మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం

Aug 6 2026 8:20 AM | Updated on Aug 6 2026 8:20 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి(వేములవాడ): మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని మర్రిగడ్డలో మహిళ సంఘ భవనం, శుద్ధ జలకేంద్రాన్ని ప్రారంభించి, అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా విప్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కరువును అధిగమించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కోరుకుంటే, బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం కరువు వస్తేనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అపవాదరావాలని వేడుకున్నారని విమర్శించారు. వరుణుఇ కరుణతో వానాకాలం పంటలకు ఢోకా లేకుండా పోయిందన్నారు. మండల సమాఖ్య సంఘాల ద్వారా సంఘాలు ఆర్థిక స్వావలంబనకు ఆర్టీసీ బస్సులను, రైస్‌మిల్లల ఏర్పాటుకు నిధులు అందజేస్తుందన్నారు. కోటి మందికి ఇందిరమ్మచీరలు అందించేందుకు జిల్లా నేతలే తయారు చేస్తున్నారన్నారు. సర్పంచ్‌ దూది మనీషశ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్‌, పొద్దుపొడుపు లింగారెడ్డి, తహసీల్దార్‌ భూపతి, ఎంపీడీవో రాధ, ఐకేపీ ఏపీఎం కల్యాణి, పార్టీ అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్‌ పాల్గొన్నారు.

హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్‌ కోరారు. కలెక్టరేట్‌ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాకేశ్‌ మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. బాలికల వసతి గృహాలు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మంద అనిల్‌కుమార్‌, నాయకులు పెండెల ఆదిత్య, గర్‌ల్స్‌ కన్వీనర్‌ బర్రెంకల శ్రీహారిక, కో–కన్వీనర్‌ బోదాసు ప్రవళిక, భూక్య సందీప్‌, శశి, అవినాశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement