సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిన్న అర్ధరాత్రి కణంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారు. పోలీసుల దాష్టీకాన్ని ఫోన్‌లో చిత్రీకరిస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. వీడియో తీసినవారి ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. పోలీసుల దౌర్జన్యంపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
అరెస్ట్ చేసిన నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న సీఐ పురుషోత్తం రాజును వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ సీఐ సమాధానమిచ్చారు. ఎన్నికలు జరగనివ్వకూడదని ఆదేశాలు వచ్చాయా? అంటూ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. అక్రమ అరెస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తీవ్ర తుపానుగా బలపడిన అక్వాన్


