రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీకి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీకి ఎంపిక

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● డెంగీ కేసు నమోదుతో అప్రమత్తం

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా ప్రాఠశాలల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–17 బాలికల క్రికెట్‌ ఎంపికల్లో సిరిసిల్లకు చెందిన బి.సహస్ర ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. సిరిసిల్లలోని ఇంగ్లిష్‌ యూనియన్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సహస్ర 70వ ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది.

మూడపల్లిలో వైద్యసిబ్బంది సర్వే

చందుర్తి(వేములవాడ): మండలంలోని మూడపల్లిలో జ్వర బాధితుల ఇళ్లలో వైద్యాధికారులు శనివారం వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన తమ్మల శ్రీలత జ్వరంతో బాధపడుతూ వేములవాడ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యపరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంగనర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారి వేణుమాధవ్‌ గ్రామంలోని జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీహెచ్‌వోలు శశకళ, మోహన్‌, హెచ్‌ఈవో ఆంజనేయులు, హెల్త్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌, ఎంఎల్‌హెచ్‌వో విశ్వేశ్వర్‌, ఏఎన్‌ఎం పుష్ప, ఆశవర్కర్లు స్రవంతి, అరుణ పాల్గొన్నారు.

విద్యుత్‌శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్‌శాఖ పరిపాలన విభాగంలో పనిచేస్తున్న జేఏవో రవి ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేశారు. ఈమేరకు రెండు రోజుల క్రితమే విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి తిరుపతి ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement