వరకట్న వేధింపులకు వివాహిత బలి | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు వివాహిత బలి

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

కోనరావుపేట(వేములవాడ): వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ, మల్లయ్య దంపతుల కూతురు రేణుక(30)ను బావుసాయిపేటకు చెందిన గెంటె ప్రశాంత్‌కు 15 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి పిల్లలు లేరు. రేణుక వ్యవసాయ పనులకు వెళ్తుండగా, ప్రశాంత్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా భర్తతోపాటు అత్త కొమురవ్వ, ఆడబిడ్డ పద్మ అదనపుకట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. వేధింపులు భరించలేక శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి సోదరి గడ్డం మమత ఫిర్యాదుతో సీఐ రవీందర్‌, ఎస్సై రామ్మోహన్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బాస లింగయ్య(55) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో విధులు నిర్వహించే లింగయ్య ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన ముగిసిన అనంతరం వివిధ పనులు చేయిస్తుండగా బుధవారం రాత్రి గుండెనొప్పి వచ్చింది. వెంటనే కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. లింగయ్యకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల గ్రామంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మృతిచెందగా.. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ శనివారం రాత్రి పరామర్శించారు. మల్యాలకు పార్టీ సీనియర్‌ నాయకులు అర్సం దేవయ్య, అర్సం రాములు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఈసరి శ్రీనివాస్‌, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు మల్లారపు రాజయ్య, నాయకులు సంటి ప్రసాద్‌, దొంగరి భూమయ్య తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట: కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వంగ శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని లయన్స్‌క్లబ్‌లో శనివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి గుర్రపు రాములు, కోనేటి పోచయ్య, మద్దుల శ్రీపాల్‌రెడ్డి, పందిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, వంగ శ్రీకాంత్‌రెడ్డి, గంట వెంకటేశ్‌గౌడ్‌ పోటీపడ్డారు. ఓటింగ్‌లో వంగ శ్రీకాంత్‌రెడ్డి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement