మహిళా ఉద్యోగి ఫిర్యాదు.. విద్యుత్‌శాఖ అధికారిపై సస్పెన్షన్‌ వేటు! | Sircilla Tgnpdcl Employee Suspension Woman Complaint In Karimnagar Telangana | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగి ఫిర్యాదు.. విద్యుత్‌శాఖ అధికారిపై సస్పెన్షన్‌ వేటు!

Oct 4 2026 11:17 AM | Updated on Oct 4 2026 11:27 AM

Sircilla Tgnpdcl Employee Suspension Woman Complaint In Karimnagar Telangana

సాక్షి, తెలంగాణ: కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్లలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

సిరిసిల్ల సెస్‌ టీజీఎన్‌పీడీసీఎల్‌లోని ఏడీఎం సెక్షన్‌లో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిగా పనిచేస్తున్న కె.రవి తనను వేధిస్తున్నట్లు ఓ మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె చేసిన ఫిర్యాదును ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్‌ కమిటీని ఆదేశించారు.

విజిలెన్స్‌ కమిటీ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా సీఈఎండీ, ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు సెస్‌ ఎండీ తిరుపతి కె.రవిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

అయితే సస్పెన్షన్‌ ఉత్తర్వులు రెండు రోజుల క్రితమే జారీ అయినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షలు బోనస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement