గ్రామీణ క్రీడాకారుల్లో పవర్ ఉంది
కరీంనగర్‌స్పోర్ట్స్: ఈటె.. విసిరితే సుర్రున ఆకాశమంతా ఎత్తుకెళ్తున్నాయి. పోటీలో దిగితే విజయం ఖాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జావెలిన్‌త్రోపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ జోష్ రావడానికి ఐదేళ్ల క్రితం అంటే 2021 ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌చోప్రా సాధించిన విజయమే. అథ్లెటిక్స్ చరిత్రలోనే భారత్‌కు మొదటి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. ఆ విజయంతో దేశంలోని యువతలో జావెలిన్‌త్రోపై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఆ విజయానికి గుర్తుగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఏటా ఆగస్టు 7ను నేషనల్ జావెలిన్ డేగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో జావెలిన్ త్రో క్రీడకు వస్తున్న ఆదరణపై ప్రత్యేక కథనం.
మట్టి ట్రాక్‌లపై..
ఒకప్పుడు జిల్లాలో అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ వరకే పరిమితం. కానీ ఐదేళ్ల నాటి ఒలింపిక్స్ విజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని ఏ మైదానంలోకి వెళ్లి ఒకరిద్దరు యువకులు ఈటెలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు.
సదుపాయాలు కల్పిస్తే..
జిల్లాలో ప్రతిభకు కొదవలేకపోయినా వసతుల కొరత క్రీడాకారులను వేధిస్తోంది. నాణ్యమైన జావెలిన్ స్టిక్స్ ధరలు వేలల్లో ఉండటంతో పేద, మధ్యతరగతి క్రీడాకారులు సొంతంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో సింథటిక్ రన్‌వేలు, ఆధునిక జిమ్ సదుపాయాలు, ప్రత్యేక అథ్లెటిక్స్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని క్రీడావిశ్లేషకులు పేర్కొంటున్నారు.
నీరజ్ చోప్రా
జావెలిన్ త్రోపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ పొందుతున్న యువత
నేడు జాతీయ జావెలిన్ దినోత్సవం
గతంలో అసోసియేషన్ ట్ర యల్స్ నిర్వహిస్తే ఐదారుగురు కూడా వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో హాజరువుతున్నారు. గ్రామీణ ప్రాంత అథ్లెట్లలో సహజంగానే మంచి భుజబలం ఉంటుంది. జావెలిన్‌కు అదే ప్రధానం. దీనికి టెక్నిక్, ఫ్లెక్సిబిలిటీ తోడైతే రాణించే అవకాశాలు ఉంటాయి.
– నందెల్లి మహిపాల్, అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు


