పల్నాడులో ఉద్రిక్తత.. మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్‌! | Palnadu Police Over Action With YSRCP Candidates | Sakshi
Sakshi News home page

పల్నాడులో ఉద్రిక్తత.. మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్‌!

Nov 18 2026 10:32 AM | Updated on Nov 18 2026 10:47 AM

Palnadu Police Over Action With YSRCP Candidates

సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో పల్నాడు జిల్లాలో పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులను అక్రమంగా పోలీసులు ‍స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామానికి చెందిన మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

వివరాల మేరకు.. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రోసూరు మండలం నాగవరంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అనంతవరానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని క్రోసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సత్తెనపల్లికి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామానికి చెందిన మహిళలు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నామినేషన్లు దాఖలు చేయకుండా ఎలా అడ్డుకుంటారని మహిళలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాలతో నాగవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: పులివెందులలో హై టెన్షన్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement