నువ్వేం ముఖ్యమంత్రివి.. నీది ఏం భాష? | Mla Komatireddy Rajagopal Reddy Sensational Comments On Cm Revanth | Sakshi
Sakshi News home page

నువ్వేం ముఖ్యమంత్రివి.. నీది ఏం భాష?

Nov 18 2026 1:47 PM | Updated on Nov 18 2026 1:55 PM

Mla Komatireddy Rajagopal Reddy Sensational Comments On Cm Revanth

సాక్షి, నల్లగొండ జిల్లా: ఉన్న సిటీకే గతి లేదు.. ఫ్యూచర్‌ సిటీ ఎందుకు? అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. నీవ్వేం ముఖ్యమంత్రివి.. నీదీ ఏం భాష?. పండబెట్టి తొక్కుతా అనడం ఏంటి?. మునుగోడు నిధులు ఆపితే మరో చరిత్ర సృష్టిస్తా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘పేదలకు రెండు వేలు కాదు.. ఐదు వేలు ఇచ్చిన తప్పు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందాలి. వచ్చిన వారిలో 10 శాతం అనర్హులు ఉన్నారు. రైతు బంధు నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్లకే ఇస్తున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం కాంట్రాక్టుల్లో లక్షల కోట్లు అప్పు చేసింది. గత ప్రభుత్వం అవినీతి చేసి లక్షల కోట్లు కొల్లగొట్టినవి రికవరీ చేయాలి’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

‘‘చేసిన అప్పులకు వడ్డీ కట్టడమే సరిపోతుంది. మాట తప్పం మడిమ తిప్పం అని అనాడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి  నేర్పారు. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు అందించినది కాంగ్రెస్ ప్రభుత్వం. పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ నేను తిరగను. పదవుల కోసం నేను పాకులాడే వాడిని కాదు. మంత్రి లేకున్నా పర్వాలేదు మీరే ఉండండి కానీ మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మా ఆకాంక్ష’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌లో రెయిన్‌డ్యాన్స్‌లు చేసిన కానిస్టేబుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement