వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననమంటూ గతంలో కూటమి నేతలపై నిప్పులు చెరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పుడు అదే కూటమి అధినేత చంద్రబాబుతో ఆత్మీయంగా మెలగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సాక్షి ‘చెట్టపట్టాల్’ అని రాస్తే.. ఏదో అసభ్య పదమన్నట్టు షర్మిల ఆవేదన వ్యక్తం చేయడం.. ఆమెకు మద్దతుగా కూటమి నేతలు చెలరేగిపోవడం.. ఇందంతా వైఎస్ జగన్‌పై బురద చల్లడానికి ఓ పెద్ద స్కెచ్‌లా కనిపిస్తోంది.
ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీకి చెందిన కార్యకర్తలు, యూట్యూబర్లు తరచుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ స్పేస్ చర్చలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై షర్మిల ఎందుకు స్పందించలేదు. కానీ, సాక్షిలో కేవలం ‘చెట్టపట్టాల్’ అనే పదం ఉపయోగించినందుకు నానాయాగీ చేస్తున్నారు. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
మరో కోణం పరిశీలిస్తే.. రామోజీ ప్రజా సేవకుడు కాదు. ప్రజాప్రతినిధిగానూ పనిచేయలేదు. అయితే, రామోజీరావు జయంతిని కూటమి సర్కార్.. రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో కంగుతిన్న చంద్రబాబు సర్కార్.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇలా ప్లాన్ చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.
గతాన్ని పరిశీలిస్తే.. అసలు లోకేశ్ మామ బాలకృష్ణ స్వయంగా మహిళలపై అత్యంత దుర్మార్గంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి.. లేదంటే ముద్దైనా పెట్టాలి’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించినపుడు లోకేశ్ ఏమయ్యాడు? రాజకీయాలకు సంబంధం లేని సినీ ప్రముఖుల కుటుంబాలనూ పచ్చ మూకల సోషల్ మీడియా వేధింపులు వదలడం లేదు.
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు, థంబ్‌నెయిల్స్ ప్రచారం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైనా గతంలో ఇదే కూటమి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు వెలుగుచూశాయి. ఇలాంటి సందర్భాల్లో మహిళల గౌరవం గురించి రాజకీయ నాయకుల నుంచి ఇదే తరహా బహిరంగ ఖండనలు లోకేశ్ ఎందుకు చేయలేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇదీ చదవండి: ‘చెట్టపట్టాల్’కూ పెడర్థాలా..?


