6న మినీ జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

6న మినీ జాబ్‌మేళా

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల

● జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల

సిరిసిల్ల: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు అక్టోబరు 6న కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన ఆఫీస్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.నిర్మల శనివారం తెలిపారు. ప్రైవేటు రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని వివరించారు. ఈనెల 6న నిర్వహించే మినీ జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. 50 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులకు రూ.20వేలు నుంచి రూ.50వేల వరకు వేతనంతోపాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సౌకర్యం ఉంటుందని వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 90107 84112లో సంప్రదించాలని తెలిపారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని, సైబర్‌నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల రూరల్‌ సీఐ కదిరి నాగేశ్వరరావు, తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌వో సిరిసిల్ల అశోక్‌ కోరారు. మండలంలోని మండెపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్‌ వినియోగం – అనర్థాలు, సైబర్‌ నేరాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షణికావేశంలో అలవాటయ్యే మాదకద్రవ్యాలు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయన్నారు.

నేడు సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల మినీ స్టేడియంలో 12వ సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ తెలిపారు. అండర్‌ 10, 12, 14 బాలబాలికలకు 60, 200, 300, 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, కిడ్స్‌ జావెలిన్‌, ట్రయథ్లాన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్‌ జారీచేసిన పుట్టినరోజు సర్టిఫికెట్‌తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని కోరారు.

జిల్లాకు ఐదు సబ్‌స్టేషన్లు

సిరిసిల్లటౌన్‌/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఐదు కొత్త సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. ఈమేరకు సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి నుంచి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు వెలువడినట్లు సిరిసిల్ల ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, డీఈ అంజయ్యలు శని వారం తెలిపారు. ఇల్లంతకుంట మండలం దాచారం, వెల్జీపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలం పదిర, బండలింగంపల్లి, హరిదాస్‌నగర్‌లలో కొత్తగా 33 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న ట్లు పేర్కొన్నారు. తద్వారా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement