాసిల్లుతోంది. ఇదీ నేతన్నల ఆత్మహత్యల పరంపర సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య ఇద్దరు బిడ్డలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా.. ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయస్థాయిలో వార్తాంశమైంది. ఆ ఆత్మహత్యల పరంపర సిరిసిల్లలో కొనసాగుతూ వచ్చింది. మార్పునకు కారణాలివీ.. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ప్రభుత్వ ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా.. ఇప్పుడు ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు రావడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. వస్త్రపరిశ్రమ అనుబంధ రంగాల్లోనూ దాని ప్రభావం ఉంది. నేతకార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్ అమలు చేస్తున్నారు. టవల్స్, లుంగీలు, దోవతులు, అంచుచీరలు, పట్టుచీరలు, మెహెందీ వంటి ఆధునిక వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. బహిరంగ మార్కెట్లో పోటీ పడుతున్నారు. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. కార్మిక క్షేత్రంలో ఆత్మహత్యలు తగ్గాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కుటుంబ సమస్యలు.. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు కారణమవుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్యల పరంపర సంవత్సరం ఆత్మహత్యల ప్రభుత్వ పరిహారం సంఖ్య పొందిన వారు 2010 84 04 2011 93 13 2012 99 19 2013 86 16 2014 65 10 2015 63 33 2016 32 12 2017 19 09 2018 12 02 2019 10 04 2020 06 04 2021 07 07 2022 08 06 2023 06 06 2024 05 05 2025 09 09 2026 03 03ఇప్పటి వరకు -
కుదిరిన కూలి ఒప్పందం
సిరిసిల్లటౌన్: కాటన్ చీరల ఉత్పత్తి కార్మికులు, ఆసాములతో యజమానులు కొత్త కూలి ఒప్పందం కుదిరింది. బుధవారం సిరిసిల్ల చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో ఇరు పక్షాల ప్రతినిధులు కలిసి నూతన కూలి ఒప్పందం చేసుకున్నారు. కాటన్ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌తో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కూలి చర్చలు జరిగాయి. కాటన్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు 20 కౌంటు ప్యాకకు గతంలో 10 పిక్కులకు 44 పైసలు ఉన్న కూలిని 60పైసలు, పాప్లిన్ వస్త్రం 10 పిక్కులకు 44 పైసలకు పెంచారు. ఆసాములకు సంబంధించి డబుల్ కూలి చెల్లించేలా ఇరు సంఘాలు అంగీకరించాయి. ఈ కూలి ఒప్పందం ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కార్మికులు, ఆసాములు సమ్మెకు వెళ్లకముందే కూలి పెంచడంపై యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై అవగాహన గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు షీ టీం అధికారులు ప్రమీల, రవి తెలిపారు. మండలంలోని గజసింగవరం, గోరింటాల ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత నెలలో షీటీమ్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో మూడు కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు గురైతే షీ టీమ్‌కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ కోరారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. నాయకులు మల్లారపు ప్రశాంత్, కడారి శివ, ముభారక్, రషీద్, సృజన్, శ్రీతన్, మహేశ్ పాల్గొన్నారు. ఉపసర్పంచుల చెక్‌పవర్ రద్దు చేయండి సిరిసిల్ల అర్బన్: గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, పరిపాలనకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో ఉపసర్పంచుల సంయుక్త చెక్‌పవర్‌ను రద్దు చేసి సర్పంచులకే పూర్తి అధికారాలు కల్పించాలని జిల్లాలోని సర్పంచులు బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఉపసర్పంచుల చెక్ పవర్, డిజిటల్ సంతకాల కారణంగా నిధుల వినియోగంలో జాప్యమవుతుందన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఫీజు బకాయిలపై పోరుబాట సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా బకాయిలు పెట్టిన ఫీజులు చెల్లించాలని కోరుతూ సిరిసిల్లలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బుధవారం పోరుబాట పట్టాయి. టీపీడీఎంఏ, ఎస్యూపీఎంఏ ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. -
వసూళ్లు ఫుల్.. వసతులు నిల్ !
● ఏసీ గదుల్లోనూ ఉక్కపోతనే.. ● కనిపించని పరిశుభ్రత ● పట్టించుకోని అధికారులు ● రాజన్న వసతిగృహాల్లో సమస్యల తిష్టవేములవాడ: భక్తుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా వసతులు కల్పించడంలో రాజన్న ఆలయ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపం.. వసతిగృహాల్లో దుర్వాసన వెదజల్లుతున్నా పట్టింపు కరువైంది. చివరికి ఏసీ వసతిగృహాల్లో ఏసీలు పనిచేయక అద్దె గదుల్లో ఉండలేకపోతున్నారు. రాజన్న వసతిగృహాల్లో అవస్థలపై సాక్షి ప్రత్యేక కథనం. పేరుకే వసతి గృహాలు వేములవాడలో భక్తుల కోసం ఆలయ ఆధ్వర్యంలో వసతిగృహాలు నిర్మించారు. నందీశ్వర, లక్ష్మీపార్వతి, పార్వతీపురం, భీమేశ్వర సదనాల్లో భక్తులకు గదులను అద్దెకు ఇస్తున్నారు. గదుల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో భక్తులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం వసతి గదుల ఆవరణ, గదుల నిర్వహణ, ప్రాంగణాలు, పరిశుభ్రత లేని శౌచాలయాలతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ వాతావరణంతో భక్తులు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. వసతి గృహాల్లో తలెత్తుతున్న సమస్యలపై సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ ఉన్నతాధికారులు స్పందించి, వసతిగృహాల నిర్వహణను మెరుగుపరచాలని కోరుతున్నారు. దుర్వాసన వస్తోంది ఆలయ వసతి గదుల్లో దుర్వాస వస్తోంది. ఆలయ అధికారులు, సిబ్బంది పట్టించుకున్న పాపానపోవడం లేదు. వసతిగదుల్లో పరిశుభ్రత లోపిస్తుంది. పట్టించుకునే వారు లేరు. ఇప్పటికై నా అధికారులు వసతిగదులను నిత్యం శుభ్రం చేయాలి. – రాపెల్లి శ్రీధర్, స్థానికుడుఏసీ గదులు తీసుకుని కార్లో నిద్రపోయాం కుటుంబ సభ్యులతో వచ్చి భీమేశ్వర సదన్‌లో రెండు గదులు తీసుకున్నాం. ఇందుకు అద్దె కూడా చెల్లించాం. తీరా చూస్తే ఏసీ పనిచేయలేదు. అధికారులకు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. డబ్బులు వెచ్చించి మా కారులోనే ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నాం. – గోనె కపిల్ దంపతులు, హైదరాబాద్రెండు రోజుల క్రితం రాజన్న దర్శనానికి హైదరాబాద్‌కు చెందిన గోనె కపిల్ కుటుంబ సభ్యులు వచ్చారు. భీమేశ్వర సదన్‌లో రెండు ఏసీ గదులు తీసుకున్నారు. తీరా ఏసీలు పనిచేయలేదు. అధికారులు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోపోవడంతో నిరసనగా గదికి తాళాలు వేసి వెంట తీసుకెళ్లాడు. -
రయ్.. రయ్యంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జాతీయ రహదారి 563పై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కరీంనగర్– వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేవలం 40 నిమిషాల్లో రెండు నగరాల మధ్య వాహనాలు రాకపోకలు సాగించేలా ఈ రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రహదారి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడం వరకు అందుబాటులో ఉండేది. దుర్శేడ్ వద్ద ర్యాంపు నిర్మించకపోవడంతో పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందన్న శ్రీసాక్షిశ్రీ కథనంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వారు కరీంనగర్– వరంగల్ సెక్షన్ దుర్శేడ్ వద్ద రోడ్డు చివర తాత్కాలిక ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్‌కు రాకపోకలు సాగించేందుకు వీలు చిక్కింది. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్ పనులు మొదలయ్యే వరకు ఈ తాత్కాలిక ర్యాంప్ మీదుగా రాకపోకలు సాగనున్నాయి. ఈ రహదారిని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు హన్మకొండ కలెక్టర్ చేతుల మీదుగా ఎన్‌హెచ్–563 ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ అవార్డు అందుకోవడం విశేషం. ఇక అక్టోబరు మొదటి వారం నుంచి కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా టోల్ చార్జీలు వసూలు చేయనున్నారు. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్‌కు రూ.9కోట్లు దాదాపు రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల ఎన్‌హెచ్– 563 జగిత్యాల– కరీంనగర్ సెక్షన్‌కు ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి త్వరలోనే ఖరారవనున్నాయి. ఇరుకుగా ఉన్న జగిత్యాల– కరీంనగర్ రోడ్డుపై రాకపోకలు అంటే ప్రతీరోజూ ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగాధర వద్ద రైల్వేగేట్‌తో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు టెండరు ఖరారయ్యేలోగా వాహనదారులకు వీలుగా ఉండేలా ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లు విడుదల చేశారు. పలుచోట్ల రోడ్ల వెడల్పు, చెట్ల తొలగింపు, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేసే పని చేపడుతున్నారు. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో పాత రహదారిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 39కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ర్యాంపులు, అండర్‌పాస్‌లు కావాలి ● దుర్శేడ్ వద్ద రోడ్డు చివర ఏర్పాటు చేసిన ర్యాంపుతో కరీంనగర్–వరంగల్– పెద్దపల్లి వెళ్లే వాహనాలకు కాస్త ఊరట లభించింది. రోడ్డు దిగాక.. కరీంనగర్ లేదా పెద్దపల్లి వైపు ఎలా వెళ్లాలి? అన్న విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ● పెద్దపల్లి నుంచి వచ్చేవారు దుర్శేడ్ పద్మనాయక భవనం వద్ద యూటర్న్ తీసుకుని ర్యాంపుమీదుగా హైవే ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ వాహనదారులు తికమకపడితే పరస్పరం ఢీకొనే ప్రమాదముంది. ● పెద్దపల్లి నుంచి వచ్చే వారికి జగిత్యాల వైపు నిర్మించినట్లుగా శాశ్వత ర్యాంపులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ● అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రహదారికి శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి వద్ద అండర్ పాస్‌లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందిస్తూ.. తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
గణేశ్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి
సిరిసిల్ల/వేములవాడ: గణేశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మంగళవారం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపం, వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో గణేశ్ మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గతేడాది నిమజ్జన వేడుకలకు అందరూ సహకరించారని, అక్కడక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే 8 కేసులు నమోదు అయ్యాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు గణేశ్ పోర్టల్‌లో తమ మండపానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజా రవాణా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మండపాల వద్ద 24 గంటలూ వలంటీర్లు అందుబాటులో ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల ఆగమనం సందర్భంగా పోలీసు శాఖకు సమాచారం అందించాలని, నిమజ్జనం రోజు నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శోభా యాత్ర, నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సిరిసిల్ల , వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, వీరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. -
3,718 ఎకరాలు
● ‘ఇది సిరిసిల్లలోని బీవై నగర్ కార్మిక క్షేత్రం. నాలుగున్నర దశాబ్దాల కిందట ఇక్కడ రాయిని చెరువు ఉండేది. నేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో నివాస స్థలాల లేక అప్పటి పాలకులు చెరువు శిఖంలో ఇళ్ల స్థలాలను పట్టాలుగా ఇవ్వడంతో బీవైనగర్, సుందరయ్యనగర్, తారక రామానగర్, ఇందిరానగర్లాంటి ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఈ నాలుగు కార్మికవాడల్లో 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఏదైనా ఆపద పడి ఇల్లును అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే.. రిజిస్ట్రేషన్ కావడం లేదు. కార్మిక వాడల్లో ఆస్తులున్నా అక్కరకు రావడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో 22–ఎ జాబితాలో చేరిపోయింది. ఫలితంగా సామాన్యులు బాండ్ పేపర్లపై ఇంటి నంబరుతో క్రయ, విక్రయాలు సాగిస్తున్నారు.’ -
బీఆర్ఎస్ నేతల ఆందోళన
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కార్మికక్షేత్రం దద్దరిల్లింది. మంగళవారం అంబేడ్కర్ చౌరస్తాలో వందలాది సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్నారని, మహిళ ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక విధానాలను మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి ఒక్కటి కూడా అమలు చేయని చేతగాని ప్రభుత్వంగా విమర్శించారు. వందలాది సంఖ్యలో బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీస్, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు సీఎం ఫొటోలు చించి, కాంగ్రెస్ ఫ్లెక్సీ ముక్కలను దహనం చేశారు. తోపులాటలో బీఆర్ఎస్వీ నాయకుడు కంచర్ల రవిగౌడ్ తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్క్సాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్‌చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ దార్ల సందీప్, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా కార్మికక్షేత్రం సిరిసిల్ల ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. స్థానిక ఆర్యవైశ్య భవనంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఎల్లంకి వాణి, చేపూరి జమున, గౌరిశెట్టి ఇందిరా, అల్లాడి సరస్వతిదేవి, బుస్స ప్రసన్న, రాజూరి చంద్రకళ, ఎల్లంకి లక్ష్మి, గూడెల్లి కవిత, గౌరిశెట్టి బాలలక్ష్మి, పుల్లూరి సమత తదితరులు పాల్గొన్నారు. – సిరిసిల్లటౌన్ -
ఆధారాలు చూపినా పని అవుతలేదు
వేములవాడ మండలం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6లో నాకు ఐదున్నర గుంటల భూమి ఉంది. అగ్రహారం ఆలయానికి అరకిలోమీటరు దూరంలో నా భూమి ఉంటుంది. కానీ, ఆ సర్వే నంబరులోని భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అన్ని ఆధారాలు చూపినా పని కావడం లేదు. నాలాంటి వాళ్లు అవసరాలకు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది అవుతుంది. – అన్నారం రాజు, సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి క్లారిటీ వస్తేనే.. వేములవాడ మండలం అగ్రహారం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6 మా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో ప్రొహిబీటెట్గా నమోదైంది. ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వస్తేనే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మేం ఏమీ చేయలేం. ఆ స్థలాల యజమానులు రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. – విజయభాస్కర్, సబ్ రిజిస్ట్రార్, వేములవాడ సర్వేలతో సరిచేస్తున్నాం జిల్లాలో 22– జాబితాలో వ్యవసాయ భూములు ఏమీ లేవు. కొన్ని వ్యవసాయేతర భూములు నమోదయ్యాయి. వాటిని క్షేత్రస్థాయి సర్వేలతో సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 22–ఎ సమస్యలతో కేవలం 11 ఫిర్యాదులు మాత్రమే అందాయి. వాటిని నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్ -
మా సంగతేంటి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి మారుపేర్లపై ప్రభుత్వం తొలిసారిగా సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతాము.. ఆస్తుల మార్పిడి, ఆధార్‌కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఆస్తులు, పింఛన్ల విషయంలో.. ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్‌కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్‌కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తల పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో తల పట్టుకుంటున్నారు. తమకు కూడా అలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నారు. -
22-ఏ
● అన్నీ వ్యవసాయేతర భూములే.. ● రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. సామాన్యులకు షాక్ ● ఫిర్యాదులు చేసినా మోక్షం లేదుభూములు..● ‘ఇది వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట శివారులోని సర్వేనంబరు 6లోని స్థలం. ఈ సర్వే నంబరులో మొత్తం 11 ఎకరాలు ఉండగా, అగ్రహారం ఆంజేయస్వామి ఆలయానికి 2.18 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూమి ఉండడంతో ఆ సర్వే నంబరు మొత్తాన్ని 22–ఎ, 22–సీలో చేర్చి ఆలయ భూమిగా పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు.. ఆలయానికి 2.18 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందని, మిగతా భూమి పట్టాదారుదేనని నివేదిక ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ 6 సర్వే నంబరులోని 8.22 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏనాడో కొనుగోలు చేసి పెట్టుకున్న ప్లాటు రిజిస్ట్రేషన్ కాక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.’ -
ఆయిల్‌పాంతో దీర్ఘకాలిక ఆదాయం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ముస్తాబాద్(సిరిసిల్ల): ఆయిల్‌పాం సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఆదర్శరైతు డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌ఫాంను మంగళవారం పరిశీలించారు. ఆయిల్‌పాం సాగుతో 15 టన్నుల ఆయిల్ గెలలు తీసి, రూ.3.45లక్షల ఆదాయం పొందారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయిల్‌పాం సాగుతో చీడ, కొతుల బాధలు ఉండవన్నారు. మార్కెటింగ్ సులభంగా వుంటుందని, నర్మెట్టకు సులభంగా ఆయిల్ గెలలను తరలించవచ్చన్నారు. నామాపూర్, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్లలో ఆయిల్ గెలల కలెక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు. అనంతరం గూడెంలో డబుల్బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎంపీల్యాడ్స్‌తో వేసిన బోరు మోటారును ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలుఈసీ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం చీకొడులో నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియను పరిశీలించాలన్నారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈఈ సాజిద్, సర్పంచ్‌లు శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
సిరిసిల్లటౌన్: ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలపై సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు నేతృత్వంలో గాంధీ చౌరస్తాలో కేసీఆర్, తాత మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మరోసారి దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేత హోదాలో హుందాగా వ్యవహరించాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాగా, దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదాలతో జరిగిన తోపులాటల్లో ఓ హోంగార్డు కిందపడిపోయాడు. ఈనేపథ్యంలో అతను దేవరాజు కాలర్ పట్టుకుని లాగడం వివాదాస్పదమై ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ ఫోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనాథ్, ఎస్కే రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తుంటే, ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో నిరసన చేపట్టే అన్ని వర్గాలపై నిర్బంధం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లి నిరసన తెలుపుతారనే ఉద్దేశంతో ఆశాకార్యకర్తలను పోలీసులు, ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం ఉద యం నుంచి రాత్రి 8 గంటలకు సొంత పూచీకత్తుపై ఎవరి ఊర్లకు వారిని పంపించారు. ఆశాకార్యకర్తలు శోభ, జ్యోత్స్న, దేవలక్ష్మి, దేవేంద్ర, సంతోష, కె.రజిత, ఎం.దేవేంద్ర, రజిత, మనూష, వాణి ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లుసిరిసిల్ల: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆర్డీ వోలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి
సిరిసిల్ల: జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిల్లర్లు తప్పనిసరిగా బియ్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల డీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ వెంచర్లపై కొరడాబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించారు. సర్వేనంబర్ 15–ఏ, 15–బీ, 15–సీలో 2.20 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చినా బే ఖాతర్ చేయడంతో పాటు, సదరు ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నట్లు సమాచారం అందుకున్న ఇంచార్జీ ఎంపీడీవో, కార్యదర్శి శేఖర్ మంగళవారం సిబ్బందితో మల్లేశంకు సంబంధించిన వెంచర్లో హద్దురాళ్లను తీయించారు. అలాగే సత్తవ్వకు సంబంధించిన అక్రమ లే అవుట్ వెంచర్‌పై నోటీసు అందచేసినట్లు కార్యదర్శి తెలిపారు. మాతృ, శిశు మరణాలను నివారించాలి సిరిసిల్ల: ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో మంగళవారం ఆశా నోడల్ పర్సన్లలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రత్యేక నిఘా ఉంచి, కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆశా నోడల్ పర్సన్స్ తమ పరిధిలోని ఆశా కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సంపత్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి, నయీమ్ జహా, సీహెచ్‌వో శాంత తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల వేదిక ఆవిర్భావ వేడుకలుసిరిసిల్ల: వృత్తినైపుణ్యంతోనే రాణిస్తారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. దుబాయి వేదికగా ఏర్పడిన గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(జీడబ్ల్యూఏసీ) 10వ ఆవిర్భావ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ, జీడబ్ల్యూఏసీ సైనికులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఎన్ఆర్ఐ పాలసీ నివేదిక తయారు చేయడం జరిగందని, రాష్ట్ర కేబినెట్ ముందుకు వెళ్లిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వమైన బతుకమ్మ, బోనాలు, జానపద గీతాలను ప్రపంచంలో ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆస్వాదించాలన్నారు. జీడబ్ల్యూఏసీ ప్రతినిధులు రాజ శ్రీనివాస్‌రావు, కృష్ణ దొనికెని, వంశీగౌడ్, రవి కటుకం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని రేలరేల గంగ బృందం గీతాలు అలరించాయి. -
అక్షర దీపం వెలిగింది
● జగ్గారావు‘పల్లె’ చదివింది ● వయో‘జనులకు’ రాత్రి బడి చదువులు ● పోలీసుల ప్రోత్సాహం.. పల్లెజనం ఉత్సాహం ● ‘ప్రేరణ’తో చదువుల బాట ● నేడు అక్షరాస్యత దినోత్సవంసిరిసిల్ల: ఆ పల్లెలో అక్షర దీపం వెలిగింది. చైతన్య కాంతులు పల్లవించాయి. నాకెందుకు లే.. చదువు అంటూ మొదట్లో ముక్కు విరిచినా వృద్ధులే.. పలక, బలపం పట్టి అక్షరాలు దిద్దారు. వేలిముద్రలు వేసేవాళ్లంతా సంతకాలు నేర్చుకున్నారు. అంకెలు నేర్చుకొని ఫోన్ నంబర్లు రాస్తున్నారు.. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని జగ్గారావుపల్లి సాధించిన అక్షర విజయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షర పథకాలకు కోట్లు వెచ్చించినా.. ఆచరణలో సాధ్యం కాని పనిని స్థానిక పోలీసులు పన్నెండేళ్ల కిందట సాధించారు. సిరిసిల్ల అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్ ప్రేరణతో గ్రామస్తులు అక్షరాలు దిద్దారు. 2014లో మూడు నెలల్లోనే ఆ పల్లె ప్రజలు సంతకాల సాక్షిగా అక్షరాస్యులుగా మారారు. సెప్టెంబరు 8న అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. చిన్న ఊరు.. పెద్ద విజయం జగ్గారావుపల్లిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చేందుకు పోలీసులు నడుం బిగించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్ ఆ ఊరిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్తులతో మాట్లాడి రాత్రి బడి నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే చదువు విలువను అర్థమయ్యేలా వివరించేందుకు ప్రేరణ పేరుతో జానపద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చదువురాని వారిని గుర్తించేందుకు సర్వే చేశారు. ఊరిలో జనాభా 1050 ఉండగా.. చదువు రాని వారు 154 మంది ఉన్నట్లు గుర్తించారు. రాత్రి బడి ఏర్పాటు చేశారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక్కో విద్యావంతుడికి అక్షరాలు దిద్దించే బాధ్యత అప్పగించారు. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు రాత్రి బడిలో అక్షరాలు దిద్దించారు. 2014 సెప్టెంబర్ 5న సంపూర్ణ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా మూడునెలల వ్యవధిలో జగ్గారావుపల్లిలోని 154 మందికి అక్షరాలు నేర్పించారు. సంతకాలు చేయడం రావడంతో అంకెలు నేర్చుకున్నారు. సెల్‌ఫోన్ నంబర్ రాయడం మొదలుపెట్టారు. రాత్రి బడి ఆ పల్లెలో అక్షర వెలుగులు నింపింది. ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ ఫెయిల్ సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ పేరుతో 2020లో సర్వే చేసింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామాల్లో 49,977 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 13,400, మహిళలు 36,577 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 3,15,611 మంది ఉన్నట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం వెల్లడైంది. ఇందులో పురుషులు 1,82,946, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు 2,36,706 మంది ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 78,905 మంది ఉన్నట్లు తేలింది. చదువు రాని వారికి చదువు నేర్పే లక్ష్యంతో ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలను భాగస్వాములను చేశారు. కానీ ఈ కార్యక్రమం అనేక కారణాలతో ఫెయిల్ అయింది. అయితే పోలీసుల చొరవతో జగ్గారావుపల్లి అక్షరాలు దిద్దింది. జగ్గారావుపల్లి,రాత్రి బడిలో మహిళలకు అక్షరాలు నేర్పిస్తున్న అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య -
జీడీకే–11గనిలో కార్మికుడికి గాయాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11 గనిలో మొదటిషిఫ్టులో గని పైకప్పు కూలి కోల్‌కట్టర్ కార్మికుడు సార్ల సాగర్ గాయపడ్డాడు. గనిలోని 50వ లెవల్, 13వ డీప్, 3వ సీమ్‌లో పైకప్పు సేఫ్టీ పనిచేస్తున్న క్రమంలో పెద్దబండ కూలి కొంతబాగం నడుం, కాళ్లపై పడటంతో కుడికాలుకు గాయాలయ్యాయి. వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాదాసి రాంమూర్తి కార్మికుడిని పరామర్శించారు. లారీ డ్రైవర్ ఆత్మహత్యకోరుట్లరూరల్: పట్టణంలోని అల్లమయ్యగుట్టకాలనీకి చెందిన లారీ డ్రైవర్ ఈర్నాల రాజేశ్ (48)ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజేశ్ కొంతకాలంగా ఫిట్స్వ్యాధితో బాధ పడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రాజేశ్‌కు భార్య భాగ్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భాగ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు జగిత్యాలక్రైం: మల్లాపూర్ మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అసభ్యకరంగా సైగలు చేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు ఆగుల్ల సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చెందిన ఆగుల్ల సత్యనారాయణ ప్రస్తుతం రాయికల్ మండలం భూపతిపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయురాలిని వెంబడిస్తూ.. అసభ్యంగా సైగలు చేస్తూ ఇబ్బందులకు గురిచేయగా గతంలో ఇతడిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడిని విధుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ సదరు ఉపాధ్యాయురాలికి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతూ పెళ్లి చేసుకోవాలని వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. -
అక్కాచెల్లెళ్ల ‘గాజుల’ బంధం
గంభీరావుపేట(సిరిసిల్ల): పల్లె వాతావరణంలో సంప్రదాయాలు కొత్త ట్రెండ్స్‌తో మేళవించి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయతను చాటేందుకు గాజులు వేయించుకోవడం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన చీరలు, ఒకే డిజైన్ గాజులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కాచెల్లెళ్ల అనుబంధానికి గాజులు సింగారించుకుంటున్నాయి. గాజుల గలగలలో సోదరీలు ప్రేమ పంచుకుంటున్నారు. మనస్సు నిండా ఆనందంతో చేతినిండా గాజులు వేసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గాజులు వేయించుకుంటున్న అక్కాచెల్లెళ్లతో పల్లెల్లో సందడి నెలకొంటుంది. గాజుల చప్పుళ్లతో ఆప్యాయత చేతినిండా రంగురంగుల గాజులు ధరించి, అందరూ కలిసి ఒకే తరహాలో ఫొటోలు దిగడం యువతులు, మహిళల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఐక్యతను ప్రతిబింబించేలా గాజులు వేయించుకోవడం సోషల్ మీడియాలోనూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. పల్లె నుంచి సోషల్ మీడియా వరకు.. గతంలో గాజులు అంటే పండుగలు, పెళ్లిళ్లు, సంప్రదాయ వేడుకలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ జోడైంది. స్నేహితులు, అక్కాచెల్లెళ్లు కలిసి గాజులు వేయించుకుని శ్రీసిస్టర్ గ్యాంగ్శ్రీగా ఫొటోలు దిగుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. గాజుల గలగలలో అనుబంధం చేతికి అలంకారమే కాదు.. అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా గాజులు మారుతున్నాయి. ఒకే రంగు.. ఒకే డిజైన్.. ఒకే ఆనందం.. ఇలా పల్లె మహిళల చేతుల్లో గాజుల గలగలలు కొత్త సందడిని తీసుకొస్తున్నాయి. అక్కాచెల్లెళ్లందరం కలిసి గాజుల పండుగ చేసుకున్నం. ప్రేమానురాగాలతో ఒకరికొకరం కొత్త గాజులు వేసుకున్నం. ఒకే రకమైన గాజులు ధరించి సంబురపడ్డాం. అక్కాచెల్లెళ్ల బంధాన్ని చాటి చెప్పేలా ఒకే డిజైన్, ఒకే రంగు గాజులు ధరించాం. మా అనుబంధం మరింత బలపడింది. – ఎర్ర లావణ్య, గంభీరావుపేట, -
భీమేశ్వర దర్శనం నయనానందకరం
వేములవాడ: శ్రావణమాసంలో చివరి సోమవారం సందర్భంగా భీమన్నను దర్శించుకునేందుకు 1,05,600లకు పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంతాలు రద్దీగా మారాయి. షవర్ల వద్ద స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. తడిబట్టలతో భీమన్నకు కోడె కట్టారు. అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారాయణవ్రతాలు, కల్యాణాలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.78 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను డీఈవో ప్రతాప నవీన్, ఏఈవో మహేశ్, పర్యవేక్షకులు పరిశీలించారు. కోడె మొక్కులకు కొట్లాట భీమన్నకు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది. కోడె మొక్కులు చెల్లించుకునే ప్రాంతంలో గొడవ జరిగింది. పీఆర్వో కార్యాలయం నుంచి ఇచ్చే స్పెషల్ కోడె టికెట్లను అధికారులు నిలిపివేయడంతో గొడవ సద్దుమణిగింది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడం లేదని కలెక్టరేట్ ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కలెక్టరేట్ గేట్ వద్ద నిరసన తెలపగా.. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ గడ్డం నగేశ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మెహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా గుడి భూమి విక్రయం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని కేశవపెరుమాండ్ల ఆలయానికి చెందిన సుమారు ఐదెకరాల భూమిని పూజారులు రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించారని సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్తయ్యకు సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నర్సింలుతోపాటు గ్రామస్తులు మాట్లాడుతూ భూమి సంబంధికులకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిపారు. ఆలయ భూమి ఇతరులకు చెందకుండా తిరిగి ఆలయానికి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు వెంకటనర్సింహరెడ్డి, గుండాడి వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, దూస శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
బస్‌షెల్టర్ నిరుపయోగం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ఎదుట ఉన్న బస్‌స్టాప్‌లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఏపుగా గడ్డి పెరిగి బస్‌స్టాప్‌లోకి వెళ్లలేకుండా మారింది. సిరిసిల్లకు వెళ్లే ప్రయాణికులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్టాప్‌లోనే వేచి ఉంటారు. అయితే బస్‌షెల్టర్ ఎదుట ఇలా గడ్డి పెరిగి, బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటిని తొలగించి, గడ్డిని తీసేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల -
ఓటర్లకు నోటీస్ల భయం
వేములవాడ: సర్ నోటీస్‌లతో ఓటుహక్కును కాపాడుకునేందుకు ప్రజల ఆధారాలతో ఆఫీస్‌లు చుట్టూ తిరుగుతున్నారు. ఎస్ఐఆర్(సర్) సవరణకు వస్తున్న నోటీస్‌లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒకే ప్రాంతంలో నివాసముంటున్న వారి పేర్లు కూడా ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం, సవరణ నోటీసులు చేతికి రావడంతో జనం బేజారవుతున్నారు. బీఎల్వో కుటుంబానికీ తప్పని తిప్పలు క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బీఎల్వో జ్యోతి కుటుంబానికి కూడా నోటీస్‌లు అందాయి. ఆమె తల్లి రాజమణి, కుమారుడు శివమణి, కూతురు హిమబిందు పేర్లు గల్లంతయ్యాయి. ఈమేరకు నోటీస్‌లు అందాయి. ఆధారాలతో రాకపోతే ఓటు రద్దు బెదిరింపులు! నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీ, సమయానికి సంబంధిత కార్యాలయానికి తగిన ఆధారాలతో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వయోవృద్ధులు, మహిళలు తమ పనులు వదులుకుని, కాగితాలు చేతపట్టుకుని ఆఫీసుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సాంకేతిక లోపాలు, సిబ్బంది అలసత్వంతో పొరపాట్లు జరుగుతున్నాయని, విచారణ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారానే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 1956 నుంచి ఉంటున్నా వేములవాడలో 1956 నుంచి ఉంటున్నాను. నా పేరు కూడా సవరణ జాబితాలో గల్లంతైంది. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ.. ప్రతీ ఎన్నికలోనూ ఓటుహక్కు వినియోగించుకుంటున్న. అయినా నోటీస్‌లు అందాయి. – కె.సాంబశివరావు, రిటైర్డ్ టీచర్ -
ప్రశాంతంగా గణేశ్ ఉత్సవాలు
సిరిసిల్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈనెల 14 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బందోబస్తు, భద్రత చర్యలపై దిశనిర్దేశం చేశారు. మండపాల వివరాలు, ఊరేగింపు మార్గాలు, సమయం వంటి సమాచారం సేకరించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలు, వివాదాస్పద ప్రదేశాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రతీ మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు రేయింబవళ్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జియోట్యాగింగ్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్టేషన్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, జి.వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్, ఆర్ఐ సురేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ముస్తాబాద్, చీకోడు, గూడెం గ్రామాల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదును సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. 51 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ అమలు చేయాలని, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే టీజీఈ జేఏసీ మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు బాలకిషన్, ప్రధాన కార్యదర్శి శివశంకర్, సత్తయ్య, స్వామి, శంకర్, శివప్రసాద్ పాల్గొన్నారు. కొంత మంది సర్పంచులపై చిన్నచూపువేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని కొంతమంది సర్పంచ్‌లపై అధికారులు, కాంగ్రెస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారంటూ పలువురు సర్పంచులు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ జెండాపై గెలువకుండా ప్రజల అభిమానాలతో గెలిచిన సర్పంచ్‌లను అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. సర్పంచులు జంకె మధు, సాండెసారి సౌజన్య, జుట్టు నరేశ్, సయ్యద్ షాదుల్లా, కడారి సంధ్య, ఇల్లందుల లాస్య ఉన్నారు. వైన్‌షాపుల్లో ఎనర్జీ డ్రింక్స్ విక్రయాలపై ఫిర్యాదువేములవాడరూరల్: మద్యం బాటిళ్లు విక్రయించాల్సిన బ్రాందీ షాపు నిర్వాహకులు ఎనర్జీ డ్రింక్ అమ్మడంతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వేములవాడకు చెందిన బూర్ల ప్రదీప్ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కొందరు వైన్‌షాపు నిర్వాహకులు వాటర్‌బాటిల్స్, కూల్‌డ్రింక్స్ ఇతర తినుబండారాలు కూడా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మానసిక ఆందోళన... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య జ్యోతినగర్: చదువుపై ఆందోళనతో ఇంటర్ విద్యార్థి అయాన్ ఖాన్(17) మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న అంజత్‌ఖాన్ కుటుంబం ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అయాన్ఖాన్ మానసిక వ్యథతో ఉరేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి పైకప్పుకు వేలాడుతూ కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చదువుపై ధ్యాస కుదరడం లేదనే ఆందోళనతో విద్యార్థి మానసికంగా ఇబ్బందికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజద్‌ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బైక్ దొంగ అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కమలాకర్ తన ద్విచక్ర వాహనాన్ని గతనెల 17న ఇంటి ముందు పార్క్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై కుమారస్వామి కేసు దర్యాప్తు చేపడుతుండగా.. సోమవారం మధ్యాహ్నం విద్యానగర్ బైపాస్‌రోడ్ నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని రాయికల్ మండలం వీరాపూర్‌కు చెందిన షేక్ జమీల్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
మూలవాగు.. సిరులసాగు
సిరిసిల్ల: ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉందని.. వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. అయితే జిల్లా రైతులు కాలానికి అనుగుణంగా విస్తారంగా వరి, పత్తి సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,46,118 ఎకరాల్లో వరి పంట వేయగా.. 50,275 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 4,500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. జిల్లాలో ప్రస్తుతం 2,10,380 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి ఏపుగా ఎదుగుతుండగా పత్తిలో మాత్రం కలుపు సమస్య ఎక్కువగా ఉంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో ఈ ప్రాంత రైతులు వరి సాగుచేశారు. వట్టిమల్ల, నిమ్మపల్లి, బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో పసిడి పంటలు కనుచూపు మేర పచ్చదనంతో అలరిస్తున్నాయి. ఎగసిపడుతున్న బోర్లు, పైకొచ్చిన భూగర్భ జలాలతో మూలవాగు పరిసరాల్లో ముచ్చటైన వరిసాగు ఆవిష్కృతమైంది. -
ఇక కాలేజీల్లో యూనిఫామ్ !
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇన్నాళ్లు పాఠశాలల స్థాయి విద్యార్థులకే పరిమితమైన యూనిఫామ్ కాలేజీ విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు చర్యలు చేపట్టింది. కొలతలు తీసుకుంటున్న మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు మహిళా సంఘాల సభ్యులు రంగంలోకి దిగారు. విద్యార్థుల కొలతలు తీసుకుంటూ, వాటికి అనుగుణంగా యూనిఫామ్స్ కుట్టే పనులు మొదలుపెట్టారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందే అవకాశం ఏర్పడింది. 10 కళాశాలలు.. 2,500 మంది విద్యార్థులు జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 2,500 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ యూనిఫామ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే యూనిఫామ్స్ ఉండగా, తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్నారు. తేడా కనిపించకుండా ఉండాలనే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వస్తున్నారు. అదే కాలేజీలకు వచ్చేసరికి యూనిఫాం లేకపోయేసరికి ఒక్కో విద్యార్థి ఒక్కో రంగు దుస్తులతో వస్తున్నారు. దీంతో విద్యార్థుల మధ్య తారతమ్యాలు పొడచూపుతున్నాయి. ఈ భావనలను నివారించేందుకు ప్రభుత్వం యూనిఫాం పంపిణీకి శ్రీకారం చుట్టింది. యూనిఫామ్ అమలుతో విద్యార్థుల మధ్య ఆర్థిక స్థాయి, దుస్తుల విషయంలో తేడాలు కనిపించకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందరూ ఒకే విధమైన దుస్తుల్లో కళాశాలకు రావడం ద్వారా సమానత్వ భావన పెంపొందడంతోపాటు క్రమశిక్షణ పెరుగుతుందని చెబుతున్నారు. ఎంఈవోల పర్యవేక్షణ యూనిఫామ్ కొలతలు, క్లాత్ పంపిణీ, కుట్టు పనులు తదితర ప్రక్రియలను ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యూనిఫామ్స్ సిద్ధం చేసి, నిర్ణీత సమయంలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీలిరంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్‌తో యూనిఫామ్స్ ఇస్తున్నారు. -
● మరుగున పడుతున్న టాయిలెట్ల నిర్వహణ ● పనికిరాకుండా స్మార్ట్ టాయిలెట్స్ ● పట్టించుకోని అధికారులు, పాలకులు
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్లలో స్మార్ట్ వాష్‌రూమ్స్ తుప్పుబడుతున్నాయి. గతంలో జాతీయ అవార్డులు సాధించిన పట్టణంలో ఇప్పుడు ఒకటికి, రెంటికి స్థానికులు తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చి పోయే సందర్శకులకు అత్యవసర పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ఉగ్గపడుతూ.. తెలిసిన వారింటికి వెళ్లే దుస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండు, కొత్తచెరువు, మానేరుతీరం, ప్రధాన జంక్షన్లు, షాపింగ్ ఏరియాల్లో టాయిలెట్స్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా అయితే ఎలా ? పట్టణంలో టాయిలెట్స్ ఇలా..టాయిలెట్స్(పురుషులు) 39(సీట్లు) టాయిలెట్స్(మహిళలు) 29(సీట్లు) బాత్రూమ్స్(పురుషులు) 06 బాత్రూమ్స్(మహిళలు) 04 యూరినల్స్(పురుషులు) 33 -
భీమన్న సేవలో జిల్లా జడ్జి
వేములవాడ: భీమన్నను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి.నీరజ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేదోక్త ఆశీర్వచనం అందించారు. విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం సిరిసిల్లటౌన్: వినాయక వేడుకల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ గణేశ్ ప్రకటనలో తెలిపారు. గణేశ్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యే క తనిఖీలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపా ల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహా ల తరలింపు, నిమజ్జనం సమయంలో మండపాల నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ లైన్లకు సమీపంలో గణేశ్ విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేములు తీసుకెళ్లడం ప్రమాదకరమన్నారు. తెగిపోయిన తీగలు, లూజ్ లైన్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీని అడ్డుకున్న గ్రామస్తులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని సారంపల్లిలో వేగంగా వెళ్తున్న లారీని గ్రామస్తులు అ డ్డుకున్నారు. వారం రోజులుగా గ్రామం నుంచి మట్టి తరలిస్తున్నారు. నెమ్మదిగా కాకుండా వేగంగా లారీలు వెళ్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. వేగంగా వెళ్తున్న లారీని మొదట గ్రామపంచాయతీకి, ఆ తర్వాత తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాంపల్లి గుట్టపై వాహనాల రద్దీ వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ ఆలయమైన నాంపల్లి గుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. గుట్ట పైకి వచ్చిన భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో నరసింహుడిని, కాళీయమర్ధనంలోని నాగదేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా అంతటా వర్షం సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. బోయినపల్లిలో అత్యధికంగా 12.1 మిల్లీమీటర్లు పడింది. వేములవాడ, రుద్రంగి, చందుర్తిల్లో 1.7 మిల్లీ మీటర్ల, వేములవాడ రూరల్‌లో 2.8, సిరిసిల్లలో 0.2, కోనరావుపేటలో 1.6, ఎల్లారెడ్డిపేటలో 6.5, ముస్తాబాద్‌లో 1.3, తంగళ్లపల్లిలో 0.9, ఇల్లంతకుంటలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు. -
సహకారంలో అవినీతి దాపరికం!
చందుర్తి(వేములవాడ): దోచుకున్నోనికి దోచుకున్నంత అనే మాటలు చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చక్కగా సరిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షల్లోపు రుణాలు మాఫీ చేయడంతో సంఘంలో జరిగిన అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో సహకార సంఘం అధికారులు 2024, ఆగస్టులో 51 విచారణ చేపట్టారు. అక్రమార్కులను గుర్తించేందుకు విచారణ అధికారులకు ఏడాది పట్టింది. ఈ విచారణలో సీఈవో గంగారెడ్డి రూ.1.03కోట్లు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించగా, మిగతా రూ.65లక్షలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు అందించారు. ఆ రుణాలను 2008 నుంచి రికవరీ చేయలేదు. ఇంత అవినీతి జరిగినా సహకార సంఘంలో ఏటా జరిగిన ఆడిట్లో తప్పుడు నివేదికలను ఇచ్చిన ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సహకార సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పక్కదారి పట్టించిన సొమ్మును బహిర్గతం చేసిన, రికార్డులను ఆడిట్ చేసిన రికార్డులో ఆడిట్ అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విచారణ అధికారులను తప్పు పడుతున్నారు. రికార్డులు పరిశీలనలతో వెలుగులోకి.. సహకార సంఘంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులను, ఖాతాలను పరిశీలించిన సలు వ్యత్యాసాలను 51 విచారణలో గుర్తించారు. నిధుల వినియోగం, బకాయిల వసూళ్లు, ఖాతాల నిర్వహణ అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విచారణలో ప్రస్తావించినట్లు సమాచారం. రూ.1.68 కోట్ల వ్యవహారంపై చర్చ సంఘానికి సంబంధించిన సుమారు రూ.1.68 కోట్ల వరకు విచారణలో బహిర్గతం చేసి ఏడాదిన్నర కాలం గడిచినా రికవరీ చేయలేదు. నోటీసులతో సరిపెట్టారు. ఇంత భారీ మొత్తానికి సంబంధించిన వ్యవహరంలో సీఈవో గంగారెడ్డి రెండేళ్ల క్రితం సస్పేన్షన్ అయ్యారు. నిధుల దుర్వినియోగానికి సహకరించిన అధికారులను ఎందుకు కాపాడుతున్నారంటూ సంఘం సభ్యులు, రైతుల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గ బాధ్యులపై రికవరీ ఏదీ ? సంఘం పరిధిలోని సభ్యులకు వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణాల వసూళ్లల్లో బాధ్యులైన పాలకవర్గ సభ్యులకు రూ.65లక్షల రికవరీకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వాటి రికవరీ కోసం ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదు. 2008 నుంచి రుణాలు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న పాలకవర్గం సభ్యులే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సభ్యులు బాధ్యత వహించాలని సహకార సంఘం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. సంఘ సభ్యుల సమక్షంలో వివరాలు వెల్లడించాలి చందుర్తి సహకార సంఘం పరిధిలోని సభ్యుల సమక్షంలో సహకార సంఘం ఉన్నతాధికారుల సభ్యుల సమక్షంలో అవినీతి, అక్రమాలు వెల్లడించాలి. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, వసూలు చేసిన సొమ్ము వివరాలు, మిగిలిన సొమ్ము రికవరీకి ఎలా చేస్తారో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సంఘంలో అవినీతి అక్రమాలు జరిగిన సంవత్సరాల్లో ఆడిట్ చేసిన అధికారుపై, రైతులు ప్రమేయం లేకుండా ఎలాంటి విచారణ లేకుండా రెండుసార్లు రుణాలను మంజూరి చేసిన బ్యాంకు సిబ్బంది ఎవరెవరూ అన్న వివరాలను ఉన్నతాధికారులు వివరించి , ఇక ముందు ఇలాంటి అవినతీ , అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నాం చందుర్తి సహకార సంఘంలో 51 విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై లీగల్‌గా చర్యలు చేపట్టేందుకు నివేదికలను సిద్ధం చేసుకుంటున్నాం. సంఘంలో అవినీతి, అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోం. దాదాపు 15 ఏళ్ల రికార్డులు, ఖాతాలు పరిశీలించి.. పక్కదారి పట్టిన సొమ్మును ప్రకటించాం. సంఘం పరిధిలోని సభ్యులు ఎవరూ అనుమానాలు పడొద్దు. సహకార చట్టం ద్వారా చర్యలు తప్పవు. – రామకృష్ణ, జిల్లా సహకార సంఘం అధికారి, రాజన్న సిరిసిల్ల -
సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు గ్రామ పంచాయతీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కామారెడ్డి నవీన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఐదు నెలల క్రితం రెండో బైపాస్‌రోడ్డులోని కామారెడ్డి నవీన్‌రెడ్డి ఇంటి నుంచి రెండో బైపాస్‌రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మించారు. కాగా సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆ రోడ్డును గత నెల 2న జేసీబీ సాయంతో ధ్వంసం చేశాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ధరలు ప్రదర్శించాలి
స్మార్ట్ సిరిసిల్ల స్ఫూర్తిని కొనసాగించేలా పట్టణంలో నలువైపులా కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న సులభ్ కాంప్లెక్సుల్లో నిర్వాహకులు దోపిడీకి పాల్పడకుండా ధరల పట్టిక, సమయపాలన బోర్డులు ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం లేదు. తొట్టీలు పాడైనా మార్చడం లేదు. ఫినాయిల్, బ్లీచింగ్ చేయడం లేదు. అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదు. – బియ్యంకార్ శ్రీనివాస్, సిరిసిల్ల ప్రతిపాదనలు పూర్తయ్యాయి పాతబస్టాండులో సులభ్ కాంప్లెక్సు స్థానంలో మోడల్ టాయిలెట్స్ నిర్మిస్తున్నాం. అక్కడ ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. స్మార్ట్ వాష్‌రూమ్స్ స్థానంలో కొత్త నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం. త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – ఎం.ఎ.ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్. సిరిసిల్ల -
ఆధునికతతో సృజనాత్మక వస్త్రోత్పత్తులు
● వినూత్న ప్రయోగాల శిల్పి నల్ల విజయ్‌కుమార్ ● భవిష్యత్‌లో విజయ్‌కుమార్‌తో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తా ● సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుసిరిసిల్ల/వేములవాడ: మరమగ్గాలు వచ్చిన తరువాత ఆధునికతతో నాణ్యమైన వస్త్రోత్పత్తులు, వినూత్న ఆవిష్కరణ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలో నల్ల విజయ్‌కుమార్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ జకార్డ్ టెక్నాలజీతో నడిచే కార్ఖానాను శనివారం ప్రారంభించి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల కిందటే చేనేత కళాకారుడు నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పారన్నారు. పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు విజయ్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని ప్రశంసించారు. వెండి వెన్నెల చీర ఆవిష్కరణ ‘షిఫ్ట్ జకార్డ్’ పేరుతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వెండి, బంగారంతో ప్రత్యేకమైన చీరలను రూపొందిస్తున్నారని కేటీఆర్ అభినందించారు. ‘వెండి వెన్నెల’ పేరుతో రూపొందించిన చీర అద్భుతంగా ఉందని అభినందించారు. భవిష్యత్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. విజయ్ కోసం అద్భుతమైన కర్మాగారం ఏర్పాటు చేసి, అవసరమైన సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, తుమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తా సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 20 రోజులకు పైగా ఆందోళన చేస్తుండగా.. శనివారం వారిని కలిసి మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దన్నారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహరావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. -
జానపద కెరటాలు!
మట్టి పరిమళాలు..వారికి పల్లె పాటలంటే ప్రాణం. జానపదాలకు అందమైన అర్థాలు అల్లి.. బాణీకట్టి తమ గొంతుకతో పాడి పాటకే జీవం పోస్తున్నారు. పల్లెటూరు నుంచి సినిమాల్లో పాడేవరకూ ఎదిగిన జానపద స్వరం చుంచు నాగవ్వది. చదువు రాకున్నా.. పాటనే శ్వాసగా మార్చుకుని.. తెలంగాణ మట్టి వాసనను తన గొంతుతో జగమంతా పరిచయం చేస్తున్నారు నాగవ్వ. అమ్మమ్మ, తాతయ్యల ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్, సినిమా స్వరాలతో దూసుకుపోతున్నారు మల్లిక్ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లెగుండె చప్పుడును తన గొంతుకగా మార్చుకున్నాడు మరో కళాకారుడు గడ్డం రమేశ్. మట్టి వాసనలు.. పల్లె జీవన సౌందర్యం, బతుకమ్మ, బోనాల విశిష్టతను నరనరానా జీర్ణించుకుని జానపదానికి సరికొత్త ఊపిరి పోస్తున్నారు. తండ్రి యక్షగాన వారసత్వాన్ని ఒంటపట్టించుకుని, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలంగాణ జానపద శిఖరంగా ఎదుగుతున్నారు. – గొల్లపల్లి – వివరాలు 8లోu -
ఇసుక రీచ్‌లపై నిబంధనలు పాటించాలి : కలెక్టర్
సిరిసిల్ల: జిల్లాలో కొత్త ఇసుక రీచ్‌లపై ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ(డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. టీజీఎండీసీ పీవో శ్రీని వాస్, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రశాంత్, కిశోర్‌కుమార్, మున్సి పల్ కమిషనర్ ఖదీర్‌పాషా, తహసీల్దార్లు మహేశ్, మురళి, పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. ఎరువుల కొరత లేదు చందుర్తి(వేములవాడ): ఎరువులకు కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. చందుర్తి పీఏసీఎస్‌లోని ఎరువుల నిల్వలు తనిఖీ చేశారు. యూరియా కోసం పీఏసీఎస్‌కు వచ్చిన రైతులతో మాట్లాడారు. వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఏడీఏ ప్రదీప్ ఉన్నారు. 15న రాజన్న కోడెలు పంపిణీ వేములవాడఅర్బన్: రాజన్న కోడెలను ఈనెల 15న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులకు 150 జతలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులు ఈనెల 10 వరకు https//rajannasiricilla. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
మట్టి రోడ్డు పునరుద్ధరణ
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై మళ్లీ తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ‘వాగొచ్చె.. రోడ్డు పాయే’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, లైట్వెహికిల్స్ వెళ్లేలా తాత్కాలికంగా మట్టి రోడ్డును పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, హెవీ వెహికిల్స్ మినహా మిగతా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అధ్యాపకులకు సన్మానం సిరిసిల్ల అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉత్తమ అధ్యాపకులకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) ఆధ్వర్యంలో శనివా రం సన్మానించారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి శరత్‌కుమార్ చేతుల మీదుగా 10 మంది అధ్యాపకులకు అవార్డులు ప్రదానం చేశారు. టీజీవో అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జబీ, సంఘం నాయకులు బొల్గం సాగర్, రసూల్, అహ్మద్ పాల్గొన్నారు. సర్కారు బడికి పూర్వ విద్యార్థి కానుక సిరిసిల్లటౌన్: విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యాలయానికి పూర్వ విద్యార్థి బోర్వెల్, మోటార్ అందించారు. సిరిసిల్లకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ కుసుమ విఠల్, ఆయన కుమారుడు కుసుమ శరత్ సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బోర్వెల్, మోటార్ అందించారు. శనివారం స్థానిక కౌన్సిలర్ గెంట్యాల శ్యామల చేతుల మీదుగా ప్రారంభించారు. కుసుమ రామయ్య జ్ఞాపకార్థం రూ.1.50లక్షలతో బోర్ ఏర్పాటు చేశారు. డాక్టర్ కుసుమ శరత్, పాఠశాల హెచ్ఎం బైరి రవీందర్, రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మ్యాన ఆంజనేయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, గాజుల ప్రతాప్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు కార్మికుల సమస్యలను వివరిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషాకు వినతిపత్రం అందించారు. కొన్ని వార్డుల్లో 15 రోజులకోసారి డ్రైనేజీ శుభ్రం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కొత్త పాలకవర్గం మున్సిపల్ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటి వేణు, సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో నిరసన గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో తాగునీటి సమస్య తీర్చండి అంటూ కొందరు మహిళలు శనివా రం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కొన్ని వీధుల్లో నల్లా కనెక్షన్లు బ్లాక్ అయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు మురి కిగా వస్తున్నాయన్నారు. పంచాయతీ పరిధి లోని బోర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. నీటి కోసం చేనుల వద్దకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆరు మండలాల్లో చిరుజల్లులు సిరిసిల్ల: జిల్లాలోని ఆరు మండలాల్లో శనివారం చిరుజల్లులు కురిశాయి. కోనరావుపేటలో 7.3 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 2.8, ఇల్లంతకుంటలో 1.0, తంగళ్లపల్లిలో 0.8, గంభీరావుపేటలో 0.5, వేములవాడలో 0.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
పాత పద్ధతిలో ఎరువులు సరఫరా చేయాలి
కోనరావుపేట(వేములవాడ): యాప్‌ను తొలగించి.. పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు శనివారం బైఠాయించారు. వారు మాట్లాడుతూ యాప్‌లో బుకింగ్, సర్వర్ సమస్యలతో కొద్ది రోజు లుగా ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. చేతికొచ్చిన పంటకు యూరియా వేసే కీలక తరుణంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. డిజిటల్ ప్రక్రియ పేరుతో క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ లంబ రాజు, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు ముత్యాల శ్రీని వాస్‌రెడ్డి, నాయకులు పర్శరాములు, భాస్కర్‌రెడ్డి, తాళ్లపెల్లి మధు, శ్రీకాంత్, మహేశ్, లంబ వేణు పాల్గొన్నారు. రైతుల ఆందోళన కోనరావుపేట మండలం సుద్దాలలోని సింగిల్‌విండో గోదాం వద్ద రైతులు ఆందోళన చేశారు. యూరియా ఆన్లైన్లో బుకింగ్ చేద్దామంటే 5 నిమి షాల్లో ఖాళీ కావడంపై వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి వ్యవసాయాధికారి దుర్గరాజు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు. -
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు
సిరిసిల్ల: సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత విద్యార్థులను ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బోధనలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు టీచర్లే రోల్ మాడల్ విద్యార్థులకు టీచర్లు రోల్ మోడల్ అని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఆరో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పద్యం, స్పీచ్ ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. అప్పటి తమ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆమె మాటలతో స్ఫూర్తి పొందానన్నారు. అవార్డు పొందిన ఉపాధ్యాయులు వీరే.. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిలో చిట్నేని శ్రీకాంత్‌రావు, తిరుమల మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్‌లాల్, గుర్రం సందీప్, నర్ర శ్రీనివాసరెడ్డి, మధుకర్‌రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం.లక్ష్మయ్య, మోహమ్మద్ రహీం, సీహెచ్.రమాదేవి, ఎం.కోటేశ్వర్, కొప్పు రాములు, వెంగల మహేశ్, మాదాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం, సీహెచ్.మాధవిలత, ఎన్.కనకయ్య, ఈ.శ్రీనివాస్, కపిల్ల నరేశ్, రామగిరి స్వరాజ్యలక్ష్మి, కొత్తపల్లి మమత, యాస శ్రీలత, డి.రఘు, ఎం.సుజాత, బోనగిరి రాజేందర్, ఊతం విజయకుమార్, దరిపెల్లి రాజేశం, బొల్లి రమేశ్, అణువోజు రాజు, తెల్ల వకుల, మేకల పద్మ, మామిళ్ల విఠల్, కె.జయలక్ష్మి, ఆర్.వసంత, బి.సుధారాణి, టి.గీత ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఈవో మొండయ్య, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. -
అక్షర దీపాలు.. ఆదర్శ మూర్తులు
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కృష్ణం వందే జగద్గురుమ్చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు.కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్‌ఎల్‌ఎన్‌లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్షీడ్ తయారు చేశాడు.గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ.. మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! -
క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి
జమ్మికుంట: గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల క్రీడా ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను. 2012లో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు క్రీడల్లో కీలకమైన మెలకువలు నేర్పిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కోరపల్లి పాఠశాల నుంచి శ్రీను శిక్షణలో వనరసు సుశాంత్, ఇంజం రీతిక, ఎన్.లౌక్యశ్రీ, పింగిళి అక్షర జాతీయస్థాయి హ్యాండ్బాల్పోటీల్లో ప్రతిభ చూపారు. శ్రీను తన కెరియర్లో 80మంది క్రీడాకారులను తయారు చేశాడు. పలువురు ఇండియన్ ఆర్మీ, వివిధ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీను జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు. -
విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం
జ్యోతినగర్: పాఠ్యపుస్తకాల్లోని అంశాలు బోధించడమే కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్‌కుమార్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)గా పనిచేస్తున్న అంజన్‌కుమార్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధిస్తున్నారు. క్లిష్టమైన అంశాలను ప్రయోగాలు, నమూనాలు, దృశ్య ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ప్రశ్నించి, తెలుసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర సేవలకు గుర్తింపుగా 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గీతే, కమిషన్ సభ్యులతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న సంక్షేమపథకాలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, చార్జ్‌షీట్ దాఖలు, దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాలయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పారదర్శకంగా విచారణ ఎస్పీ మహేశ్ బి గీతే మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామన్నారు. కలెక్టర్‌కు అభినందన కలెక్టర్ గరీమా అగ్రవాల్ సేవలను చైర్మన్ వెంకటయ్య అభినందించారు. కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి యోగా పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం జిల్లా స్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఎనమిది మండలాల నుంచి కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాల విద్యార్థులు పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. డీవైఎస్వో రాందాసు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఉప్పల శ్రీనివాస్, ఆడెపు రవీందర్, కల్లూరి రాజు, వెల్దండి శంకర్, గాజుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికం
సిరిసిల్లటౌన్: బీజేపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యంమని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకవపోవడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్న సమయంలో కూడా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. తొలుత సీఎం చిత్రపటాన్ని దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుమాల శ్రీకాంత్, పొన్నాల తిరుపతిరెడ్డి, కర్నె హరీశ్, మీసా సంజీవ్, ఆసాని రామలింగారెడ్డి, ఉడుగుల యాదగిరి, కిరణ్‌నాయక్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


