సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని డివిజన్ ఆఫీస్, మండల ఆఫీస్,
ఫైర్‌స్టేషన్, ఐసీడీఎస్ ఆఫీస్, తెలంగాణ ప్రభుత్వ రక్తపరీక్షల కేంద్రం, ఆధార్ కేంద్రం వంటి కీలక ఆఫీస్‌లు ఉన్న ప్రాంతానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. చిన్నపాటి చినుకులకే నీటిగుంతలతో అడుగువేయలేని దుస్థితి. సిరిసిల్ల ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీస్‌లు ఉన్న సముదాయంలోని రోడ్డుపై మోకాలు లోతు గుంతలు పడ్డాయి. 1970 ప్రాంతంలో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తాన్ని రెవెన్యూపరంగా పరిపాలన సాగించిన సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్, 1996 కంటే ముందు ఇప్పటి జిల్లాను రెవెన్యూ పరంగా పాలించిన ఆర్డీవో ఆఫీస్‌లు ఉండే సముదాయం ఇది. రోడ్డు పాడయినా తట్టెడు మట్టి పోయించడం లేదు. నిత్యం అధికారులు చూస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
వేములవాడ: రాజరాజేశ్వర దేవస్థానం ఉద్యోగుల ఆధ్వర్యంలో బద్దిపోచమ్మకు
బుధవారం బోనం మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు భీమన్నకు కోడెమొక్కులు సమర్పించి అభిషేకాలు చేశారు. ఉప్పుగడ్డ హనుమాన్ ఆలయం నుంచి బద్దిపోచమ్మ ఆలయానికి బోనాలతో బయలుదేరారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల వేడుక ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనాలకు పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈవో రమాదేవి, ఆలయ ఉద్యోగులు,
వేద పండితులు పాల్గొన్నారు.
అధికారుల సాక్షిగా గుంతల
రోడ్డు !


