సిరిసిల్ల: ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, వాహనం నడిపేటప్పుడు నియమాలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ సూ చించారు. సిరిసిల్ల బాలికల జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డీటీవో మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారునడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. రహదారిని దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించొద్దని, అతివేగం, సెల్‌ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు శారద, ఏఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలి
చందుర్తి(వేములవాడ): వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ హెచ్చరించారు. మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డల్లో బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్న రెండు టాటా ఏస్ వాహనాలను సీజ్ చేశారు. కానిస్టేబుల్ రమ్య, హోంగార్డు ఎల్లయ్య ఉన్నారు.
వేతనాలు వెంటనే చెల్లించండి
వేములవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల మంది ఉపాధిహామీ సిబ్బందికి వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు విన్నవించారు. విప్ నివాసంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇతరత్ర టెక్నికల్ వర్కర్స్‌కు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్నారు.
హర్ ఘర్ తిరంగా విజయవంతం చేయండి
సిరిసిల్లటౌన్: బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 10న ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా పార్టీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. సిరిసిల్ల–సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణపై ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం పార్టీ జిల్లా ఎక్స్–సర్వీస్‌మెన్ సెల్ కన్వీనర్ పవన్‌కుమార్‌ను సన్మానించారు. హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ ఆసాని రామలింగారెడ్డి, రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, మల్లారపు సంతోష్‌రెడ్డి, బర్కం లక్ష్మి, నవీన్‌యాదవ్, పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


