చందుర్తి: దేశభక్తిని చాటుకునేందుకు ప్రతీ పౌరుడు ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ కోరారు. మండల కేంద్రంలో హర్‌ఘర్ తిరంగాలో భాగంగా శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. విజేందర్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. ఈనెల 11 నుంచి 14 వరకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, గంగాధర్, తీపిరెడ్డి మనోహర్‌రెడ్డి, చారి పాల్గొన్నారు.


