‘చెట్టపట్టాల్‌’కూ పెడర్థాలా..? | Full Clarity For Lokesh Over Chettapattal Word | Sakshi
Sakshi News home page

‘చెట్టపట్టాల్‌’కూ పెడర్థాలా..?

Nov 18 2026 5:20 AM | Updated on Nov 18 2026 5:20 AM

Full Clarity For Lokesh Over Chettapattal Word

‘చెట్టపట్టాల్‌’ అంటే కలసిమెలసి నడవడమే..  

గురజాడ దేశభక్తి గేయంలోనూ ఇదే ప్రయోగం 

చంద్రబాబు–షర్మిల రాజకీయ సాన్నిహిత్యంపై సాక్షి కథనానికి లోకేశ్‌ వక్రభాష్యం 

మహిళల గౌరవంపై నీతులు వల్లెవేస్తున్న చినబాబు..  

గతంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలప్పుడు ఏమయ్యారు? 

భారతితో పాటు షర్మిల వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? 

బాలకృష్ణ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలప్పుడు లోకేశ్‌ ఏమయ్యాడు? 

అల్లు అర్జున్‌ భార్య, జూ.ఎన్టీఆర్‌ తల్లిపై అసభ్య పోస్టులపై ఎందుకు స్పందించలేదు? 

లోకేశ్‌ ఇద్దరు అత్తలకు హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు? 

మీ నానమ్మ ఆస్తి మిగిలిన వారికి ఇవ్వకుండా మీకు మాత్రమే ఎందుకు ఇచ్చింది?  

సాక్షి, అమరావతి: ‘చెట్టపట్టాల్‌’ అంటే ఏదో వినగూడని, రాయగూడని పదమన్నట్టు షర్మిల వాపోవడం.. ఆ వెంటనే అపర నారీ ఉద్ధారకుడిలా నారా లోకేశ్‌ చెలరేగిపోవడం.. ఇదే అసలు ‘చెట్టపట్టాల్‌’ అంటే... మీరు కలసిమెలసి ఉన్నారని, కలసి నడుస్తున్నారని దాని అర్థం. అది సాధారణ తెలుగు నుడికారమే. ఇద్దరు స్నేహితుల్లా ఒక్కటిగా కలసి నడుస్తున్నారని దాని అర్ధం. ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు కలసి పనిచేస్తున్నప్పుడు మరి ఏమంటారు. 

చెట్టపట్టాలేసుకుని నడుస్తున్నారంటే అంత సన్నిహితంగా ఉన్నారని అర్థం. అంతే కానీ అందులో పెడర్థమేమీలేదు. గురజాడ దేశభక్తిగేయం ఒకసారి చదువు చినబాబూ.. లేదంటే ఇంగ్లిషు ట్యూషన్‌ టీచర్‌ కాకుండా తెలుగు వచ్చిన ఎవరినైనా పట్టుకుని అడిగి తెలుసుకో.. ‘చెట్టపట్టాల్‌ పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్‌’ అని గురజాడ గేయంలో ఉంటుంది. అంత కలసిమెలసి ఐకమత్యంగా ఉండాలని దాని అర్థం.

చంద్రబాబు, షర్మిల రెండు రాజకీయ పార్టీల నాయకులు. రాజకీయ ప్రత్యర్థులు. అయినా తరచూ కలుస్తున్నారు. కలిసి నడుస్తున్నారు. అనే అర్థమే ఉంది ఆ శీర్షికలో.. ఆ కథనంలో.. ఈ పదం తెలుగు పత్రికల్లో తరచూ కనిపించేదే. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఎన్నిసార్లు రాలేదు.. ఎల్లోమీడియాలో వస్తే ఒక అర్థం.. సాక్షిలో వస్తే పెడర్థం ఉంటుందా? 

మహిళల గౌరవం ఇప్పుడే గుర్తుకొచ్చిందా? 
సాక్షి దినపత్రికలో ‘బాబుతో చెట్టపట్టాల్‌’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనాన్ని లోకేశ్‌ వక్రీకరిస్తూ తీవ్రంగా ఖండించారు. ఒక మహిళను కించపరిచేలా కథనం ఉందని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రాథమిక విలువలను కోల్పోకూడదంటూ నీతివాక్యాలు వల్లె వేశారు. మహిళలపై వ్యక్తిగత దాడులకు రాష్ట్రంలో స్థానం లేదని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ముడిపడ్డ కథనం పట్ల ఈ స్థాయిలో స్పందించిన లోకేశ్‌.

గతంలో తమ కూటమి పారీ్టలకు చెందిన కార్యకర్తలు, సోషల్‌ మీడియా ఖాతాల నుంచి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఇదే స్థాయిలో ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల గౌరవం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వ హననం.. ఈ విలువలు రాజకీయ అవసరాలను బట్టే గుర్తుకొస్తాయా? ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక రకంగా.. సొంత కూటమి శ్రేణుల నుంచి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు వచ్చినప్పుడు మరో రకంగా వ్యవహరించడం ఏ విధమైన నైతికత? అంటూ మంత్రి నారా లోకేశ్‌ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిలదీస్తున్నారు.

మీపై మాట్లాడినా ఎందుకు స్పందించలేదు?
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై టీడీపీకి చెందిన కార్యకర్తలు, యూట్యూబర్లు తరచుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్‌ స్పేస్‌ చర్చలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అందులో షర్మిలపైనా జుగుప్సాకర మాటలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీనిపై షర్మిల ఎందుకు స్పందించ లేదు? పచ్చ మూకల పైశాచికత్వాన్ని ఎందుకు ఖండించలేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ కూడా ఈ వ్యవహారంపై పెదవి విప్పలేదు.

మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే లోకేశ్‌.. ఆ సమయంలో సోషల్‌ మీడియా దురి్వనియోగంపై ఎందుకు గట్టిగా స్పందించలేదు? అసలు లోకేశ్‌ మామ బాలకృష్ణ స్వయంగా మహిళలపై అత్యంత దుర్మార్గంగా వ్యాఖ్యలు చేశాడు.  ‘అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి.. లేదంటే ముద్దైనా పెట్టాలి’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించినపుడు లోకేశ్‌ ఏమయ్యాడు? రాజకీయాలకు సంబంధం లేని సినీ ప్రముఖుల కుటుంబాలనూ పచ్చ మూకల సోషల్‌ మీడియా వేధింపులు వదలడం లేదు.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు, థంబ్‌నెయిల్స్‌ ప్రచారం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులపైనా గతంలో ఇదే కూటమి సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు వెలుగుచూశాయి. ఇలాంటి సందర్భాల్లో మహిళల గౌరవం గురించి రాజకీయ నాయకుల నుంచి ఇదే తరహా బహిరంగ ఖండనలు లోకేశ్‌ ఎందుకు చేయలేదనే చర్చ జరుగుతోంది. 

‘సాక్షి’ కథనానికి వక్రభాష్యం.. 
చంద్రబాబు, షర్మిల మధ్య రాజకీయంగా సాన్నిహిత్యం ఉందనే కోణంలో సాక్షి కథనం ప్రచురించగానే లోకేశ్‌ స్పందించడం రాజకీయ వర్గాల్లో మరో చర్చకు దారితీసింది.  షర్మిల వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఏమాత్రం భంగం కలిగించనప్పటికీ.. ఆ కథనానికి వక్రభాష్యం పలుకుతూ లోకేశ్‌ నోట సరి కొత్తగా నీతిసూక్తులు రావడం గమనార్హం. 

వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననం జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు కనిపించని ఆగ్రహం.. ఇప్పుడు చంద్రబాబు, షర్మిల భేటీపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాన్ని వక్రీకరిస్తూ మండిపడటం ఎందుకని సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశ్నిస్తున్నారు.  

సందు దొరికింది కదా అని బురదజల్లడం, ఏది దొరికినా బురదజల్లడానికి అస్త్రంగా మార్చుకోవాలనుకోవడం తగదని విశ్లేషకులంటున్నారు. అసలు రాష్ట్రంలో మహిళల పరిస్థితిపై లోకేశ్‌ ఏనాడన్నా స్పందించారా? మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులు, భౌతిక దాడులు, హత్యలు, వేధింపుల కారణంగా ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి? వాటిపై కనీసం స్పందించిన పాపాన పోయారా?

మీరే మహిళోద్ధారకులన్నట్లు... 
రాష్ట్రంలో మహిళల సంగతి సరే .. అసలు తనకు తండ్రి తరఫున ఇద్దరు అత్తలున్నట్లు లోకేశ్‌కు తెలుసా? వాళ్ల పేర్లేమిటి చినబాబూ? వాళ్లకు మీ హెరిటేజ్‌లో వాటా ఇచ్చారా? పోనీ మీ బాబాయి రామ్మూర్తి నాయుడుకు వాటా ఇచ్చారా? రామ్మూర్తి నాయుడు బతికున్నప్పుడు సంకెళ్లు వేసి బంధించారు. 

ఇక ఇద్దరు అత్తలు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా? షర్మిల వివాహమై పాతికేళ్లు గడచిపోయినా.. వైఎస్సార్‌ మరణించి 10 ఏళ్లు దాటినా జగన్‌ తన చెల్లెలికి ఆర్థికంగా అండగానే ఉంటూ దాదాపు రూ.230 కోట్లు ఇచ్చారు. పెళ్లై పాతికేళ్లు దాటిన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో సోదరికి ఆర్థికంగా అండగా నిలిచే అన్నలు ఎక్కడైనా ఉంటారా? రూ.లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే మీ తండ్రి తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? తన తోబుట్టువులకు ఏనాడైనా కనీసం రూ.2 లక్షలైనా ఇచ్చారా? సొంత చెల్లికి కాలు ఫ్రాక్చర్‌ అయితే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని ఆమె అల్లుడే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన విషయాన్ని మీరంతా మరిచిపోతే ఎలా? మీరు మీ బాబాయిని, ఇద్దరు అత్తలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అమరావతిలో ఐదెకరాల్లో నిర్మిస్తున్న ప్యాలెస్‌ భూమిపూజకు మీ అత్తలను ఆహ్వనించారా? మాదాపూర్‌లోని ఏడు ఎకరాల భూమిని మీ నానమ్మ మీకు మాత్రమే ఎందుకు బహుమతి­గా ఇచ్చారు? మిగిలిన వారసులకు వాటా ఎందుకు ఇవ్వ­లేదు? హెరిటేజ్‌లో వాటా ఇవ్వాలని ఇపుడు మీ అత్తలు వస్తే.. దానిని జగన్‌ సమర్థిస్తే మీకు ఎలా ఉంటుంది లోకేశూ..? మీరు ఇతరుల కుటుంబాలలో చిచ్చుపెట్టి, ఆడ­పిల్లలను రాజకీయ ప్రయోజనాల కోసం బజారుకు లాగ­డం ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement